కలకండ పలుకులు శ్రీ సాయికథలు EP 04 PA 01 // KALAKANDA PALUKULU SRI SAI KATHALU EP 04 PA 01

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • కలకండ పలుకులు శ్రీ సాయికథలు EP 04 PA 01 // KALAKANDA PALUKULU SRI SAI KATHALU EP 04 PA 01
    కోపర్గామ్ నుంచి షిరిడీ వెళ్లేదారి... మధ్యలో గోదావరి...
    నది గట్టు నిర్మానుష్యంగా ఉంది. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి.. కానీ, బిక్కుబాయి మనసు మాత్రం అదోలా ఉంది.తీరని దిగులుతో దిక్కు తోచకుండా ఉంది. గోదావరిలో మునిగి గుండె బరువు తీర్చుకోవాలని ఆమె ఎంతలా ప్రయత్నించినా, శరీరం మునుగుతోంది తప్ప మనసు తేలిక పడడం లేదు.గట్టు మీద తుమ్మతోపు... దాని వెనుక శ్మశానం "రాధాకృష్ణమాయిని అక్కడే దహనం చేసి ఉంటారు..,"తన ఆప్త మిత్రురాలు, ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన రాధాకృష్ణమాయి గుర్తుకురాగానే బిక్కుబాయిలో దుఃఖం కట్టలు తెంచుకొంది.
    "బాబా... రాధాకృష్ణమాయిని మీరు ఎందుకు రక్షించలేదు?" షిరిడీ వైపు గోదావరిలో మునకలు వేస్తూ, ప్రతీ మునకకూ ఓసారి బాబాను ప్రశ్నిస్తోంది.
    చూస్తూ."మీ సేవ కోసం జీవితాన్ని ధారపోసిన దీనురాలికి లభించిన ప్రతిఫలం ఇదేనా?"
    "మిమ్మల్ని కృష్ణుడిలా భావించి, ఆరాధించిన ఆ అపర మీరాబాయికి మీరు
    అందించిన అభయం, ఆదరణ ఇవేనా?"
    "చిన్ననాడే భర్తను కోల్పోయి, బాల వితంతువుగా పండరీపురం చేరుకొని, విఠలుడి సేవలో తల మునకలైన ఆ అమాయకురాలు - మీలోనే విఠలుణ్ని దర్శించుకొంది. షిరిడీలో స్థిరపడి, సాయిసేవలోనే తరించింది. నిజమైన సద్గురువు చేయూతనందిస్తారని అంటారే! జీవితాంతం నడిపిస్తారని భావిస్తారే! అలాంటి మీరు రాధాకృష్ణమాయిని నడిమధ్యలో విడిచి పెట్టడం ధర్మమా? నట్టేట ముంచేయడం న్యాయమా?”

КОМЕНТАРІ • 21