LuLu Mall Hyderabad || భారీ డిస్కౌంట్స్ II 50% Discount II Offers on Groceries,Clothing&Electronics

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • LuLu Mall Hyderabad || భారీ డిస్కౌంట్స్ II 50% Discount II Offers on Groceries,Clothing&Electronics
    lulumall lulu
    #luluhypermarket
    #luluhyderabad
    #subscribe
    #explorepage
    #teluguvlogs
    హైదరాబాద్ లో లులు మాల్
    Lulu Mall in Hyderabad :లులు గ్రూపు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది.రూ.300 కోట్ల పెట్టుబడితో భాగ్యనగరం వేదికగా మాల్ ను తీసుకొచ్చింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్‌… నగరానికి సరికొత్త ఆకర్షణగా మారింది.
    Lulu Mall in Hyderabad : గత సంవత్సరం దావోస్‌లో జరిగిన "ప్రపంచ ఆర్థిక సదస్సు "పర్యటన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ UAE ప్రఖ్యాత సంస్థ లూలు గ్రూప్ తో చర్చలు జరిపారు. హైదరాబాద్ లో లులు షాపింగ్ మాల్ ఏర్పాటునకు ఆ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంస్థ సైతం హైదరబాద్ కూకట్ పల్లిలో షాపింగ్ మాల్ ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.గతంలో కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌ ను లులు గ్రూప్‌ రీబ్రాండ్‌ చేసింది.ఈ లులు గ్రూప్ షాపింగ్ మాల్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ మాల్ ను ఇవాళ (బుధవారం) మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
    తొలి మాల్ ఇదే…
    ఈ మాల్ లో అనేక రకాల సౌకర్యాలను అందిస్తామని సంస్థ ప్రతినిధులు హామీనిచ్చారు. ఇందులో పళ్లు, కూరగాయలు, మాంసం తదితర తాజా ఉత్పత్తులు, కిరాణా సామగ్రి, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌, మొబైల్స్‌, జీవన శైలి ఉత్పత్తులు లభిస్తాయి. కొచ్చి,తిరువనంతపురం, బెంగళూరు, లక్నో మరియు కోయంబత్తూర్‌ ల తరువాత హైదరాబాద్ లో తమ మొదటి లులు గ్రూప్ ఈ షాపింగ్ మాలేనని చెప్పుకొచ్చారు.
    విలేకరుల సమావేశంలో లులూ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో రూ.500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని చెప్పారు. ఇందులో భాగంగానే రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో మొట్టమొదటి మాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ అవతరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర గ్లోబల్‌ నగరాలకు పోటీగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు కేటీఆర్‌ ప్రోత్సాహం తోనే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు అశ్రఫ్ అలీ తెలియజేశారు.
    ప్రస్తుతం 22 దేశాల్లో 255 హైపర్‌మార్కెట్లు మరియు 24 షాపింగ్ మాల్స్‌తో తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, భవిష్యత్తులో తెలంగాణలో తన రిటైల్ పాదముద్రను విస్తరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ వ్యూహాత్మక విస్తరణ ద్వారా 2,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన అన్నారు.300 కోట్లతో హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్న ఈ లులు మాల్ లో " లులు హైపర్ మార్కెట్ " తో పాటు 75 ప్రాంతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లు కలిగి ఉంటాయన్నారు. మల్టీప్లెక్స్ తో పాటు పిల్లలు ఆదుకునేందుకు ఎంటర్టైన్మెంట్ సెంటర్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు.
    Thanks for watching 🤗
  • Навчання та стиль

КОМЕНТАРІ • 8