గంప సైజు పుర్రెలు దొరికిన చెరువు నీటిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి | Padmanabha Swamy in Water

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • గంప సైజు పుర్రెలు దొరికిన చెరువు నీటిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి | Anantha Padmanabha Swamy in Water ‪@praveentelugutraveller‬
    ముందుగా స్వామి వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు తెలుసుకుందాం ..
    స్వామి వారి పక్కన నాలుగువైపులా నాలుగు రంధ్రాలు భూమిలోకి ఉంటాయి ఆ రంద్రాలను స్థానికులు కోనేరులు అంటారు , వర్షకాలం లో ఈ చెరువులోకి నీరు రాగానే ఆ రంద్రాల ద్వారా స్వామి వారి దగ్గరకు నీరు వస్తాయి , ఇప్పటికి కూడా మీరు వర్షకాలం లో ఈ దేవాలయం దగ్గరకొస్తే ఈ అద్భుతమైన సన్నీ వేశాన్ని చూడవచ్చు ,
    వర్షకాలం లో స్వామి వారు ఇలా పూర్తిగా మునిగి పూజలు అందుకుంటారు , ఇక స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి గా పిలవబడుతున్నారు.
    ఇక స్వామి మొదట కనిపించకుండా భూమిలోపల ఉండేవారు అయితే స్థానికులు పొలం పనులకోసం చెరువులోని మట్టిని తవ్వి పొలాలకు తరలిస్తున్న క్రమం లో మట్టి తోలుటకు ఉపయోగించే ఎడ్లబండ్లు స్వామి వారి పైనుండి వెళ్ళేవి , అయితే స్వామి వారి పైకి ఎండ్లబండ్లు రాగానే కిందపడేవి , పైగా ఎక్కడివరకు ప్రశాంతంగా వచ్చిన ఎద్దులు కూడా స్వామి వారి విగ్రహం దగ్గరకి రాగానే భయం తో బెదిరిపోయేవి అంట , స్థానికులు చెప్పే దాని ప్రకారం స్వామి వారు లోపల భూమిలో ఉన్న సంగతి ఎద్దులకు తెలిసే ఉంటుంది స్వామి వారి పైనుండి అవి నడవలేక అటుగా లేదా ఇటుగా పక్కకి వెళ్ళటానికి ప్రయత్నించేవి కానీ మాకు ఆ విషయం తెలియక ఎందుకు ఇలా చేస్తున్నాయి అని ఆలోచించేవాళ్ళం అని చెప్తున్నారు ... ఆలా స్వామి కుడి కాలుపై నుండి ఎద్దుల బండ్లు వెళ్ళటం కారణం గా స్వామి వారి విగ్రహం కుడి కాలికి గాట్లు ఉంటాయి ఎడ్లబండి యొక్క అచ్చరలు అంటే గుర్తులు ఉంటాయి మీరు స్వామి ని దర్శించినపుడు చూడవచ్చు ..
    మరి స్వామి వారిని బయటకి ఎలా తీశారు ? విగ్రహాన్ని బయటకి తీయటానికి ట్రై చేసినపుడు ఏమి జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం ..
    ఒకరోజు స్థానికుడైన చిన్నరామిరెడ్డి వ్యక్తికి కలలో స్వామి కనిపించి నేను చెరువులో ఉన్నాను అని కొన్ని గుర్తు లు చెప్పి నాకు గుడి నిర్మించి పూజలు చేయమని చెప్పారట స్వామి వారు అయితే ఆ తర్వాత రోజు ప్రజల సమక్షం లో ఆ ప్రాంతం లో మట్టిని తొలగించినపుడు మొదట స్వామి వారి కాళ్ళు బయటపడ్డాయి తర్వాత విగ్రహం పూర్తిగా బయటపడటం జరిగింది , సరే ఎలాగూ విగ్రహం బయటపడింది కదా విగ్రహాన్ని పైకి లేపి చక్కగా పక్కన ప్రతిష్ట చేద్దాం అని ప్రయత్నించినపుడు స్వామి వారి విగ్రహం అసలు కదలలేదు పైగా ఎంత లోతుగా తవ్వినా స్వామి వారి విగ్రహం వస్తూనే ఉందట అప్పుడు అర్థం అయ్యింది ప్రజలకు స్వామి వారి విగ్రహం పాతాళం నుండి ఉందని , పైకి తీయటం అసాధ్యం గా భావించిన ప్రజలు ఇక్కడే స్వామి కి పూజలు చేయటం మొదలు పెట్టారు 1935 సంవత్సరం లో స్వామి కి దేవాలయం నిర్మించారు చిన్నరామిరెడ్డి అనే వ్యక్తి ..
    ఇక నిజంగా ఈ చెరువులో గంప సైజు ఉన్న పుర్రె దొరికిందా ?
    అవును స్థానికులు చెప్పే దాని ప్రకారం సుమారు 80 ఏళ్ల క్రితం చెరువులో తవ్వుతుండగా ఒక గంప సైజు ఉండే పుర్రె బయటపడిందని కానీ ఆ విషయం ఎవరికీ చెప్పాలో తెలియక ఆ పుర్రెను ఇక్కడే చెరువులో పడేసి యధావిధిగా మా పనులను చేసుకున్నామని ఈ విషయాలన్నీ మా ముందు తరం వాళ్ళు మాకు చెప్పారని చెప్తున్నారు ,
    అతి పురాతనమైన మూర్తి బయటపడిన ఈ ప్రాంతం లో అప్పటికాలం నాటి ప్రజల పుర్రె అయ్యి ఉండచ్చని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే అది కలికాలం నాటిది అయ్యి ఉండదని త్రేతాయుగం నాటిది అయ్యి ఉండచ్చని చెప్తున్నారు , ఈ కాలం లో అలంటి అంత పెద్ద మనుసులు ఉండటం అసంభవం అని వారి అభిప్రాయం , మరి కొంతమంది చెప్పేదాన్ని ప్రకారం దేవుడు చంపిన రాక్షసుడి పుర్రె అయ్యి ఉండవచ్చని , రాక్షసుడిని చంపిన తర్వాత స్వామి ఇక్కడ స్వయంభూగా వెలసి ఉండవచ్చని చెప్తున్నారు ...
    ఎంతో అందమైన ఈ మూర్తిని చూసాక చాలా ఆనందం వేసింది నాకైతే మీకేమనిపించింది అన్నది కామెంట్ లో పెట్టండి ఈ వీడియో కి లైక్ కొట్టండి ఈ వీడియో ని పదిమందికి షేర్ చేయండి సబ్స్క్రయిబ్ చేయండి ప్రవీణ్ రాయపాటి ఛానల్ ని

КОМЕНТАРІ • 2