30-01-2025. 320వ రోజు.... 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - పాండవుల వినాశనానికి ఉపాయాలు ఆలోచించటం. ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ, పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ, పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ..... పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు "ఓ మహర్షులారా! వేదపండితుడైన వైశంపాయనులవారు జనరక్షకుడైన జనమేజయుడితో ఈ రకంగా అంటున్నాడు "ఓ జనమేజయ మహారాజా! దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటున్నాడు "ఓ తండ్రీ! అందమైన స్త్రీలను పంపించి పాండవులను ప్రలోభానికి గురిచేసి పాండవుల పట్ల ద్రౌపది విరక్తి పోందేవిధంగా చేయాలి! లేదంటే మన రాధేయుడిని అక్కడకు పంపించి పాండవులను ఇక్కడకు తీసుకొని వచ్చి సన్నిహితుల చేతనే పాండవులను సంహరించాలి!" అని దుర్యోధనుడు తనకు తోచిన ఉపాయాలన్నింటినీ తండ్రికి చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు "తండ్రీ! ఇంతవరకూ నేను చెప్పిన ఉపాయాలలో దోషము లేనటువంటి ఉపాయాన్ని చెప్పండి! సమయం మించి పోతుంది! ద్రుపదుడిమీద ఇతర రాజులకు విశ్వాసం కలుగకముందే ఈ పని మనం చేయాలి! లేకపోతే పాండవులను చంపేయటమనేది అసాధ్యమవుతుంది! శత్రువుల నాశనానికి నాకు తోచిన ఉపాయాలన్నింటినీ నేను చెప్పాను! ఇందులో గుణాలనూ, దోషాలనూ, లోపాలనూ మీరే విచారించండి! ఓ కర్ణా! ఇప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పు!" అని దుర్యోధనుడు కర్ణుడిని కూడా అతని ఉపాయాలను చెప్పమని అడగగానే కర్ణుడు ఈ రకంగా అంటున్నాడు "ఓ దుర్యోధనా! నా అభిప్రాయంలో ఇప్పటివరకు నీవు చెప్పిన ఉపాయాలలో ఏదీ కూడా ఉచతం కాదు! నీవు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ కూడా పాండవులను వశపరుచుకోలేము! ఓ వీరుడా! పాండవులను వశపరుచుకోవటం కోసం నీవు గతంలోనే ఆ అనేకమైన ఉపాయాలు ప్రదర్శించావు! కానీ వారు నీకు దేనివలన కూడా లొంగలేదు! గతంలో నీకు దగ్గరగా ఉన్నప్పుడే వారిని ఏమీ చేయలేకపోయావు! ఇప్పుడు వారు రెక్కలోచ్చి బయటకు ఎగిరిపోయినటువంటి పక్షి పిల్లలవంటివారు! ఇక నీవు వారిని బాధించలేవు! అదృష్టమనేది వారిని అత్యంత శక్తిమంతులుగా చేసింది! తాతా, తండ్రులనుండి వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని పొందాలనే కాంక్ష వారిలో ఇప్పుడు కలిగింది! వారి మధ్య భేదభావం కలిగించటం మనకు సాధ్యం కాదు! వారు ఒకే భార్యను వివాహమాడినటువంటివారు! ఆ కారణంగా వారి మధ్య కలహమనేది రానే రాదు! ఇక ద్రౌపదిని పాండవుల వద్దనుండి వేరు చేయటమనేది ఇతరులకు అసాధ్యమైన పని! భిక్షాటన చేస్తున్నప్పుడే పాండవులను ద్రౌపది వరించిందంటే ఆమెను వారినుండి దూరం చేయటం కుదరని పని! ఇక వారు సంపన్నులైతే వారిపాట్ల ద్రౌపది ఏ విధంగా విరక్తిని పొందుతుంది! స్త్రీలకు అనేకమందిని భర్తలుగా పొందటమనేది ఇష్టమైన గుణం! ఆమెకు ఇది అప్రయత్నంగానే లభించింది! అందుకే ఆమె వారిపట్ల విరక్తిని పొందటమనేది కష్టం! పాంచాలరాజైన ద్రుపదుడేమో నియమాలను ఆచరిస్తాడు! ధనముయందు పెద్దగా ఆసక్తి లేనటువంటి వాడు పాంచాలరాజు! ఓ దుర్యోధనా! నీవు నీ రాజ్యాన్ని పూర్తిగా ద్రుపదుడికి ధారపోసినా అతడు మాత్రం పాండవులను విడిచిపెట్టడు!" అని కర్ణుడు తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు!"" అని అంటూ శ్రీవేదవ్యాసమహాముని ప్రధానశిష్యుడైన వైశంపాయనులవారు పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🔆🙏🏼🔆🌄
జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ 🙏🙏🙏
Jai srimanarayana 🙏🙏
Om Sree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏
జై శ్రీమన్నారాయణ 🙏🏻
జై శ్రీరామ్ 🙏🏻
జై శ్రీ కృష్ణ 🙏🏻
Jaisrimannarayana jaisrikrishna jaisriram namaste 🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉🎉
Om Namo Bhagavate Vasudevaya 🙏🙏🙏
Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana
Om Sri Matha namaha
🕉️🔱🚩👏🙏ఓం జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🔱🚩👏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai Shreemannarayana 🙏🙏🙏🙏🙏
Jai sri ma narayana
శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఓం భగవతే వాసుదేవాయ 🙏🏻
జై శ్రీమన్నారాయణ 🙏🏻
జై శ్రీమన్నారాయణ
Govinda 🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీమన్నరాయన 🙏
ఓం అస్మద్గుభ్యో నమః 🙏🌹
గురువుగారికి పాదభివందనములు 🙏🌹
హే కృష్ణా సంరక్షమాo 🙏🌹
సర్వం శ్రీకృష్ణార్పన మస్తు 🙏🌹జై శ్రీమన్నరాయన 🙏🌹
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Vande Gurumpara
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA JAI SRI GURUDEVA
SRIMATHE RAMANUJAYA 🎉🎉
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏 thank you so much Guruvu gaaru🙏
Om Asmad Gurubhyo namaha 🙏
ఓం అస్మత్ గురుభ్యో నమః 🙏
30-01-2025.
320వ రోజు....
🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️
నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - పాండవుల వినాశనానికి ఉపాయాలు ఆలోచించటం.
ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ,
పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
"ఓ మహర్షులారా! వేదపండితుడైన వైశంపాయనులవారు జనరక్షకుడైన జనమేజయుడితో ఈ రకంగా అంటున్నాడు
"ఓ జనమేజయ మహారాజా! దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటున్నాడు "ఓ తండ్రీ! అందమైన స్త్రీలను పంపించి పాండవులను ప్రలోభానికి గురిచేసి పాండవుల పట్ల ద్రౌపది విరక్తి పోందేవిధంగా చేయాలి! లేదంటే మన రాధేయుడిని అక్కడకు పంపించి పాండవులను ఇక్కడకు తీసుకొని వచ్చి సన్నిహితుల చేతనే పాండవులను సంహరించాలి!" అని దుర్యోధనుడు తనకు తోచిన ఉపాయాలన్నింటినీ తండ్రికి చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు "తండ్రీ! ఇంతవరకూ నేను చెప్పిన ఉపాయాలలో దోషము లేనటువంటి ఉపాయాన్ని చెప్పండి! సమయం మించి పోతుంది! ద్రుపదుడిమీద ఇతర రాజులకు విశ్వాసం కలుగకముందే ఈ పని మనం చేయాలి! లేకపోతే పాండవులను చంపేయటమనేది అసాధ్యమవుతుంది! శత్రువుల నాశనానికి నాకు తోచిన ఉపాయాలన్నింటినీ నేను చెప్పాను! ఇందులో గుణాలనూ, దోషాలనూ, లోపాలనూ మీరే విచారించండి! ఓ కర్ణా! ఇప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పు!" అని దుర్యోధనుడు కర్ణుడిని కూడా అతని ఉపాయాలను చెప్పమని అడగగానే కర్ణుడు ఈ రకంగా అంటున్నాడు "ఓ దుర్యోధనా! నా అభిప్రాయంలో ఇప్పటివరకు నీవు చెప్పిన ఉపాయాలలో ఏదీ కూడా ఉచతం కాదు! నీవు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ కూడా పాండవులను వశపరుచుకోలేము! ఓ వీరుడా! పాండవులను వశపరుచుకోవటం కోసం నీవు గతంలోనే ఆ
అనేకమైన ఉపాయాలు ప్రదర్శించావు! కానీ వారు నీకు దేనివలన కూడా లొంగలేదు! గతంలో నీకు దగ్గరగా ఉన్నప్పుడే వారిని ఏమీ చేయలేకపోయావు! ఇప్పుడు వారు రెక్కలోచ్చి బయటకు ఎగిరిపోయినటువంటి పక్షి పిల్లలవంటివారు! ఇక నీవు వారిని బాధించలేవు! అదృష్టమనేది వారిని అత్యంత శక్తిమంతులుగా చేసింది! తాతా, తండ్రులనుండి వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని పొందాలనే కాంక్ష వారిలో ఇప్పుడు కలిగింది! వారి మధ్య భేదభావం కలిగించటం మనకు సాధ్యం కాదు! వారు ఒకే భార్యను వివాహమాడినటువంటివారు! ఆ కారణంగా వారి మధ్య కలహమనేది రానే రాదు! ఇక ద్రౌపదిని పాండవుల వద్దనుండి వేరు చేయటమనేది ఇతరులకు అసాధ్యమైన పని! భిక్షాటన చేస్తున్నప్పుడే పాండవులను ద్రౌపది వరించిందంటే ఆమెను వారినుండి దూరం చేయటం కుదరని పని! ఇక వారు సంపన్నులైతే వారిపాట్ల ద్రౌపది ఏ విధంగా విరక్తిని పొందుతుంది! స్త్రీలకు అనేకమందిని భర్తలుగా పొందటమనేది ఇష్టమైన గుణం! ఆమెకు ఇది అప్రయత్నంగానే లభించింది! అందుకే ఆమె వారిపట్ల విరక్తిని పొందటమనేది కష్టం! పాంచాలరాజైన ద్రుపదుడేమో నియమాలను ఆచరిస్తాడు! ధనముయందు పెద్దగా ఆసక్తి లేనటువంటి వాడు పాంచాలరాజు! ఓ దుర్యోధనా! నీవు నీ రాజ్యాన్ని పూర్తిగా ద్రుపదుడికి ధారపోసినా అతడు మాత్రం పాండవులను విడిచిపెట్టడు!" అని కర్ణుడు తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు!""
అని అంటూ
శ్రీవేదవ్యాసమహాముని ప్రధానశిష్యుడైన వైశంపాయనులవారు పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️
*ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌅🔆🙏🏼🔆🌄
Govinda 🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
🙏 జై! శ్రీమన్నారాయణ🙏
జై శ్రీరామ్!...
Jai Srimannarayana. Dasoham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
Om Sri Gurubyo namaha
Jai srimannarayana 🙏🏼🙏🏼
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
Jai Sri manarayana 🙏🙏
Om Sri Pitha namaha
Jai Sri Mannarayana
🙏🙏🌹
Om Sri Mathre namaha
Om Sri Mannarayana namaha