HARIBHAKTI KALIGITEY/హరిభక్తిగలిగితే /AAV SERIES 05 EP 479/SALURI VASURAO/ANIRUDH / MAYAMALAVAGOWLA

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • 🌺🍃 *------------*🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 479
    ( హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక .. )
    🌺🍃 *-----------* 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 479 కి శుభ స్వాగతం ..🙏
    *ప్రార్థన ః--*🌹🙏
    హరివిరసులై జపతపము
    గురుతర యజ్ఞంబుఁ జేయ కూడునె ఫలముల్ ?
    యరసి హరినె నమ్ముచు నీ
    కరములు జోడించు చాలు కైవల్యముకై !
    🌹🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    హరి మీద భక్తి అనే సారమైన రసమును ప్రక్కకు పెట్టి నేను ఎంత గొప్ప జపము గానీ తపము గానీ ,
    చివరకు మిక్కిలి గొప్పనైన యజ్ఞము చేసినా ఏమి ఫలములను పొందగలను ? 🙏
    విచారించి తెలుసుకుని , ఆ శ్రీహరిపైననే నా మనసంతా లగ్నము చేసి నా చేతులు పైకి ఎత్తి జోడించి సంపూర్ణ శరణాగతితో ఒక్క నమస్కారము చేయగలిగితే అదియే నాకు కైవల్యప్రాప్తికి దోహదపడును కదా ! 🙏
    స్వామీ ! నిన్నే నమ్మియుండే అట్టి మనసును నాకు ప్రసాదించుము !🙏
    🌹🌹
    🌺🍃 *-----------*🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యులవారి కూమారుడైన పెదతిరుమలాచార్యుల వారు కూడా శ్రీ వేంకటేశ్వరునిపై అనన్యమైన భక్తితో అనేక ప్రబోధాత్మక సంకీర్తనలను రచించారు .🙏
    హరిపై భక్తిని ప్రధాన రసముగా ఉంచక చేసే ఎంతటి గొప్పపనులైనా అవి వృథయే అని అంటున్నారు .
    కేవలము ఆ చేతలు ఆర్భాటానికో , సహజ నైజము వల్లనో చేసినంత మాత్రాన పెద్ద ఫలము చేకూరదు .🙏
    ఆ చేత ఎప్పుడు గొప్పదగును ? అది హరి భక్తితో నిండి యున్ననాడే అని అంటున్నారు పెదతిరుమలయ్య !🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 *-----------* 🍃🌺
    🌹🌹
    ఈ సదాచారములు , సత్కార్యములు ఇవి అన్నీ పరమాత్ముడైన శ్రీహరి పై భక్తి అనే రసముతో అంతర్లీనముగా ముడిపడియుండితేనే అవి శ్రేష్టమైనవి అవుతాయి .🙏
    ముఖ్యమైనవి చేయ తగినవీ అవుతాయి కానీ ,
    ఆ హరిపై భక్తిని విడనాడి చేసిన ఎంతటి గొప్ప కార్యమైనా వ్యర్థమే ! వ్యర్థమే !!🙏
    🌹🌹
    ఎల్లప్పుడూ తన సహజగుణ స్వభావము చేత నీటిలోనే మునిగి ఉండే చేపకు , అది పుణ్యస్నానమగునా ? తీర్థ జలములలో మునిగిన ఫలితము వచ్చునా ?🙏
    కదలకుండా తదేకముగా ఒక్క కాలుతో నిలుచుని ఉండే కొంగకు, తన ఆహారము దొరుకునేమో గానీ ,
    యోగ సిద్ధిని ఏమన్నా పొందగలదా ? 🙏
    దినదినమూ కేవలము ఆకులనే మేసెడి మేకకు అది తన స్వాభావిక ఆహారమే గానీ , రుచులను త్యజించిన తపము చేసినదని అనుకొనగలమా ?🙏
    ఒక చెట్టు కొమ్మకు చిక్కి తలక్రిందులుగా వ్రేలాడగలిగినంత మాత్రాన ,అది ఏమన్నా సిద్ధులను సాధించినట్టా ? దానిని సిద్ధుడని అంటామా ?🙏
    🌹🌹
    పులుల సహజ ఆవాసమే గుహలు .
    అవి గుహలలో ఉన్నాయని వాటిని , ఋషులతో పోల్చము కదా !🙏
    ఎలుగుబంటికి కూడా గడ్డము ఉంటుంది , అంత మాత్రమున అది యోగసాధనలో మునిగిపోయి దేహవాంఛలేని స్థితిలో దాని గడ్డము పెరిగినది అని అనుకుంటామా ? దానిని యోగి అని అంటామా ?🙏
    నేలపై పుట్టిన పక్షలు పైనున్న ఆకాశమునకు ఎగరగలిగినంత మాత్రాన అవి దేవతలని గౌరవస్థానమును దక్కించుకున్నవా ?🙏
    అడవులలోనే వ్యాపించి తిరుగు కోతిని ,
    వానప్రస్థాశ్రమును స్వీకరించిన త్యాగిగా గుర్తిస్తున్నామా ? 🙏
    🌹🌹
    బాగుగా పెరిగినా సరే చెట్లు మాట్లాడలేవు .
    అంత మాత్రాన అవి మౌనవ్రతమును చేపెట్టిన దీక్షగల గుణము ఉన్నవి అని పరిగణిస్తున్నామా ?🙏
    అసలు బట్టలేమీ వేసుకోకుండా హాయిగా చంటిపిల్లలు ఆడుకుంటారు చీకు చింతలు లేకుండా !
    అంత మాత్రమున వారిని దిగంబర సన్యాసులని అంటామా !🙏
    ఈ విధముగానే
    నిజానికి పరమాత్మునిపై భక్తి అన్న ప్రధాన సారవంతమైన గుణము లేకుండా మనము చేసే ఏ ఘనకార్యమైనా సాధారణమై పోవును గానీ దానికి ఎటువంటి ప్రత్యేకత సమ్మతి ఉండదు .🙏
    కానీ ఇదిగో ఈ శ్రీవేంకటేశ్వరునిపై అచంచలమైన విశ్వాసముతో కూడిన అసమానమైన భక్తిపరాయణులకు మాత్రము వారు ఏమి చేసినా చెల్లుబాటే అవుతుంది .
    దానిని లోకము ఆమోదించి అనుసరిస్తూ ఉంటుంది కూడా !🙏
    🌹🙏🌹
    *ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 479)
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక
    విరసాచారము లెల్ల వృథావృథా
    ॥చ1॥
    మిక్కిలి నీట మునిఁగే మీను కది స్నానమా
    కొక్కెరధ్యానము సేసుకొరే అది యోగమా
    నిక్కి మేక ఆకు మేయు నిండ నదే తపమా
    చిక్కి తలకిందు వేలే జిబ్బడాయి సిద్ధుఁడా
    ॥చ2॥
    పులులు గుహ నుంటే పోలింప ఋషులా
    యెలుపు గడ్డము వేచు నింతలోనే యోగ్యుఁడా
    యిలఁబక్షు లాకాశాన కేఁగితే దేవతలా
    వొలసి కోఁతి యడవి నుంటే వనవాసమా
    ॥చ3॥
    మాకులు మాట లాడవు మౌనవ్రతములా
    కోక గట్టని బాలులు కోరి దిగంబరులా
    పై కొని శ్రీవేంకటేశు భక్తఁ డేమి సేసినాను
    చేకొని లోకములోని చెల్లుబడులే
    🌹🙏🌹🙏🌹

КОМЕНТАРІ • 10

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  2 місяці тому +3

    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక
    విరసాచారము లెల్ల వృథావృథా
    ॥చ1॥
    మిక్కిలి నీట మునిఁగే మీను కది స్నానమా
    కొక్కెరధ్యానము సేసుకొరే అది యోగమా
    నిక్కి మేక ఆకు మేయు నిండ నదే తపమా
    చిక్కి తలకిందు వేలే జిబ్బడాయి సిద్ధుఁడా
    ॥చ2॥
    పులులు గుహ నుంటే పోలింప ఋషులా
    యెలుపు గడ్డము వేచు నింతలోనే యోగ్యుఁడా
    యిలఁబక్షు లాకాశాన కేఁగితే దేవతలా
    వొలసి కోఁతి యడవి నుంటే వనవాసమా
    ॥చ3॥
    మాకులు మాట లాడవు మౌనవ్రతములా
    కోక గట్టని బాలులు కోరి దిగంబరులా
    పై కొని శ్రీవేంకటేశు భక్తఁ డేమి సేసినాను
    చేకొని లోకములోని చెల్లుబడులే
    🌹🙏🌹🙏🌹

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  2 місяці тому +2

    🌺🍃 *------------*🍃🌺
    *అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 479*
    *( హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక .. )*
    🌺🍃 *-----------* 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 479 కి శుభ స్వాగతం ..🙏
    *ప్రార్థన ః--*🌹🙏
    *హరివిరసులై జపతపము*
    *గురుతర యజ్ఞంబుఁ జేయ కూడునె ఫలముల్ ?*
    *యరసి హరినె నమ్ముచు నీ*
    *కరములు జోడించు చాలు కైవల్యముకై !*
    🌹🙏🌹
    ✍️ *--స్వీయపద్యము ( కందము )*
    🌹🌹
    హరి మీద భక్తి అనే సారమైన రసమును ప్రక్కకు పెట్టి నేను ఎంత గొప్ప జపము గానీ తపము గానీ ,
    చివరకు మిక్కిలి గొప్పనైన యజ్ఞము చేసినా ఏమి ఫలములను పొందగలను ? 🙏
    విచారించి తెలుసుకుని , ఆ శ్రీహరిపైననే నా మనసంతా లగ్నము చేసి నా చేతులు పైకి ఎత్తి జోడించి సంపూర్ణ శరణాగతితో ఒక్క నమస్కారము చేయగలిగితే అదియే నాకు కైవల్యప్రాప్తికి దోహదపడును కదా ! 🙏
    స్వామీ ! నిన్నే నమ్మియుండే అట్టి మనసును నాకు ప్రసాదించుము !🙏
    🌹🌹
    🌺🍃 *-----------*🍃🌺
    *మున్నుడి ః--* 🌹👇
    అన్నమాచార్యులవారి కూమారుడైన *పెదతిరుమలాచార్యుల* వారు కూడా *శ్రీ వేంకటేశ్వరునిపై* అనన్యమైన భక్తితో అనేక ప్రబోధాత్మక సంకీర్తనలను రచించారు .🙏
    హరిపై భక్తిని ప్రధాన రసముగా ఉంచక చేసే ఎంతటి గొప్పపనులైనా అవి వృథయే అని అంటున్నారు .
    కేవలము ఆ చేతలు ఆర్భాటానికో , సహజ నైజము వల్లనో చేసినంత మాత్రాన పెద్ద ఫలము చేకూరదు .🙏
    ఆ చేత ఎప్పుడు గొప్పదగును ? అది హరి భక్తితో నిండి యున్ననాడే అని అంటున్నారు పెదతిరుమలయ్య !🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 *-----------* 🍃🌺
    🌹🌹
    ఈ సదాచారములు , సత్కార్యములు ఇవి అన్నీ పరమాత్ముడైన *శ్రీహరి పై భక్తి* అనే రసముతో అంతర్లీనముగా ముడిపడియుండితేనే అవి శ్రేష్టమైనవి అవుతాయి .🙏
    ముఖ్యమైనవి చేయ తగినవీ అవుతాయి కానీ ,
    ఆ హరిపై భక్తిని విడనాడి చేసిన ఎంతటి గొప్ప కార్యమైనా వ్యర్థమే ! వ్యర్థమే !!🙏
    🌹🌹
    ఎల్లప్పుడూ తన సహజగుణ స్వభావము చేత నీటిలోనే మునిగి ఉండే చేపకు , అది పుణ్యస్నానమగునా ? తీర్థ జలములలో మునిగిన ఫలితము వచ్చునా ?🙏
    కదలకుండా తదేకముగా ఒక్క కాలుతో నిలుచుని ఉండే కొంగకు, తన ఆహారము దొరుకునేమో గానీ ,
    యోగ సిద్ధిని ఏమన్నా పొందగలదా ? 🙏
    దినదినమూ కేవలము ఆకులనే మేసెడి మేకకు అది తన స్వాభావిక ఆహారమే గానీ , రుచులను త్యజించిన తపము చేసినదని అనుకొనగలమా ?🙏
    ఒక చెట్టు కొమ్మకు చిక్కి తలక్రిందులుగా వ్రేలాడగలిగినంత మాత్రాన ,అది ఏమన్నా సిద్ధులను సాధించినట్టా ? దానిని సిద్ధుడని అంటామా ?🙏
    🌹🌹
    పులుల సహజ ఆవాసమే గుహలు .
    అవి గుహలలో ఉన్నాయని వాటిని , ఋషులతో పోల్చము కదా !🙏
    ఎలుగుబంటికి కూడా గడ్డము ఉంటుంది , అంత మాత్రమున అది యోగసాధనలో మునిగిపోయి దేహవాంఛలేని స్థితిలో దాని గడ్డము పెరిగినది అని అనుకుంటామా ? దానిని యోగి అని అంటామా ?🙏
    నేలపై పుట్టిన పక్షలు పైనున్న ఆకాశమునకు ఎగరగలిగినంత మాత్రాన అవి దేవతలని గౌరవస్థానమును దక్కించుకున్నవా ?🙏
    అడవులలోనే వ్యాపించి తిరుగు కోతిని ,
    వానప్రస్థాశ్రమును స్వీకరించిన త్యాగిగా గుర్తిస్తున్నామా ? 🙏
    🌹🌹
    బాగుగా పెరిగినా సరే చెట్లు మాట్లాడలేవు .
    అంత మాత్రాన అవి మౌనవ్రతమును చేపెట్టిన దీక్షగల గుణము ఉన్నవి అని పరిగణిస్తున్నామా ?🙏
    అసలు బట్టలేమీ వేసుకోకుండా హాయిగా చంటిపిల్లలు ఆడుకుంటారు చీకు చింతలు లేకుండా !
    అంత మాత్రమున వారిని దిగంబర సన్యాసులని అంటామా !🙏
    ఈ విధముగానే
    నిజానికి పరమాత్మునిపై భక్తి అన్న ప్రధాన సారవంతమైన గుణము లేకుండా మనము చేసే ఏ ఘనకార్యమైనా సాధారణమై పోవును గానీ దానికి ఎటువంటి ప్రత్యేకత సమ్మతి ఉండదు .🙏
    కానీ ఇదిగో ఈ *శ్రీవేంకటేశ్వరునిపై* అచంచలమైన విశ్వాసముతో కూడిన అసమానమైన భక్తిపరాయణులకు మాత్రము వారు ఏమి చేసినా చెల్లుబాటే అవుతుంది .
    దానిని లోకము ఆమోదించి అనుసరిస్తూ ఉంటుంది కూడా !🙏
    🌹🙏🌹
    *ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 479)
    ✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 2 місяці тому +2

    Om Sri Hariya Namaha🙏🙏🙏 Hari Bhakti; Goppatanamunu Keerthinchina Super Sankeertana; Sri Venugopal Garu; Adbhutamaina; Bhavamunu; Thagina wonderful Drusyamulatho; very beautifulga present chesaru; thank you so much; very nice, own padhyamu abhinandanalu; excellently Sungby Anirudh Garu; Sri Hari Srihari Srihari🙏🙏🙏 Sri Venkatadri Srihari bless you🙏🙏🙏

  • @bandigayathri6141
    @bandigayathri6141 Місяць тому +1

    Chala chala chala bagundhi thanks for uploading this beautiful song 🙏🏻💐👏

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 2 місяці тому +1

    Om namo venkatesaya Govinda Govinda

  • @AnnamayyaKalaSamithiNakrekal
    @AnnamayyaKalaSamithiNakrekal 2 місяці тому +3

    అద్భుతమైన కీర్తనలు వినే భాగ్యం కల్పించి నేను నేర్చుకుంటూ నా పిల్లలకు నేర్పించే అవకాశం కల్పించే మీకు సదా కృతజ్ఞతలు సార్ 🙏🙏

  • @sridevigona7954
    @sridevigona7954 2 місяці тому +1

    Adbhutamaina..keerthana...great voice...vinte manushula ke kadu animals birds ki kuda bhakti untundi Ani ashara gyanam ayindi.

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 2 місяці тому +1

    Om namo narayana govind

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 2 місяці тому +1

    🙏🙏🙏

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 2 місяці тому +1

    👌🏼🙏🙏