Harish Anna Birthday Song || Harish Patel || Adharsh Patel || Srinivas Patel || DJ Sai Kanagarthi ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #harishpatel #adharshpatel #srinivaspatel #Vasri_Creations
    హరీష్ పటేల్
    తమ్మిడి శారద- గంగన్న ల
    మొదటి బిడ్డడు, ముద్దుల తనయుడు, మురిపాలకు వారసుడు.
    గూడిరేవు గ్రామంలో గట్టిపట్టుదలతో మొలకెత్తిన పచ్చటి మొలకాగ్రేసరం, అసలు సిసలైన మట్టిపరీమళం, మట్టిలో మాణిక్యం.
    ఇక తన గుణ గణాల జాడంటే ఆ శ్రీరాముడే ఆదర్శం, తనకు చక్కని తోడంటే లక్ష్మణుడి లాంటి తమ్ముడే ఆదర్శ్, చిక్కని నీడంటే ప్రేమాభిమానాలు పంచే చెల్లెలే తన అదృష్టం, ఎంచక్కని తోడూ నీడా అంటే సహచరి అంజలిదే జన్మ జన్మల సాన్నిహిత్యం.
    పువ్వు పుట్టగానే పరీమలిస్తుంది అన్నట్టు
    బాల్యం నుండే కళలంటే తనువూ మనసూ పులకల మొలకలెత్తిన కళారాధకుడు, ఆ దిశలో బుడి బుడి అడుగులేసిన కళా సాధకుడు.
    బడినుండి రాగానే సంగీతం ఒడిలో వాలిపోయి స్వరగతుల అన్వేషణలో, సుస్వర పదగతుల ఆలాపనలో ఓలలాడిన కళా లాలస కలిగినోడు, కళా పిపాసిగా మెలిగినోడు.
    తన కళా యాత్ర కు తోడు వర్తమాన కాలంలో సాంకేతిక పాత్రను అర్ధం చేసుకుని, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఆవాహన చేసుకుని అవపోసన పట్టిన టెక్నాలజిస్ట్,
    కళనూ, సాంకేతికతనూ పాత కొత్తల మేలుకలయికలా కలెగలిపిన టేస్టున్న సైంటిస్ట్,
    V6 న్యూస్ లో పనిచేసి చక్కని చిక్కని సేవలందించిన టెక్నీషియన్.
    కాలం గడిచేకొద్దీ, ఆలోచన మెరుగులద్దేకొద్దీ, పరిపక్వత పెరిగేకొద్దీ...
    తన దృష్టి మరోవైపు మళ్ళింది, మరో కొత్త సృజన వైపు దారి మళ్ళింది, ఎక్స్
    కెమెరా మీద తన కన్ను పడింది, కెమెరా కన్నే తన కన్నయ్యింది, కెమెరా ఆత్మే తనకు ఆత్మసాక్షాత్కారమయ్యింది.
    ప్రకృతి లోని పురుగూ పుట్రా, పులుగూ కలుగూ ఏదైతేనేం..
    శిలాజాల లాంటి శిథిల చిత్రాలకు సైతం సాంకేతిక జీవజలాన్ని అందించి వాటిని సజీవ సుందర చలన దృశ్య కావ్యాల్లా చిత్రించడంలో,చిత్రీకరించడంలో అందెవేసిన చేయిగా,
    కెమెరా కుంచెతో వీక్షకుల హృదయ పుటల్లో నిశ్చల వైవిధ్య వర్ణ తైల చిత్రాలుగా ముద్రించడంలో, మూర్తీకరించడంలో ఆరితేరిన వీరుడిలా తన యాత్ర సాగిస్తున్నాడు, తన పాత్ర పోషిస్తున్నాడు.
    వందకు పైగా తీసిన షార్ట్ ఫిల్మ్ లు తన కీర్తి కిరీటంలో కలికితురాళ్ళలా మెరుస్తుండడం తన నైపుణ్యానికి మచ్చుతునకలు,
    ఐదు వేలకు పైగా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో లైకుల వెంబడి లైకులందుకోడం తన నేర్పరితనానికి కొన్ని మెచ్చు తునకలు.
    అలాంటి అరుదైన, అద్భుతమైన లక్ష్య సాధకుడు, టెక్నాలజీ పథంలో నిరతం దూసుకుపోతూన్న అవిశ్రాంత పథికుడు... హరీష్ పటేల్!
    హరీష్ పటేలన్న!
    మా అన్న పెద్ద మనసున్న పెద్దన్న హరీష్ పటేలన్న!!
    అన్నా!
    మీ ఈ యాత్ర అనంతంగా సాగాలని, ఆనందంగా కొనసాగాలని, లెక్కకు మిక్కిలి విజయ దరహాసాలు సౌరభాలై మీ జీవన గమనంలో విరబూయాలని మా అక్షరాల ఆకాంక్షలు!
    అందుకోండి ఈ హార్దిక శుభాకాంక్షలు!!

КОМЕНТАРІ • 5