రాష్ట్రవ్యాప్తంగా YSజగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఫిబ్రవరి 5న YCPనిరసనలు
Вставка
- Опубліковано 7 лют 2025
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ రేట్ కార్యాలయాల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమంలో విద్యార్థులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ , చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభంపాటి విజయరాజులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేయడం పట్ల విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు లేవని ఆయన గుర్తు చేశారు. సకాలంలో విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం వల్ల వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం ఫీజులు కట్టని విద్యార్థులను కాలేజీల నుంచి యాజమాన్యాలు పంపించి వేయడం ఇటువంటి అవమానకర సంఘటనలతో విద్యార్థులు తీవ్ర అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపితే తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజును పెంచి విద్యార్థులకు అండగా నిలిచారన్నారు. వైకాపా ఏలూరు ఇన్చార్జ్ మాట్లాడుతూ కోటమి ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ పథకాలను తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే ఈ నిరసన కార్యక్రమం తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్కు మరియు డీఈఓ లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల నాయకులు ,కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని జెపి పేర్కొన్నారు అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నగర వైకాపా అధ్యక్షులు గుడిదేశీ శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయి సుధీర్ బాబు, బీసీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, పల్లి శ్రీనివాసరావు, ఎస్సీ నాయకులు ,కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు