Rajma & Rice

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • All purpose gravy
    ఒక 3 tbsp నూనె కాగాక
    దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క
    ఏలకులు ఒక టీస్పూన్
    జీర ఒక టీస్పూన్
    లవంగాలు ఒక టీస్పూన్
    Bay leaf ఒకటి వేసి వేగాక సన్నగా తరిగిన ఒక అరకిలో ఉల్లిపాయలు అందులో వేసి స్టవ్ సెగ సిం లో ఉంచుకుని వేయించాలి.ఉల్లిపాయలు కొద్దిగా వేగాక సుమారుగా ఒక 50gms వెల్లుల్లి,అల్లం ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలపాటు వేగాక అందులో ఉప్పు,పసుపు ,కారం,ధనియాలపొడి,గరం మసాలాపొడి వేసి చివరిగా తరిగి ఉంచుకున్న టొమాటోలు ఒక కిలో వేసి మొత్తం అన్ని కలియతిప్పి మూత పెట్టేసి ఓ 10 నుండి 15 నిమిషాలు ఉడకనివ్వాలి.నూనె పక్కకి వదిలేసినప్పుడు కూర ఉడికింది అని గుర్తు.పూర్తిగా చల్లారాక అలానే store చేసుకోవచ్చు,లేదంటే మిక్సి లో వేసి పేస్ట్ లాగా రుబ్బుకుని కూడా గాజు వాటిలో preserve చేసుకోవచ్చు.మెటల్ వి వాడవద్దు.
    గ్రేవీ ఇంకా టేస్టీ గా ఉండాలి అంటే కొన్ని cashew నీళ్ళల్లో ఓ పావుగంట నానపెట్టి మిక్సి లో రుబ్బేసి గ్రేవీ కలిపేసి ఇంకో 5 min sim లో పెట్టీ కలుపుకుంటూ ఉండాలి .
    చిన్న tip...gravy మంచి కలర్ కావాలి అంటే గ్రేవీ తయారు చేసుకునే టైంలో ,దాల్చిన చెక్క ముక్క తీసేసి paste చేసుకోవాలి.regular కారం కాకుండా కాశ్మీర్ కారం వాడుకోవాలి
    ఈ గ్రేవీ తో Greenpeas,ఆలు,పనీర్ ,రాజ్మా ,
    chole ,capscicum ,kaju masala అలా బోలెడు తయారు చేసుకోవచ్చు .
    ఎప్పటికప్పుడు ఓ చెంచా నూనె pan లో వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ,ఉల్లిపాయలు వేయించి ఓ గరిటేడు గ్రేవీ వేసి కలిపి చిన్న కప్ నీళ్ళు పోసి బాయిల్ రానిచ్చి అందులో ఏ కూర కావాలి అంటే ఆ ముక్కలు వేసేయటం, ఉప్పు కారం రుచి చూసుకుని,తక్కువ ఐతే వేసుకోవటం కొద్ది కొత్తిమీర ,కసూరి మేతి ఆకులు నలిపి వేసేయడం అంతే...
    రాజ్మా,chole ఐతే వాష్ చేసి overnight soak చేసుకుని, ఉదయం పూట ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ కడిగి ఒక కప్ రాజ్మా కి 2 కప్స్ నీళ్ళతో ప్రెషర్ కుక్కర్ లో 5-6 విజిల్స్ వచ్చేవరకు ఉంచి ,ఈ ఉడికిన రాజ్మా/chole 🍅 gravy లో కలిపి సన్నటి సెగ మీద ఓ 5 నిమిషాలు ఉడికించి వేడి అన్నం లో తినటమే.

КОМЕНТАРІ •