క్యాన్సర్ తో బిడ్డను పోగొట్టుకున్న , ఆశా వర్కర్

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోపాటు కూటమి నాయకులు రాష్ట్రంలో చిరు ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు ఉండవని ఏ ఒక్కరిని పనిలో నుంచి తీసివేయమని ప్రజలకు, చిరుఉద్యోగులకు, వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్నా…తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బాలాయ పల్లి పిహెచ్ సి లో పనిచేస్తున్న ఆశా వర్కర్ కృష్ణవేణి తోపాటు పలువురు చిరు ఉద్యోగులపై స్థానిక నాయకులు వేధింపులకు పూనుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి, బాలాయపల్లి పిహెచ్ సి లో ఆశ వర్కర్ గా పనిచేస్తున్న కృష్ణవేణి ని కలిసి ఆమెకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఏఐటియుసి ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడారు చిరు ఉద్యోగులపై స్థానిక నాయకులు వేధింపులు మానుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ముగ్గురు ఆడపిల్లలు సంతానం గల కృష్ణవేణి ఒ పేద కుటుంబానికి చెందిన మహిళని, ఇలా వేధింపులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. క్యాన్సర్ వ్యాధితో ఒ కూతుర్ని పోగొట్టుకున్న ఆమే మరో కూతురు క్యాన్సర్ బారిన పడడంతో వైద్యం చేయించడం కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ఆమె కుటుంబానికి అండగా నిలవాల్సిన స్థానిక నాయకులు ఆమే పట్ల వేధింపులకు పూనుకోవడం చాలా దుర్మార్గమని ప్రశ్నించారు.ఇకనైనా కృష్ణవేణి పట్ల సానుభూతితో అండగా నిలవాలని కోరుతున్నామని లేనిపక్షంలో ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను విదులలో నుంచి తొలగించాలని చూస్తే రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అండగా ఉంటామని, తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు డిఎంహెచ్వోలను కలిసి చర్చిస్తామని తెలిపారు, అప్పటికి పరిష్కారం కాకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకువెళ్తామని స్థానిక నాయకులను హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో ఏఐటియుసి వెంకటగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కల్లూరు జాన్. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహాయ కార్యదర్శి వై ఎస్ మనీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హేమావతి చాముండేశ్వరి కోశాధికారి ధనలక్ష్మి సిపిఐ మండల రేణిగుంట మండల కార్యదర్శి మోహన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు .

КОМЕНТАРІ •