మాల్టా బత్తాయి రకంతో మెట్టసాగులో నూతనోత్సాహం ||Success Story of Sweet Malta Orange ||Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Sweet Malta Orange/Bathai; A boon to the dryland farmers.
    Success Story of Sweet Malta Orange/Bathai cultivation by Anantapur District farmer.
    బత్తాయి సాగుకు కొత్త ఊపిరి పోస్తున్న మాల్టా బత్తాయి రకం
    మాల్టా బత్తాయి రకం సాగుతో విజయపథంలో అనంతపురం జిల్లా రైతు
    మంచి రంగు, అధిక తీపిశాతం కలిగి, రస నాణ్యత, నిల్వగుణంలో మేటిగా నిలుస్తోంది మాల్టాబత్తాయి. బత్తాయిలో ప్రస్తుతం సౌత్ గుడి, బటావియన్, మొసంబి రకాలు ఎక్కువగా సాగులో వున్నాయి. ఆయాప్రాంతాల అనుకూలతనుబట్టి ఈ రకాలను ఎంచుకుంటున్న రైతులు, 5సంవత్సరాలు దాటిన తోటలనుండి అత్యధికంగా ఎకరాకు 10టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈ రకాల్లో మొక్కల సాంద్రత ఎకరాకు 90 నుండి 120 చెట్లకు మించి వుండే అవకాశం లేదు. కానీ తొలిసారిగా మాల్టా బత్తాయిని హైడెన్సిటీ విధానంలో సాగుచేసి విజయబాటలో పయనిస్తున్నారు రైతు మల్లిఖార్జున రెడ్డి.
    అనంతపురం జిల్లా బెలుగుప్పమండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మల్లిఖార్జున రెడ్డి అగ్రికల్చర్ బి.ఎస్.సి చదివారు. అయినప్పటికీ వ్యవసాయంలో రాణించాలనే ఉద్దేశ్యం బలంగా వుండటంతో మాల్టాబత్తాయి సాగుపై దృష్టి సారించారు. రాజస్తాన్ రాష్ట్రంలోని గంగానగర్ నుండి మొక్కలను తెప్పించి, హైడెన్సిటీ పద్ధతిలో ఎకరాకు 200 మొక్కల చొప్పున, 10 ఎకరాల్లో 2 వేల మొక్కలు నాటారు. ఉద్యాన శాఖ నుండి 50 శాతం రాయితీ పొంది పూర్తిగా డ్రిప్ విధానంలో నీటిని అందిస్తున్నారు. పంటనాటిన దగ్గర నుండి సెమీ ఆర్గానిక్ పద్ధతిలో సాగును ముందుకు నడిపిస్తున్నారు. సాధారణంగా బత్తాయి 4వ సంవత్సరం నుండి దిగుబడినిస్తుంది. కానీ ఈ రైతు 10 ఎకరాల తోటను 3వ సంవత్సరంలో కొంతమేర మాత్రమే పంటకు వదలినప్పటికీ 30టన్నుల దిగుబడిని సొంతం చేసుకున్నారు. ప్రస్థుతం 4వ సంవత్సరంలో వేసవి పంటను తీసేందుకు సిద్ధమయ్యారు. ఎకరాకు 10టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని దీమా వ్యక్తంచేస్తున్నారు.ఇప్పుడు వున్న బత్తాయి రకాలు అన్నిటికంటే, మాల్టాబత్తాయి మంచి ఫలితాలు అందిస్తుందని, అధిక దిగుబడితోపాటు, మెరుగైన ఆర్థిక ఫలితాలు అందించటంలో రైతు అన్నివిధాలుగా చేయూతగా నిలుస్తుంది అంటున్న మల్లిఖార్జున రెడ్డి అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #maltabathai #sweetmaltaorange #sweetmaltabathayi
    Facebook : mtouch.faceboo...

КОМЕНТАРІ • 92