కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాహుల్‌ జన్మదిన వేడుకలు-ప్రధాని కావాలని బాలేపల్లి మురళీధర్‌ ఆకాంక్ష

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాహుల్‌ జన్మదిన వేడుకలు
    -ప్రధాని కావాలని బాలేపల్లి మురళీధర్‌ ఆకాంక్ష
    రాజమహేంద్రవరం :
    ఎఐసిసి మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్‌లో ఇండియా కూటమి నేతగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, పీసీసీ సభ్యుడు బాలేపల్లి మురళీధర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరభద్రపురంలో ఉన్న గాంధీ కస్తురిబా స్త్రీల సేవాశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు చీరలు, బిస్కెట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజా స్వామ్య హక్కులు, ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే రాహుల్‌ గాంధీ ప్రధానిగా కావాలని ఆకాంక్షించారు. ఆయన సమర్థ నాయకత్వంలో దేశం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రెండు సార్లు వేల కిలోమీటర్లు భారత్‌ జోడో, భారత్‌ జోడో న్యాయ యాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాహుల్‌ తెలుసుకున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ జరిగిన ఎన్నికల్లో మంచి మెరుగైన ఫలితాలను సాధించిందని తెలిపారు. ఆయన కష్టజీవి అని ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందాలని, అందరికి మేలు జరగాలని కోరుకుని నాయకుడు అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని, ప్రజలందరూ ఆలోచన చేసి ఆయనకు మద్ధతుగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసారు. వీరభద్రపురం స్త్రీల సేవా శ్రమంలో ఈ విధంగా రాహుల్‌ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు కిశోర్‌కుమార్‌ జైన్‌, యిజ్జరౌతు విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, ఐ.సత్యనారాయణ, రాజు, కాంగ్రెస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బిల్డర్‌ బాబీ తదితరులు పాల్గొన్నారు.
    ````

КОМЕНТАРІ •