ధవళేశ్వరం కొత్తపేట ఎన్నికల ప్రచారంలో గొందేసి శ్రీనివాస రెడ్డి కామెంట్స్

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2024
  • సంక్షేమ పథకాలు కొనసాగడానికి జగనన్నను మళ్ళీ గెలిపించండి
    - టిడిపి కూటమి మాయమాటలు, మాయ మేనిఫెస్టో నమ్మొద్దు
    - కూటమి రావడం అబద్ధం .. గ్రౌండ్ లెవెల్లో జగన్ నే కోరుతున్న వైనం
    - ఖచ్చితంగా జగన్ మళ్ళీ సీఎం అవుతారనడానికి ప్రజా స్పందనే కారణం
    - ధవళేశ్వరం కొత్తపేట ఎన్నికల ప్రచారంలో గొందేసి శ్రీనివాస రెడ్డి కామెంట్స్
    రాజమహేంద్రవరం, మే 10: జగనన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగన్ ని నెగ్గించుకోవాలని వైయస్సార్ పార్టీ నాయకుడు, న్యాయవాది గొందేసి శ్రీనివాస రెడ్డి పిలుపు నించ్చారు. ఇందుకోసం రాజమండ్రి రూరల్ వైసిపి అభ్యర్థి, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ పరిధిలోని ధవలేశ్వరం కొత్తపేటలో గొందేసి శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్బంగా తలారి వరప్రసాద్ ఆధ్వర్యంలో గొందేసి శ్రీనివాస రెడ్డిని పూలమాలలు వేసి పలువురు ఘనంగా సత్కరించారు. పరమళ్ళ నారాయణరావు, మిలిపల్లి గోదండరావు, గునుపే అశోక్, ఎన్వీ శేఖర్, చటకల చంటి, దేవులపల్లి సరిత, పెన్నాడ లక్ష్మి, పటపగల లక్ష్మి, పీలా దుర్గాప్రసాద్, గెడ్డం ప్రసాద్, ఉల్లి ప్రదీప్, విప్పర్తి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. జై జగన్ అని కార్యకర్తలు నినదిస్తుండగా హుషారుగా ప్రచార పర్వం కొనసాగింది.
    ఈసందర్బంగా శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ వైసిపి అభ్యర్థి, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డా గూడూరి శ్రీనివాస్ లను ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ ప్రచారం చేస్తుంటే, సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలన్న తాపత్రయం, ఆనందం స్పష్టంగా కన్పిస్తోందని అన్నారు. ముఖ్యంగా రూరల్ నియోజక వర్గంలో వైసిపిని ఖచ్చితంగా గెలిపించుకోవాలన్న ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో చూశానని అన్నారు. ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తోందని, ఈసారి 151సీట్లు దాటి వస్తాయని ఆయన ధీమాగా చెప్పారు. టిడిపి మాయ మాటలు నమ్మొద్దని, మాయ మేనిఫెస్టోని పట్టించుకోవద్దని శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేసారు. గతంలో ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు ఎన్నయినా చెప్పవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. కానీ జగన్ అంటే చెప్పింది చేస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. ఒక పథకం ప్రకారం కూటమి వచ్చేస్తోందని ప్రచారం చేస్తున్నారని, అయితే గ్రౌండ్ లెవెల్ కి వెళ్తే, ప్రతి పేద కుటుంబం జగనన్నను మళ్ళీ గెల్పించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదోవిధంగా సాయపడిన జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు అయన తెలిపారు.

КОМЕНТАРІ •