Holy City Tirupati | Turning into an Electronic Hub | Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే నవ్యాంధ్ర పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది.
    ఆటోమొబైల్‌ రంగం మొదలుకొని సెల్ ఫోన్‌ తయారీ పరిశ్రమల వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తిని ఆరంభించగా మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణం... ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం కారణంగా చిన్న సంస్థలే కాదు కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ఇటు దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్ధిక మండళ్లలో ఇప్పుడు ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు పరంగా చూసుకుంటే తిరుపతినగరం ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక హబ్‌ల కారణంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు తయారు చేసే సంస్థలు ఇటు వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే ఆధ్యాత్మిక నగరిగా పేరొందిన తిరుపతి ఇక మీదట ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీకి కేంద్రంగా మారనుంది. సెల్‌ఫోన్ తయారీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హబ్‌లో దాదాపు నాలుగు మొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడి నుంచే ప్రారంభించనున్నాయి..
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel - bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Circle us : goo.gl/H5cc6E
    ----------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 13