Paravaasini Nee Jagamuna Prabhuva || Songs Of Zion || Song No 686(584)

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • SONG NO - 686(584)
    "నీ దృష్టికి అతిధివంటి వాడను నా పితరులందరివలె నేను పరవాసినై యున్నాను" కీర్తన Psalm 39:12
    పల్లవి: పరవాసిని నే జగమున ప్రభువా
    నడచుచున్నాను నా దారిన్
    నాగురి నీవే నా ప్రభువా
    నీదరి నేజేరెదను - నేను
    1. లోకమంతా నాదనియెంచి
    బంధుమిత్రులే ప్రియులను కొంటిని
    అంతయు మోసమేగా
    వ్యర్థము సర్వమును - ఇలలో
    2. ధన సంపదలు గౌరవములు
    దహించిపోవు నీలోకమున
    పాపమునిండె జగములో
    శాపముచేకూర్చుకొనె - లోకము
    3. తెలుపుము నా అంతము నాకు
    తెలుపుము నా ఆయువు యెంతో
    తెలుపుము యెంత అల్పుడనో
    విరిగి నలిగి యున్నాను - నేను
    4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
    నీ రక్తముచే మార్చబడితిని
    క్షమాపణ పొందితివనగా
    మహానందము కలిగె - నాలో
    5. యాత్రికుడ నే నీలోకములో
    సిలువమోయుచు సాగెదనిలలో
    అమూల్యమైన ధనముగ
    పొందితిని నేను - యేసునే
    6. నా నేత్రములు మూయబడగ
    నాదు యాత్ర ముగియునిలలో
    చేరుదున్ పరలోక దేశము
    నాదు గానము యిదియే - నిత్యము

КОМЕНТАРІ •