ఎక్క‌డా రాజీ ప‌డం... వైద్య ఆరోగ్య శాఖామంత్రి స‌త్య‌కుమార్‌, మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ఎక్క‌డా రాజీ ప‌డం...
    - ప్ర‌జ‌ల‌కి మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం
    - జీజీహెచ్‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కృషి
    - త్వ‌ర‌లోనే సిబ్బంది కొర‌త తీరుస్తాం
    - వైద్యుల్ని హెచ్చ‌రించిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి స‌త్య‌కుమార్‌
    - ఒక సంవ‌త్స‌రంలోనే రాష్ట్రాన్ని సీఎం గాడిలో పెట్టారు - మంత్రి నారాయ‌ణ
    - నెల్లూరు జీజీహెచ్‌లో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది స‌మీక్ష‌
    - మంత్రితో క‌లిసి పాల్గొన్న రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ
    ప్ర‌జ‌ల‌కి మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని...అదే విధంగా వైద్య‌సేవ‌లు అందించ‌డంలో ఎక్క‌డ కూడా రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి వై. స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. నెల్లూరులో ప‌ర్య‌టించిన ఆయ‌న‌... న‌గ‌రంలోని స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బందితో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో... మంత్రి స‌త్య‌కుమార్‌తోపాటు... రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ పాల్గొన్నారు. ముందుగా జీజీహెచ్ వైద్యాధికారులు మంత్రుల‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా స‌మీక్ష‌లో వారితో ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించ‌డంతోపాటు అనేక విష‌యాల‌ను తెలుసుకోవ‌డం జ‌రిగింద‌ని మంత్రి అన్నారు. అనేక విష‌యాల‌ను వారితో చ‌ర్చించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ కొర‌త‌, ముఖ్యంగా సిబ్బంది కొర‌త‌గా కూడా ఈ క‌ళాశాల‌లో ఉన్న విష‌యం తెలిసింద‌న్నారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించి జీజీహెచ్‌లో అన్నీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.
    అనంత‌రం మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌... ప్ర‌జ‌ల‌కి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని, ఎటువంటి ప‌రిస్థితిలో కూడా రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సీఎం ఆదేశించార‌ని... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి వై. స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో ఏ చిన్న‌పొర‌పాటు జ‌రిగినా... ఆ ఎఫెక్ట్ ప్ర‌భుత్వంపై ఉంటుంద‌న్నారు. ఎక్క‌డ కూడా ఉదాసీన‌త ప‌నికి రాద‌ని...అలాగే నిర్ల‌క్ష్యం ఖ‌రీదు ప్రాణం కాకూడ‌ద‌ని వైద్యుల్ని హెచ్చ‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. పొర‌పాట్లు జ‌రిగి ఉంటే వాటిని స‌రిదిద్ధుకోవాల‌ని ఆదేశించామ‌న్నారు. ఇక్క‌డ అనేక మౌలిక స‌దుపాయాలు ఉన్న‌ప్ప‌టికీ ఇత‌ర సౌక‌ర్యాలు లేవ‌న్నారు. వాట‌న్నింటిని కూడా త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. గ‌త ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం చేసిన విధ్వంసం కార‌ణంగా...రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అయిపోయింద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో అంద‌రూ ఆర్ధిక నేర‌స్తులేన‌ని ఆరోపించారు. ఈ కార్య‌క్ర‌మంలో జీజీహెచ్ వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.
    అనంత‌రం మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ... ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఒక సంవత్సరంలో గాడి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులకు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా జత చేయపోవడం వల్ల అనేక పథకాలు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పాడయని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టి వీటి అభివృద్ధికి సహకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రిని నారాయణ కోరారు.

КОМЕНТАРІ •