నారదుడి సమాధానము- సంక్షేప రామాయణం |సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 2 |

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ఆయన రాముడే! ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది, ఆయన బిడ్డలే నీ దగ్గరున్నారు. వాల్మీకి మహర్షీ! ఆయనే ఆయోద్యాధిపతి, ఆయనే రామ చంద్ర ప్రభువు అని చెప్తే వాల్మీకి పొంగిపోవాలి కదాండీ... రామాయణ ఆవిర్భావం జరుగుతోందన్న మాట ఇవ్వాళ. ఇవ్వాళ రామాయణం పుడుతోంది ఆ సన్నివేశంలో ఉన్నాం మనం, ఇప్పుడు ఈ మాటలడిగారు అడిగితే నారద మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు. ఆయనన్నారూ బహవో, దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితాగుణాః ! మునే వక్ష్యామ్యఽహం బుద్ధ్వా తై ర్యుక్తః శ్రూయతాం నరః !! చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు. సాధరాణంగా లోకంలో మానవుల్లో నీవడిగినటువంటి పదహారు గుణములు ఒక వ్యక్తియందు ప్రకాశించేడివాడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి నరోత్తముడై ఉండాలి సాక్ష్యాత్ శ్రీ మహావిష్ణువై ఉండాలి అటువంటివాడే కాని నరుడిగానే ఉన్నాడు. ఆయన విష్ణువంటే ఆయనే అంగీకరించడు ʻనేను నరున్నిʼ అంటాడు. నేను ʻదాశరథినిʼ అంటాడు, నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు, నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్న వాడున్నాడు అటువంటివాని గురించి చెప్తాను జాగ్రత్తగావిను అన్నాడు ఇదీ సంక్షేప రామాయణం. నూరు శ్లోకాలతో ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతుందని అన్నారే, సంక్షేప రామాయణాన్ని పెద్దలు సాంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసాండీ, "మాలా మంత్రమూ" అని పిలుస్తారు. ఎందుకంటే శారదా తిలకమూ అనీ, మంత్రాల గురించి చెప్పేటటువంటిది బీజాక్షరాలను కూడి చెప్పే విషయము ఒకటుంది అందులో. అందులో పది అక్షరాల మంత్రంలో దాటిపోతే దాన్ని మాలా మంత్రమూ అని పిలుస్తారు. నూరు శ్లోకములతో ఉన్న సంక్షేప రామాయణము మాలా మంత్రం. అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణం చేస్తే అది రక్షణ చేస్తుంది మన్నాత్ ప్రాయతే ఇతిః మంత్రాః దాన్ని మననం చేస్తే అది కాపాడుతుంది, సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది. సద్గురువులైనటువంటి నారద మహర్షి నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం మహానుభావుడు నేను చెప్తున్నానయ్యా వినూ అని చెప్తున్నాడు#chagantikoteswararao #sampoornaramayanam #balakanda #jaishreeram #motivational

КОМЕНТАРІ •