NEEKE SARANU / నీకే శరణు / AAV SERIES 05 EP 474 / VEDAVYASA ANANDA BHATTAR / DARBARU KANADA

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • 🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 474
    ( నీకే శరణు నీవు నన్ను గరుణించు .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 474 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    దిక్కిల నీవొక్కడవే ,
    మ్రొక్కితి నీకొక్కనికిట ; రొప్పకు హరి నే
    నొక్కడ నయిపోదునయా
    తక్కక గావవలె నీవె దయచూపుమయా !
    🌹🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఓ హరీ !
    నాకు వేరు దిక్కు లేదు నీవు తప్ప !
    నిన్ను మాత్రమే నమ్మి ప్రార్థించుచున్నాను !🙏
    కోపము చూపకు నా మీద !
    అలా చేస్తె నేనొక్కడినే అయిపోతానయ్యా ,
    నువ్వు నాతో ఉన్నావన్న ఆ ఒక్క దైర్యము కూడా సడలిపోతుందయ్యా ! 🙏
    కావున అవశ్యము నీవే నన్ను రక్షించుటకు దయచూపవలెను కదయ్యా ! కాదనకు !🙏
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారు సంపూర్ణ శరణాగతి చేస్తున్నారు ఈ కీర్తనలో .
    స్వామీ నీవే , నీవు మాత్రమే నాకు ఆశ్రయము !
    స్వామీ నీకే , నీకు మాత్రమే నే శరణునుచున్నాను !🙏
    అంటూ అతడొక్కడే సర్వోన్నతుడు గావున, ఆతనికి మించిన వారు మరి ఎవ్వరూ లేరు శరణాగతి చేయుటకు, అని కీర్తించుచున్నారు .🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    స్వామీ ! నీకు మాత్రమే నే శరణని వేడుచున్నాను .
    నీవే నాపై తప్పక కరుణ చూపవలెను .🙏
    ఇక్కడ ఈ భుమిపైననైనా , అక్కడ ఆ పరలోకమందైనా , నాకు ఆశ్రయముగా ఇంక ఎవ్వరున్నారయ్యా నీవు తప్ప ! 🙏
    🌹🌹
    స్వామీ ! నీవు ఆ సూర్యుడూ చంద్రుడూ నీ రెండు కన్నులుగా గలవాడవు .
    పాపములను, దుష్టులనూ దహించి వేయగల దివ్యతేజస్సు గల చూపూ నీదే ,
    శిష్టులపై దయ కరుణ అనే పండువెన్నెల వంటి చల్లని చూపూ నీదే !🙏
    అనుబంధముతో భూదేవిని శ్రీదేవిని చేరదీసుకుని వారికి పతివైన గొప్పవాడవు నీవు !🙏
    అన్ని విధాలుగా ఆ బ్రహ్మకు తండ్రివి గురువువూ నీవే , తొలుతనుంచీ ఉన్న దేవుడవు నీవొక్కడవే ! 🙏
    ఇంతటివాడవు కదయ్యా ! ఇక నేను గొప్పగా ఒకరిని ఎంచుకొని ఆశ్రయించుటకు , నీకన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అసలు ! 🙏
    🌹🌹
    సకల దేవతలూ నీ మంగళకరమైన దేహములో ఒదిగి కొలువై యున్న దివ్యమంగళ మూర్తి స్వరూపమువు నీవు ! 🙏
    అటుపక్క చూచితే ఆనాడు నీ పాదము క్రింద భువనమంతా తొక్కిన ఘనుడవు .🙏
    ఇన్ని చెప్పనేల ఆనాటి నుంచీ , ఈనాటి వరకూ , మరి యేనాటి దాకా యైనా స్థిరముగా నిలిచి ఉన్నవాడవూ , నిలిచియుండెడి వాడవూ నీవొక్కడవే !🙏
    ఏ సమయములోనైనా నీకంటే గొప్పవాడని చెప్పుటకు ఇక ఎవరున్నారయ్యా ? లేనే లేరు నీవు తప్ప !🙏
    🌹🌹
    విచారించి చూసుకుంటే జీవాత్మలమైన మా అందరికీ అంతరాత్మవు నీవే ఓ శ్రీ హరి !🙏
    నిజమైన సిరులనబడే వరములను నీవొక్కడవే ఈయగలవు ఓ శ్రీ వేంకటేశ్వరా !🙏
    పురుషులలోకెల్లా సర్వశ్రేష్టుడవూ , ఈ లోకములనన్నిటినీ కాచి రక్షించుచున్న వాడవూ నీవే ! 🙏
    నాకు ఆశ్రయమై నీవు ఉన్నావు ! నీవే ఉన్నావు !
    ఇంతకన్నా గొప్ప ఆశ్రయమును మరి వేరెవ్వరీయజాలరు ! 🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 474 )
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    నీకే ( నే ) శరణు నీవు నన్నుఁ గరుణించు
    యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను
    ॥చ1॥
    కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
    పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
    అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
    యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను
    ॥చ2॥
    దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
    ఆవలఁ బాదాన లోక మణఁచితివి
    నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
    యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను
    ॥చ3॥
    అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
    సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
    పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
    యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను
    🌹🙏🌹🙏🌹
    #NEEKESARANU #నీకేశరణు #ANANDABHATTAR #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyaaksharavedam #sriramanavami #sriramasongs #ramabhajan #annamayyakeerthanalu #annamayyasongs

КОМЕНТАРІ • 5

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +2

    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 474
    ( నీకే శరణు నీవు నన్ను గరుణించు .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 474 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    దిక్కిల నీవొక్కడవే ,
    మ్రొక్కితి నీకొక్కనికిట ; రొప్పకు హరి నే
    నొక్కడ నయిపోదునయా
    తక్కక గావవలె నీవె దయచూపుమయా !
    🌹🙏🌹
    ✍ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఓ హరీ !
    నాకు వేరు దిక్కు లేదు నీవు తప్ప !
    నిన్ను మాత్రమే నమ్మి ప్రార్థించుచున్నాను !🙏
    కోపము చూపకు నా మీద !
    అలా చేస్తె నేనొక్కడినే అయిపోతానయ్యా ,
    నువ్వు నాతో ఉన్నావన్న ఆ ఒక్క దైర్యము కూడా సడలిపోతుందయ్యా ! 🙏
    కావున అవశ్యము నీవే నన్ను రక్షించుటకు దయచూపవలెను కదయ్యా ! కాదనకు !🙏
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యుల వారు సంపూర్ణ శరణాగతి చేస్తున్నారు ఈ కీర్తనలో .
    స్వామీ నీవే , నీవు మాత్రమే నాకు ఆశ్రయము !
    స్వామీ నీకే , నీకు మాత్రమే నే శరణునుచున్నాను !🙏
    అంటూ అతడొక్కడే సర్వోన్నతుడు గావున, ఆతనికి మించిన వారు మరి ఎవ్వరూ లేరు శరణాగతి చేయుటకు, అని కీర్తించుచున్నారు .🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    స్వామీ ! నీకు మాత్రమే నే శరణని వేడుచున్నాను .
    నీవే నాపై తప్పక కరుణ చూపవలెను .🙏
    ఇక్కడ ఈ భుమిపైననైనా , అక్కడ ఆ పరలోకమందైనా , నాకు ఆశ్రయముగా ఇంక ఎవ్వరున్నారయ్యా నీవు తప్ప ! 🙏
    🌹🌹
    స్వామీ ! నీవు ఆ సూర్యుడూ చంద్రుడూ నీ రెండు కన్నులుగా గలవాడవు .
    పాపములను, దుష్టులనూ దహించి వేయగల దివ్యతేజస్సు గల చూపూ నీదే ,
    శిష్టులపై దయ కరుణ అనే పండువెన్నెల వంటి చల్లని చూపూ నీదే !🙏
    అనుబంధముతో భూదేవిని శ్రీదేవిని చేరదీసుకుని వారికి పతివైన గొప్పవాడవు నీవు !🙏
    అన్ని విధాలుగా ఆ బ్రహ్మకు తండ్రివి గురువువూ నీవే , తొలుతనుంచీ ఉన్న దేవుడవు నీవొక్కడవే ! 🙏
    ఇంతటివాడవు కదయ్యా ! ఇక నేను గొప్పగా ఒకరిని ఎంచుకొని ఆశ్రయించుటకు , నీకన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అసలు ! 🙏
    🌹🌹
    సకల దేవతలూ నీ మంగళకరమైన దేహములో ఒదిగి కొలువై యున్న దివ్యమంగళ మూర్తి స్వరూపమువు నీవు ! 🙏
    అటుపక్క చూచితే ఆనాడు నీ పాదము క్రింద భువనమంతా తొక్కిన ఘనుడవు .🙏
    ఇన్ని చెప్పనేల ఆనాటి నుంచీ , ఈనాటి వరకూ , మరి యేనాటి దాకా యైనా స్థిరముగా నిలిచి ఉన్నవాడవూ , నిలిచియుండెడి వాడవూ నీవొక్కడవే !🙏
    ఏ సమయములోనైనా నీకంటే గొప్పవాడని చెప్పుటకు ఇక ఎవరున్నారయ్యా ? లేనే లేరు నీవు తప్ప !🙏
    🌹🌹
    విచారించి చూసుకుంటే జీవాత్మలమైన మా అందరికీ అంతరాత్మవు నీవే ఓ శ్రీ హరి !🙏
    నిజమైన సిరులనబడే వరములను నీవొక్కడవే ఈయగలవు ఓ శ్రీ వేంకటేశ్వరా !🙏
    పురుషులలోకెల్లా సర్వశ్రేష్టుడవూ , ఈ లోకములనన్నిటినీ కాచి రక్షించుచున్న వాడవూ నీవే ! 🙏
    నాకు ఆశ్రయమై నీవు ఉన్నావు ! నీవే ఉన్నావు !
    ఇంతకన్నా గొప్ప ఆశ్రయమును మరి వేరెవ్వరీయజాలరు ! 🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 474 )
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    నీకే ( నే ) శరణు నీవు నన్నుఁ గరుణించు
    యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను
    ॥చ1॥
    కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
    పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
    అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
    యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను
    ॥చ2॥
    దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
    ఆవలఁ బాదాన లోక మణఁచితివి
    నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
    యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను
    ॥చ3॥
    అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
    సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
    పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
    యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను
    🌹🙏🌹🙏🌹

  • @kamaakshe9
    @kamaakshe9 3 місяці тому +1

    గురువు గారు👍

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 3 місяці тому +2

    Om Namo Venkatesaya🙏🙏🙏 Swamy varu; entha Goppa rao; Adbhutamga; keerthinchina; Goppa Saranagati Keerthana; Bhavamunaku; thagina Swamivari Drusyamulanu; chala Chakkaga Chupincharu; very nice, Prardhana; abhinandanalu🙏 Adbhuthamga sungby Sri Ananda bhattar garu; Srimannarayana Sri Venkatesa; Saranam Saranam Saranam🙏🙏🙏

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 3 місяці тому

    Om namo venkatesaya Govinda Govinda

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 місяці тому +1

    🌺☘ ------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 474
    ( NEEKE SARANU NEEVU NANNU KARUNINCHU ..)
    🌺☘ ------------☘🌺
    PREFACE :--🌹👇
    Annamayya Proposes
    Total Surrendering To The Lord In This Excellent Sankeertana !🙏
    He Extols The Glory Of The Lord That
    He Is The Primordial Lord !
    The Supreme Parabrahman !!
    He Is That Lord Sriman Narayana !
    He Alone Is The Ultimate Refuge to All !!🙏
    He Alone Is The Supreme And Hence
    There Is None Other Than Him To Seek Refuge !🙏
    Here goes the wonderful sankeertana as below ! 👇
    🌺☘ ------------☘🌺
    🌹🌹
    Iam Seeking You Alone, As My Refuge !
    You Alone Have To Show Compassion Upon Me !🙏
    Here In This World And In The Eternal Too ,
    Who Else Is There For Me As A Shelter Oh Lord ?🙏
    🌹🌹
    You Are The Lord Who Has
    The Sun And The Moon As your Both Eyes !🙏
    You Are The Intimately Connected Lord
    To Your Consorts Bhudevi And Sridevi ! 🙏
    In All Ways You Are The Father Of Lord Brahma
    And You Are The Primordial Lord Too !🙏
    To Have The Right Choice As My Refuge ,
    Who Else Is There More Capable Than you ?🙏
    🌹🌹
    Oh Divine Form Whose Body Is So Auspicious
    That It Is The Abode Of All The Deities !🙏
    Oh Lord Who Has Depressed Down With Your Foot The Whole World !🙏
    You Are The Only Lord Who Stood Supreme From Time Immemorial 🙏
    At Any Point Of Time Who Else Can Be ,
    More Greater Than You , To Be As My Shelter !🙏
    🌹🌹
    If Inquired Well , Oh Lord Hari ,
    You Are The Indweller Of All Jeevatmans !🙏
    You Are The Lord Sri Venkateswara
    The Bestower Of Wealthy Boons !🙏
    You Are The Supreme And
    The Protector Of Universe ,
    You Being As My Shelter , Who Else Is There
    To Protect Me More Better !🙏
    🌹🙏🌹
    Om Sri Alamelumanga Sametha
    Sri Venkateswara Swaminey Namaha !🙏
    🌹🙏🌹
    ✍ -- Venu Gopal