చైతన్య గీతికలు-2# page41
Вставка
- Опубліковано 7 лют 2025
- లేకనే ఎంతో చేసిన మాయ
ఎటు పోయిందో - జాడలే లేవు ॥ లేకనే ॥
ఏమై పోయిందో - ఎలా ఉందో
వెతుకుదామంటే - జ్ఞాపకాలే లేవు ॥ లేకనే ॥
చరణములు :
1.జన్మల యాత్రలు నడిపిన మాయ
మాయము కాగానే జన్మజాడ లేదు.
మాయకు జన్మకు ఎంత ప్రేమ బంధమో!
ఏ ఒకటి లేకున్నా రెండవది ఉండదు ॥ లేకనే ॥
2. మాయ మత్తులో ఎగసిన ఆశలు
సరదాలు సందడులు వేసిన బంధాలు
చెలరేగి పోయిన అనుబంధాలు
చెడు చేయాలని చెడిపోయాయి ॥ లేకనే ॥
3. ప్రాణము లేని మాయ తీసింది ప్రాణం
నిర్జీవమై జగతికి పోసింది జీవం
ఎండమావిలో దప్పిక తీర్చుకోమన్నది.
మనసును, మనుగడను మసి చేసింది ॥ లేకనే ॥
4. మేలుకోగానే కల కరిగింది.
మేలు తెలియగానే మాయ చెదిరింది.
ఆరింది మాయ - వెలిగింది మహిమ
ఏకమై, అఖండమై, అనంతమై స్వరూపమై॥లేకనే||
41
పల్లవి :
అనుపల్లవి:
34. లేకనే ఎంతో చేసిన మాయ