Banaganapalle Special Karam Dosa | సీతామహాలక్ష్మి గారి దోశ | NO.1 Dosa In Banaganapalle | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • పుణ్యక్షేత్రాల యాత్ర చేపట్టి మార్గ మధ్యంలో బనగానపల్లె లోని గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటికి చేరుకున్న బ్రహ్మంగారు వారి వద్ద గోపాలునిగా పనికి కుదిరి 16 సంవత్సరాలు అక్కడే వుంటారు.మీరు వీక్షిస్తున్న దృశ్యాలలోని ఆలయం గరిమిరెడ్డి అచ్చమ్మ గారి అప్పటి గృహం.ఇచ్చట బ్రహ్మంగారి చరిత్రను తెలుపుతూ ప్రదర్శన శాల కూడా ఉంది.
    బనగానపల్లెలో మా వసతి గృహం ప్రక్కన ఉన్న సీతామహాలక్ష్మి ఆహార శాల నిత్యం కోలాహలంగా కనిపించింది. స్థానికులను అడగ్గా ఊరిలో గుర్తింపు గల భోజనశాల గా తెలిపారు.
    తొలుత భోజనం తర్వాత అల్పాహారం తిని ఆహారం బావున్న నేపథ్యంలో అనుమతి తీసుకుని చిత్రీకరణ జరిపి ఈ వేళ ప్రసారం చేస్తున్నాను.బనగానపల్లెలో ఉన్నన్ని రోజులు మేము ఆకలి తీర్చుకుంది ఎక్కువ శాతం ఇక్కడ. ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి రుచికరమైన భోజనం లభిస్తుంది తక్కువ ధరకు.నిర్వహకులు సుధారాణి గారు ఆహార శాల గురించి వివరిస్తారు.
    స్వల్ప ధరకు ఆహారం లభిస్తున్న అర్ధకాలి వడ్డన కాదు. ఇడ్లీ,వడ,దోశ ఇక్కడ ఏది తిన్నా కడుపు నిండుతుంది.అందుకు కారణం ఆయా ఆహార పదార్థాల పరిమాణ విస్తారం.మంచి రుచిని కూడా అందిస్తాయి.
    ఇక్కడ కారం దోశ ఇష్టంగా తిన్నాను.చూపులకు ఎంతో ఇంపుగా కనిపించింది.తింటే కమ్మని రుచి లభించింది.పెద్ద దోశ అయినా మెత్తగా ఉండటం బాగా నచ్చింది నాకు.లోగల కారం, పప్పుల పొడి ముఖ్యంగా మిళితం చేసుకుని పచ్చడి కారం దోశ ఉన్నతికి కీలకం.

КОМЕНТАРІ • 21