UniversityHUB | Wittenberg University Expands Global Reach Active Recruitment Efforts in Hyderabad

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • 180 సంవ‌త్సరాల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన ప్రతిష్ఠాత్మ‌క విద్యాసంస్థ అయిన విటెన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా భార‌తీయ విద్యార్థులు దీనిపై బాగా దృష్టిసారిస్తున్నారు. భార‌త‌దేశం నుంచి వందలాది మంది విద్యార్థుల‌ను త‌మ గ్రాడ్యుయేట్ కోర్సుల‌లోకి తీసుకుంటున్న‌ట్లు హైద‌రాబాద్‌లోని ఆదిత్య పార్క్ హోట‌ల్లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో విటెన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ ప్ర‌క‌టించింది.
    ఒహాయోలోని స్ప్రింగ్ ఫీల్డ్ లాంటి డైన‌మిక్ మెట్రోపాలిట‌న్ ప్రాంతంలో ఉన్న ఈ యూనివ‌ర్సిటీ.. ఎన‌లిటిక్స్‌లో ఎంఎస్ కోర్సును ప్ర‌వేశ‌పెట్టింది. దీంతోపాటు మ‌రిన్ని అత్యాధునిక కోర్సులు అందిస్తోంది. ఒహాయో, మిడ్ వెస్ట్ ప్రాంతంలో శ‌ర‌వేగంగా ఎదుగుతున్న విద్యాసంస్థ‌గా విటెన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీకి దాని గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంల వ‌ల్ల మంచి పేరు వ‌చ్చింది.
    ఈ సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీ ప్ర‌వేశాల విభాగం వైస్ ప్రెసిడెంట్ మారిబెర్త్ స్టీవెన్స్ మాట్లాడుతూ, “అంత‌ర్జాతీయ విద్యార్థుల‌కు ప్ర‌వేశాలు క‌ల్పించేందుకు కొత్త కోర్సులు ప్ర‌వేశ‌పెడుతున్నందుకు మేమెంతో గ‌ర్వంగా భావిస్తున్నాము. ఈ కొత్త కోర్సుల‌తో ప్ర‌ధానంగా భార‌త‌దేశం నుంచి ఇటీవ‌ల ఎక్కువ‌వుతున్న విద్యార్థుల అవ‌స‌రాలు తీర్చ‌గ‌లం. అంత‌ర్జాతీయ విద్యార్థుల రాక వ‌ల్ల మేం అందిస్తున్న కోర్సులు మ‌రింత మెరుగ‌వుతాయి“ అని చెప్పారు.
    ఎనలిటిక్స్, ఎంబీఏ లేదా ఎంఎస్‌బీఏ డిగ్రీలో అడ్వాన్స్డ్ ఎంఎస్ ఉన్న నిపుణుల అవసరం గణనీయంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌, ఫైనాన్స్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఆపరేషన్స్ వంటి పరిశ్రమలు డేటా సైన్స్ గ్రాడ్యుయేట్లలో మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఆరు అంకెల వేతనాలను అందిస్తున్నాయి, వారు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి డేటాను తీసుకోగలరు, నిర్వహించగలరు, విశ్లేషించగలరు.
    విటెన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన ప్రత్యేక అంతర్జాతీయ సేవా భాగస్వామి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న యూనివర్సిటీ హ‌బ్ డేటా ఎనలిటిక్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. విటెన్‌బర్గ్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియపై యూనివర్సిటీ హ‌బ్ వ్య‌వ‌స్థాప‌కుడు డాక్టర్ అనిల్ పల్లా విశ్వాసం వ్యక్తం చేశారు. విటెన్‌బర్గ్ యూనివ‌ర్సిటీని భారతీయ విద్యార్థులకు పరిచయం చేయడం యూనివర్సిటీ హ‌బ్‌కు గర్వకారణమని, ఇది వారి విద్యావకాశాలను విస్తృతం చేయడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
    “డేట‌న్-స్ప్రింగ్‌ఫీల్డ్ ప్రాంతం చాలా వేగంగా ఎదుగుతున్న వాణిజ్య కేంద్రం. అమెరికాలో చారిత్ర‌కంగా కూడా చాలా ముఖ్య‌మైన ఉత్పాద‌క కేంద్రం. ప్ర‌ధాన‌మైన ర‌వాణా మార్గాల‌తో కూడుకున్న‌ వ్యూహాత్మ‌క ప్రాంతంలో ఉండ‌టం వ‌ల్ల మిడ్ వెస్ట్ ప్రాంతంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇది కీల‌క కేంద్రంగా మారింది. ఇక్క‌డ ఉన్న విస్తృత అవ‌కాశాల ద్వారా విద్యార్థులకు సాయం చేయ‌డానికి, మా కోర్సుల ద్వారా వాళ్లు త‌మ కెరీర్‌లో విజ‌య‌వంతం కావ‌డానికి వీల‌వుతుంది” అని స్టీవెన్స్ తెలిపారు.
    #education #wittenberg #wittenberguniversity #university #studying #studyinusa #bestcolleges #besteducation #students #usvisaapplication #h5tv #hyderabad #telangana

КОМЕНТАРІ •