శ్రీరామాయణంలోని అత్యంత శక్తివంతమైన ఘట్టములలో ఒకటి శణ్ముకోత్పత్తి by chaganti koteswara rao

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • శ్రీరామాయణంలోని అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి శణ్ముకోత్పత్తి అంటారు. ఇది ఎంత అద్భుతమైనదంటే, గర్భినీ స్త్రీలుకాని ఈ సర్గని పారాయణంచేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉత్తమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వారికిప్రసవం అవుతుంది అంత శక్తి ఇందులోనే ఉంది.
    అమ్మ అందమంతా మూర్తీ భవించి ఉంటుంది అందుకే, ఇంతింత బుగ్గలూ, ఎర్రటి మనిషీ, ఆ హారాలు చిన్న పట్టుబట్టా, ఎప్పుడూ అమ్మ శక్తంతా చేతిలో శూలంగా పట్టుకుని ఆ కుంకుట ధ్వజం, ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ, ఎంత అందంగా ఉంటాడో, అందుకే శుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్ సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు.
    ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధ పడుతున్నవాళ్ళు గర్భినీ అయినప్పటికి కడుపున ఎటువంటి బిడ్డలు పుడుతారో తెలియనివాళ్ళు వాళ్ళ ఆయుర్ధాయం బాగుండాలనుకునే వాళ్ళు సంతానం క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్నవాళ్ళూ రామాయణాంతర్గతమైన శణ్ముకోత్పత్తిని వినితీరాలి. ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలసృతి చెప్తూ ఓమాట చెప్పారు ఏష తే రామ గఙ్గాయా విస్తరోభిహితో మయా ! కుమారసమ్భవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ !! ఎవరు ఈ శణ్ముకోత్పత్తిని శ్రీ రామాయణంలో వింటున్నారో... వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా, అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధనసంపత్తి వృద్ధి కలుగుతుంది. రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రము చేత కలుగుతుంది. ఇక్కడే ఆయన కుమారసమ్భవశ్చైవ అన్నమాట వాడారు పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు కనుక ఆయనకు ఒక్కనికే కుమారః అన్న నామము. ఆయన భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః ! ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కన్దసాలోక్యతాం వ్రజేత్ !! ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ శణ్ముకోత్పత్తిని చేతులు కైమోడ్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటుంన్నారో... అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే... ఆ దోషము ఉపశమించి ఆయుర్ధాయం కలుగుతుంది ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ వాళ్ళ కొడుకులు మనమలు అందరూ క్షేమంగా ఉంటారు. ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవిపోయి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి, వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ ఎవరు రామాయణం, సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో... దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారో వాళ్ళ శరీరం పడిపోయిన తరువాత స్కందసా లోకసాం వ్రజేత్ సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్పా ఆయన నోటి వెంటరాదని బ్రహ్మగారి వరం ఆయన ఎప్పుడూ ఫలసృతి చెప్పరు ఇక్కడ చెప్పారు అంత గొప్పది శణ్ముకోత్పత్తి.
    #chagantikoteswararao #jaishreeram #trending #motivational #murugan #jaishreeram #ramayanam #pregnentwomen

КОМЕНТАРІ •