ఉపాధ్యాయ సాధికారత || perspective education ||practice bits|| Teacher's Empowerment || introduction

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • 1) పాఠశాల వ్యవస్థలో అతికీలకమైన వ్యక్తి.....
    a) ఉపాధ్యాయుడు b) ప్రధానోపాధ్యాయుడు
    c) విద్యార్ధి d) DEO
    answer : a) ఉపాధ్యాయుడు
    Explanation :ఉపాధ్యాయుడు విద్యార్థులతో, ప్రధానోపాధ్యాయునితో, తోటి ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, సమాజం తో ప్రభుత్వ యాజమాన్యం తో, స్వచ్చంద సంస్థలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇలా అందరితో కలసిపోతూ తన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు.కనుక పాఠశాల వ్యవస్థ లో ఉపాధ్యాయునిది కీలక స్థానం అని చెప్పవచ్చు.
    2) " Empowerment " అనే ఆంగ్ల పదానికి సమానమైన తెలుగుపదం.....
    a) ప్రేరణ b) పొగడ్త
    c) అధికారం d) సాధికారత
    answer : d) సాధికారత
    Explanation : " Empowerment " అనే ఆంగ్ల పదానికి సమాన అర్థం ఇచ్చే తెలుగు పదం సాధికారత. అంటే సామర్థ్యాలను మెరుగుపరచటం.
    3) సాధికారత అనగా......
    a) సామర్థ్యాలను నేర్పించటం
    b) సామర్థ్యాలను అందించటం
    c) సామర్థ్యాలను మెరుగుపరచటం
    d) సామర్థ్యాలను నేర్చుకోవటం
    answer : c
    4) " సాధికారత గల ఉపాధ్యాయులు విషయవిశ్లేషణతో పాటు, సృజనాత్మక పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకేత్తిస్తారు. విద్యార్థులకు పలు అనుభవాలను కల్గించి వారి సమర్థతను ఇనుమడింప చేస్తారు... " అన్నది
    a) గుడ్ మెన్ b) ఎల్విన్ స్టెన్
    c) జార్విన్ కేండి d) లాంగ్ మెన్
    answer : a
    5) సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించటం... అని సాధికారత గురించి వివరణ ఇచ్చిన పుస్తకం....
    a) You are Born to Blossom
    b) Fear not.... Be Strong
    c) Contemporary English Dictionary
    d) Empowering Women..... As I See...
    answer : c
    Explanation : సాధికారత గురించి పై విధంగా వివరణ ఇచ్చిన పుస్తకం 1998 లో లాంగ్ మెన్ కూర్చిన Contemporary English Dictionary.
    a)You are Born to Blossom - A. P. J. Abdul kalam
    b) Fear not.... Be Strong - Swami Vivekananda
    d) Empowering Women..... As I See...- Kiran Bedi
    6) సాధికారతకి సంబంధించి సరిఅయినది కానిది....
    a) సాధికారత ఒక సార్వజనీన భావన.
    b) సాధికారత ఒక పాఠశాలకి, ఒక ఉపాధ్యాయునికి సంబంధించినది.
    c) ఉపాధ్యాయుడు తన పనితీరును మెరుగుపరచుకోవటం సాధికారత.
    d) సాధికారత అనేది ఉపాధ్యాయుల సమర్ధతను వెల్లడిస్తుంది.
    answer : b
    Explanation : సాధికారత అనేది కేవలం ఒక పాఠశాలకో లేదా ఒక ఉపాధ్యాయుడికో, ఒక పరిస్థితికో సంబంధించింది కాదు. ఇది ఒక సర్వజనీన భావన.
    ఇంకా ఉపాధ్యాయుడు తన పనితీరుని మెరుగుపరచుకోవటం, వృత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటం సాధికారతగా చెప్పవచ్చు.
    7) ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది....
    a) ఉపాధ్యాయులకు ఇచ్చే వృత్యంతర శిక్షణ
    b) ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు
    c) విద్యా ప్రణాళికల మౌళికలక్ష్యాలు
    d) విద్యార్థుల ఉపలబ్ది ( సాధన ) మూల్యాంకనం
    answer : a
    Explanation :
    ఉపాధ్యాయుల సాధికారతను 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి
    🔹ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు
    🔹విద్యా ప్రణాళికల మౌళికలక్ష్యాలు
    🔹విద్యార్థుల ఉపలబ్ది ( సాధన ) మూల్యాంకనం
    🔹ఉపాధ్యాయులకు ఇచ్చే వృత్తి పూర్వ శిక్షణ
    ఈ నాలుగు అంశాలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి
    8) ఉపాధ్యాయుడు సమర్ధవంతంగా బోధనాభ్యసన కార్యకలాపాలను నిర్వహించగల శక్తియుక్తులను పొందటానికి తోడ్పపడేది......
    a) విద్యా లక్ష్యాలు
    b) ఉపాధ్యాయుల రూపచిత్రం
    c) విద్యార్థుల సాధన
    d) వృత్తి పూర్వ శిక్షణలు
    answer : d
    Explanation : ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ అనేది ఉపాధ్యాయులలో వృత్తిపరమైన బాధ్యతలను, విధులను, సామాజిక స్పృహ ను పెంపొందించి సమర్ధవంతంగా బోధనాభ్యసన కార్యకలాపాలను నిర్వహించగల శక్తియుక్తులను పొందటానికి తోడ్పపడుతుంది.
    వృత్తి పూర్వ శిక్షణ ద్వారా ఉపాధ్యాయునికి బోధనా వ్యూహాలు, పద్ధతులు, విద్యార్థుల నేపథ్యాలు,
    వారి శక్తియుక్తులు, అభిరుచులు, ఆసక్తులు, అవసరాలు మొదలైనవి గ్రహించగల నైపుణ్యం వస్తుంది.
    9) విద్యార్థుల ఉపలబ్ది ని మదింపు చేయుటలో ఉపాధ్యాయునికి ఉపయోగపడేది.....
    a) విషయ ప్రణాళిక
    b) అధునాతన సాంకేతిక పరిజ్ఞానం
    c) పాఠ్య పుస్తకాలు
    d) విద్యార్థుల పట్ల ఉన్న ధనాత్మక వైఖరి
    answer : b
    Explanation : అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అనేది పాఠ్యంశాల బోధన ద్వారా విద్యార్థులు సాధించిన ఉపలబ్దిని మదింపు చేయటానికి ఉపయోగపడుతుంది.
    10) విషయ ప్రణాళికలు ( syllabus ) వేటి ఆధారంగా తయారుచేస్తారు......
    a) విద్యా ప్రణాళికలు
    b) పాఠ్యపుస్తకాలు
    c) పరీక్షలు
    d) విద్యార్థుల సాధన
    answer : a
    Explanation : విద్యా ప్రణాళికల ఆధారంగా విషయ ప్రణాళికలు ( syllabus ) తయారు చేస్తారు. అలాగే syllabus ఆధారంగానే పాఠ్యపుస్తకాలు రూపొందిస్తారు.ఈ విషయ ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు రెండు కూడా ఉపాధ్యాయుని సాధికారతని ప్రభావితం చేయుటలో ప్రముఖమైనవి.
    11) ఉపాధ్యాయునికి మూల్యాంకన పద్ధతుల ఉపయోగం....
    a) విద్యార్ధి సాధనని సమర్థవంతంగా మదింపు చేయటానికి
    b) విద్యార్థుల సాధన లో లోపాలను తెలుసుకోటానికి
    c) లోపాలను తొలగించి సాధనను మెరుగుపరచటానికి
    d) పైవన్నీ
    answer : d
    Explanation : ఉపాధ్యాయునికి లభించిన వృత్తిపూర్వ శిక్షణ లోని మూల్యాంకన పద్ధతులు అనేవి ....విద్యార్ధి ఉపలబ్దిని సమర్థవంతంగా మదింపు చేయటానికి, ఉపలబ్దిలోని లోపాలను కనుగొని వాటిని తొలగించటానికి. తద్వారా విద్యార్థుల సాధనని మెరుగుపరచటానికి,తగిన వ్యూహలను రూపొందించటానికి తోడ్పపడతాయి.

КОМЕНТАРІ • 2