టుడే ఈనాడు, బులటెన్ న్యూస్.
Вставка
- Опубліковано 8 лис 2024
- చంద్రబాబు పాలన అంటేనే రామ రాజ్యం
కష్టాలు ఉంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు
నాటి వైయస్ జగన్ అసమర్థ పాలన విజయవాడ ప్రజలకు శాపం గా మారింది
2004లో వైయస్ జగన్ ఆస్తి ఎంత? 2024 లో ఆస్తి ఎంత?
లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వైయస్ జగన్ రూ.100 కోట్లు విరాళం ఇవ్వాలి
----- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
భీమిలి: చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యమని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అభివర్ణించారు. ప్రజలకు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు వ్యవహరించి ఆ కష్టాలను కడతేరుస్తున్నారన్నారు. శుక్రవారం ఉదయం భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వయసును కూడా పక్కనపెట్టి ప్రజల కోసం కష్టపడుతుంటే చూసి తట్టుకోలేని పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. వైయస్ జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరు ముంపు ఏర్పడిందని.. విజయవాడలో లక్షలాదిమంది ప్రజలకు శాపంగా మారిందన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం అవాకలు చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ విజయవాడకు వచ్చి సహాయ పనులలో పాల్గొంటే .. ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన రాలేదన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నేత్రుత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించారన్నారు. పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలను ప్రకటిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ముష్టి వేసినట్టు కోటి రూపాయలు మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో వైయస్ జగన్ ఆస్తి ఎంత? 2024 లో ఆస్తి ఎంతో లెక్క చెప్పాలన్నారు. లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుతున్న వైయస్ జగన్ కనీసం 100 కోట్ల రూపాయలను వరద సాయంగా ప్రకటించాల్సి ఉందన్నారు. ఇటు సాయం చేయక.. అటు ఇష్టానుసారం శవ రాజకీయాలు చేస్తున్న వైయస్ జగన్ పార్టీ పుట్టుకే శవం నుంచి పుట్టిందన్నారు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ పై ఉన్న ప్రపంచంలో ఏకైక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని.. అతను నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ నిబద్ధత గల పార్టీ
తెలుగుదేశం పార్టీ నిబద్ధత గల పార్టీ అని మరోసారి నిరూపణ అయిందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పై ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ నుంచి తొలగించారని ప్రస్తావించారు. అటువంటిది వైసీపీలో అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ కామపిశాచాల మాదిరిగా వ్యవహరించినప్పటికీ .. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పటికీ, విజయసాయి రెడ్డి అక్రమాలపై సాక్షాత్తు హైకోర్టు కన్నెర్ర చేనప్పటికీ కనీసం వారిని పార్టీ నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయలేకపోయారన్నారు. విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి భీమిలి తీరంలో చేపట్టిన నిర్మాణం అక్రమమని హైకోర్టు ధృవీకరించడంతో అధికారులు ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేశారన్నారు. వైసీపీలో తప్పులు చేసిన నాయకులందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అతున్నారని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే అరెస్టు కాక తప్పదు అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ అదే పనిగా బురద జల్లుతున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది అన్నారు.
విలేకరులు సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, ఆడారి ఉమా శంకర్, గండిబోయిన పోలరాజు, కొక్కరి అప్పన్న, రాజగిరి రమణ, యానపు శ్రీనివాసరావు, వియ్యపు పోతురాజు, కందుల సుందర్రావు, చురకల రమణ తదితరులు పాల్గొన్నారు.