సాయి చంద్ అద్భుతంగా పాడిన అమ్మ పాట l పురిటి నొప్పుల యేతరా l SAICHAND EMOTIONAL MOTHER SONG l GalamTv

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • సాయి చంద్ అద్భుతంగా పాడిన అమ్మ పాట l పురిటి నొప్పుల యేతరా l SAICHAND EMOTIONAL MOTHER SONG l GalamTv
    Singer: Sai Chand
    Writer: Ammapata Thirupathi
    Music: Amulya Studio
    Dop & Editing: Ajay Kodam
    Producer: Gundu Srinivas Goud
    Co-Producer: Dasari Bhaskar
    Special Thanks to
    Mee Folk Tv Dindigala Purushotham
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    పురిటి నొప్పుల యేతరా
    పూజించే దేవతరాజన్మనిచ్చిన తల్లి
    జగతిలోన జాబిల్లి..
    నీ పాదాలకు సాష్టంగ వందనం...
    ఏమిచ్చినా తీరనిదమ్మా నీ రుణం
    అమ్మనీ పాదాలకు సాష్టంగ వందనం ఓ...
    ఏమిచ్చినా తీరనిదమ్మా ఆ.. ఆ..నీ రుణం
    llపురిటి నొప్పుల యేతరాll
    వెచ్చని నీ కడుపుల మోసి
    వెలకట్టని ప్రేమను చూపి...
    బరువెక్కిన కడుపుతో అమ్మ
    ప్రతి అడుగును పదిలంగేసి
    ప్రాణ వాయువువందించంగ
    పసి గుండె స్పందించగ
    మన ఆలన పాలన చూసే
    కడుపులోన మనముండంగ
    ఎంత జాలి గుండె ఏ...ఏ...ఏ...
    అమ్మ ఎంత జాలి గుండె
    అందుకే జగతిలా ఉండే
    నా కన్నీళ్ళతో నీ కాళ్లు కడిగిన
    మోక్షము నాకుండే...
    llపురిటి నొప్పుల యేతరాll
    బ్రహ్మ కైన అమ్మవు నీవు
    అపురూప జన్మవు నీవు
    తల్లి త్యాగాల చరితవే
    బిడ్డల బంగారు భవితవే
    రోతణ నీ గుణమే నిది
    ఈ జగతికి నువ్వు పునాది
    నీ పేగున ప్రేమలు పండే
    బతుకులో ధీవెనలై నిండే
    కర్రు నాగలయ్యి యి....ఓ... ఓ...అమ్మ...
    కర్రు నాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నినా
    పాలగమారే నేలన నెత్తుటి దారలే చిందేనా ఆ...ఆ...
    llపురిటి నొప్పుల యేతరాll
    పుట్టగానే బొడ్డును గోసి
    పసిగుడ్డకు ప్రాణం బోసి
    చక్కని నీ ప్రేమను చూపి
    చనుబాల దారల తాపీ
    ముద్దులతో చెంపలు తడిపి
    ముద్దు నాన్నా అని పిలిచి
    జాగ్రత్తలే పాటించంగా జాగారాలెన్నో చేస్తావు
    భాష రాని బాల్యం... ఆ... ఆ...ఆ...
    భాష రాని బాల్యం బాధను ఏడ్పులో పసిగడుతౌవ్
    దిష్టి తీసి తల కురులతోటి మా కష్టం తొలగిస్తవు....
    llపురిటి నొప్పుల యేతరాll
    కొత్త బట్టలే కొని తొడిగి
    సూర్య చంద్రులంటూ పొగిడి
    అందమెట్ల ఉన్నా గాని
    అందలాని కెత్తుకుంటది
    కండ్ల ముందు కనబడకుంటే
    సడుగులెంట అడుగులేస్తది
    ఆకలి మన కడుపును చూసి
    అమ్మ అల్లాడిపోతది
    మచ్చలేని ప్రేమ..ఓ... ఓ...ఓ...
    మచ్చలేని ప్రేమ అమ్మామానవతకు చిరునామా
    పంచ భూతాలు ప్రాణ దాతవని కొనియాడె ప్రేమా ఆ... ఆ...ఆ...
    llపురిటి నొప్పుల యేతరాll
    #SAICHAND #SAICHANDSONGS #SAICHANDHITSONGS #GALAMTVCHANNEL

КОМЕНТАРІ • 96