Part 072 - భాగవత సప్తాహము - శ్రీకృష్ణాశ్రమము, పెదముత్తీవి - Bhagavatha Sapthaham, Pedamuthevi

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • భాగవతమనగా భగవంతుని గూర్చి చెప్పునది. భగవద్భక్తులను భాగవతులందురు. భగవంతుడు భాగవతులలో వ్యక్తమగునన్నది ఈ పవిత్ర గ్రంథమునకు పునాది కనుక భక్తుల గుణకీర్తనము వలన అనుభూతి కలిగినట్లు సాధనల వలనను, శాస్త్రాభ్యాసము వలనను కలుగదు. ఈ సత్యమును గూడ భాగవతము ఉదాహరణపూర్వకముగ తెలుపును. జీవులలో దేవుడుండును గనుక భూతదయ వలన జీవుల రూపమున దేవుడు మెచ్చుకొనును. తత్ఫలితముగ దేవుని పాదముల సాన్నిధ్య మెరిగిన గురువులతో పొత్తు కుదురును. దాని వలన దేవుని అనుభూతి కలుగును. దేవుని పాదము లెరిగిన వారి జీవిత చరిత్రములను చదువుచున్నప్పుడు మనస్సు దేవునిపైకి ఆకర్షింపబడును. ఈ ఆకర్షణ సమయమున సమస్యలతోనున్న మనస్సు స్థితి నుండి సమస్యలు లేని 'తన' స్థితికి జీవుడు మారును. దీనినే సముద్ధరణమనియు, సంసారమును తరించుటయనియు, మోక్షమనియు చెప్పుదురు. ఈ అనుభవము నిరంతరము దుఃఖాదులు లేని స్థితిని ప్రసాదించును. దీని ననుభవమునకు తెచ్చుటకు రచింపబడిన గ్రంథమే భాగవతము. భాగవతమును వ్యాసుడు నంస్కృతమున రచించెను. బమ్మెర పోతన తెనుగున రచించెను. తెలుగువారి భాగ్యవశమున శ్రీమాన్ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు సులభమైన భాషలో భాగవత హృదయముతోబాటు ప్రతి పద్యమందలి ఆధ్యాత్మిక రహస్యములను శతాబ్దముల మడతలలో నిమిడియున్న భాగవతోత్తముల సాధన పోకడలను మాటాడుకొను మాటలలో వివరించియున్నారు. ఈ గ్రంథములు పదహారు భాగములుగా ప్రకాశింపబడి సాధకులకు అందుబాటులో కలవు. పోతన భాగవతములోని మూల పద్యము, మాస్టర్ ఇ.కె.గారు అనుగ్రహించిన టీకా, తాత్పర్యము, రహస్యప్రకాశములను అధ్యయనము చేసుకొనుచు వివరించుకొనుట సామూహికముగా చేయవలెననెడి సత్సంకల్పము ఆచార్యకృప వలన కలిగి శ్రీ మాన్ ఎక్కిరాల అనంతకృష్ణగారిచే భాగవత సప్తాహములు నిర్వహింపబడుచున్నాయి. 2023 ఏప్రిల్ లో నైమిశారణ్యం లోను, ఆగస్టులో విశాఖపట్టణంలోను నిర్వహింపబడినాయి. 2024 ఏప్రిల్ లో జగన్నాథక్షేత్రమైన పూరీలోను, అక్టోబర్ లో శ్రీ కృష్ణాశ్రమము, పెదముత్తీవిలో నిర్వహింపబడినది. శ్రద్ధతోను, భక్త్యాదరములతోను ఎవరు యిటువంటి పవిత్ర గ్రంథములను అధ్యయనము చేసినను, ఆ గ్రంథములలో వివరింపబడిన అవతారమూర్తుల, మహాత్ముల అనుగ్రహ తేజస్సు చెప్పుకొనువారు, వినువారిపై ప్రసరించుటయు, తత్ఫలితముగా అయా మహా పురుషుల సల్లక్షణములను ఆచరించు సద్బుద్ధి వీరికి కలుగుటయు, అట్టి సల్లక్షణములు కలవారిగా మారుటయు సంభవించునని మాస్టర్ ఇ.కె.గారు ఉద్బోధించారు. ఈ సత్ప్రయత్నము వ్యక్తిగతముగా కాకుండా, సామూహికముగా జరిగినచో అది లోకహితార్థమునకు దారితీయును గనుక దైవానుగ్రహమును పొందుట మరింత సులభమగునని మాస్టర్ ఇ.కె. గారు ఉద్ఘాటించారు. ఇదియే ఈ భాగవత సప్తాహముల యొక్క పరమ ప్రయోజనము

КОМЕНТАРІ •