Bhagavanthuniki sevakudiga undu ~ భగవంతునికి సేవకుడిగా ఉండు

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ •

  • @annapurnatallapaneni5765
    @annapurnatallapaneni5765 Рік тому +2

    Om vyasadevaya namaha🙏🙏🙏vela vela krutagnatalu tandri🙏🙏🙏krutagnatalu amma🙏🙏🙏

  • @morlanagendram9110
    @morlanagendram9110 Рік тому

    🙏ఓం వ్యాస దేవాయ నమః 🙏కృతజ్ఞతలు గురుదేవా 🙏కృతజ్ఞతలు అమ్మ 🙏

  • @manyamsubrah6
    @manyamsubrah6 5 місяців тому +1

    Jai grudeva🌺🙏🙏🙏🙏🙏🌷

  • @RajendraPrasad-bk2hu
    @RajendraPrasad-bk2hu Рік тому +1

    Adbhuthamaina bodha thandri
    Krutagnatalu gurudeva krutagnatalu

  • @ravikanakamedala3937
    @ravikanakamedala3937 Рік тому +1

    🙏🙏🙏tandri vyasadeva tandri vyasadeva 🙏 tandri elanafavalo teliyasesi mammanlni nadipistunnadu ku krutagnatalu tandri krutagnatalu velakoladi krutagnatalu 🙏🙏🙏

  • @LOCAL_BOY-PANDU
    @LOCAL_BOY-PANDU Рік тому +1

    Jai guru Dev

  • @sandhyagudavalli2548
    @sandhyagudavalli2548 Рік тому +2

    🙏🙏🌷🌷om Sri vyasa paramathmane namaha. Kruthagnathalu gurudeva. Vela Vela kruthagnathalu thandri. Jai gurudeva. 🌷🌷🙏🙏🛐🛐🛐🛐🛐

  • @venkatnarsingarao1179
    @venkatnarsingarao1179 Рік тому

    Gurudevulaku kruthagnathulu

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому

    Guruvudevula ki pranamamulu

  • @ushasri9213
    @ushasri9213 Рік тому

    🙏 OM SRI PARAMATMA NE NAMAHA🙏🌺🌺

  • @pailasivayya498
    @pailasivayya498 Рік тому +1

    Om vyasadevaya namaha 🙏 kruthagnthalu thandri gurudeva 🙏

  • @RaghuKumari-k7e
    @RaghuKumari-k7e Рік тому +1

    Kruthagnatalu thandri kruthgnathuallu Gurudeva

  • @venkateshwarlub5311
    @venkateshwarlub5311 Рік тому

    Krutagnatalu tandri krutagnatalu tandri

  • @ramkumarnannapaneni8310
    @ramkumarnannapaneni8310 Рік тому +1

    Krutagnatalu..guru deva

  • @anasuryabittu9048
    @anasuryabittu9048 Рік тому +1

    Krutagnatalu Gurudeva vela vela krutagnatalu tandri Om Vyasadevaya Namaha

  • @lakshmidurganerusu344
    @lakshmidurganerusu344 Рік тому

    Om sree gurubhyo nnamaha🙏🙏🙏🙏🙏

  • @kanyakumarimaganti2983
    @kanyakumarimaganti2983 Рік тому +1

    Krutagnatalu tandree krutagnatalu gurudeva krutagnatalu ammaa jai gurudeva 🌹🙏🙏🙏🙏🙏🙏🌹

  • @venkateshwarlub5311
    @venkateshwarlub5311 Рік тому

    Om vyasadevayanamaha

  • @RaghuKumari-k7e
    @RaghuKumari-k7e Рік тому +1

    Kruthgnathuallu Gurudeva kruthgnathuallu

  • @nagalakshmisunkara5464
    @nagalakshmisunkara5464 Рік тому +4

    కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏🙏🙏🙏

  • @srirama226
    @srirama226 Рік тому +1

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @maruthisankar8221
    @maruthisankar8221 Рік тому +1

    Om Sri gurubhyo namaha

  • @manyamsubrah6
    @manyamsubrah6 Рік тому +1

    Gai grudeva

  • @Mia-bi8kg
    @Mia-bi8kg Рік тому

    Kruthagnathalu GurudevaKruthagnathaluAmma🙏🙏💐🫡

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    *🌸26. ఓం మహాభారత కర్త్రే నమః* 🌸
    మహాభారతం ఇతిహాసం. ఇతిహాసం అంటే కల్పితం కాక, యథార్థంగా జరిగిన వృత్తాంతం. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాన్ని రంగరించి *‘పంచమ వేదం’* గా శ్రీ వ్యాసదేవులవారు అందించిన ఈ మహాభారతం *‘భారతీయ విజ్ఞాన సర్వస్వం’* .
    శ్రీ వ్యాసదేవులవారు తాను శ్లోకాలు చెప్పేటప్పుడు వేగంగా, తప్పులేకుండా వ్రాయగలిగే ఒక లేఖఖుడు కావాలని అడిగినపుడు, బ్రహ్మదేవుడు దీనిని లిఖించటానికి గణేశుడే సమర్ధుడుని సలహా ఇచ్చారు. అప్పుడు శ్రీ వ్యాసదేవులవారు గణేశుని స్మరింపఁగా ఆయన ప్రత్యక్షమై వ్యాసులవారి కోరిక విన్నారు. నా గంటం ఒక్క క్షణమైనా ఆగకుండా చెప్పగలిగితే వ్రాసిపెడతాను అని అన్నారు. శ్రీ వ్యాసులవారు వెంటనే నేను చెప్పేదంతా అర్ధము చేసుకొని మాత్రమే లిఖించాలి అని కోరారు. గణేశుడు అంగీకరించారు.
    శ్రీ వ్యాస దేవులవారు ప్రజ్ఞతో అక్కడక్కడ ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టమైన, గూఢమైన అర్ధం ఉన్న శ్లోకాలను చెప్పేవారు. దానివలన మధ్యలో సర్వజ్ఞుడైన గణేశుడే వ్రాయటం ఆపి ఆ శ్లోకం అంతరార్ధం ఏమిటో అని తర్కించాల్సి వచ్చేది. అంతలో శ్రీ వ్యాసులవారు చాలా శ్లోకాలు అల్లుకొనేవారు. అటువంటి వాటిని *వ్యాస ఘట్టాలు* అంటారు. అవి శ్రీ వ్యాసదేవులవారి ప్రజ్ఞాపాటవాలకు చిహ్నాలు.
    శ్రీ వ్యాసులవారు తొలుత మహాభారతాన్ని ‘జయము’ అని వ్రాశారు. గ్రంధము వ్యాసులవారి ముఖ్య శిష్యులు నలుగురు. పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు. వీరిలో వైశంపాయనుడు, పాండవులకు వారసుడైన పరీక్షిత్తు కుమారుడయిన జనమేజయుడు అనే రాజుకు ‘జయ గాథని విస్తరించి భారతంగా చెప్పారు. అది 24,000 శ్లోకాలు గలది. భరత వంశస్థుల గాథలు ఉండటం చేత అది భారతం అయ్యింది. పిమ్మట ఆ భారతాన్ని సూతుడు ఉపాఖ్యానాలతో మరికొంత విస్తరించి శౌనకాది మహామునులకు చెప్పగా అప్పుడది మాహాభారతం అయ్యింది.
    భారతాన్ని రచించిన వారు, భారతంలో కనిపించుతున్న వారు, అంతర్యామి అయిన మన తండ్రి శ్రీ వ్యాసదేవులవారే . ఎక్కడెక్కడ తన రాక అవసరమో అక్కడక్కడ వారు కనిపించి జరగవలసిన కార్యాన్ని జరిపి, తమ రాకకు ఒక విశేష ప్రయోజనాన్ని, ఒక సందేశాన్ని లోకానికి అందించినవారు శ్రీ వ్యాసులవారు.
    ఇహపర సాధకం శ్రీమహాభారతం. జీవితమనేది ఇహపరాలకు రెండిటికీ చెందినది. ఇహమనేది అర్థకామాలైతే, పరమనేది ధర్మ మోక్షాలు.
    *ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ । యదిహాస్తి తదన్యత్ర యన్నేహస్తి నతత్‌ క్వచిత్‌ ।*
    ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో మానవుడికి ఏది కావలసినా, ఎంత కావలసినా, అదంతా ఇందులోనే దొరుకుతుంది. ఏది భారతంలో దొరకదో అది ఇక ఎక్కడా దొరకదు. నాలుగు పురుషార్థాలను సాధించటానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా ఇమిడ్చారు శ్రీ వ్యాసభగవానులు వారు.
    మానవులమైన మనము ఇక్కడ ప్రవర్తించే తీరునూ, పరానికై సంపాదించుకోవలసిన తీరునూ రెంటినీ రంగరించి మనకు అందించారు కరుణమయులైన మన తండ్రి వ్యాసులవారు.
    పరాన్ని గురించి మోక్ష ధర్మాలను, సనత్సుజాతీయం, భగవద్గీత, అనుగీత, విష్ణు సహస్రనామస్తోత్రం, శివ సహస్రనామస్తోత్రం, యక్ష ప్రశ్నలు మొదలైనవి చెప్పారు.
    ధర్మార్థ కామ మోక్షాలు తెలియక చీకట్లో తడుముకుంటూ కొట్టుమిట్టాడే దీనులకు శ్రీమహాభారతం అనే సూర్యోదయం కలిగించి చీకట్లను తరిమేశారు శ్రీ వ్యాసులవారు.
    వేదాలు అపౌరుషయాలు అయితే శ్రీమహాభారతం పౌరుషేయము.
    విష్ణుస్వరూపులు అయిన మన తండ్రి శ్రీ వ్యాసభగవానులు వారు భారతములో అందించిన ఇహ పర ధర్మ మోక్షాదులను తెలుసుకుని మన అంతఃకరణమును పవిత్రం చేసుకుని, మన ఈ మానవ జీవితం ఉన్నంతవరకు ఆ ధర్మాలను పాటిస్తూ పాపవిముక్తులమై మన తండ్రి పాదపద్మముకు *‘ఓం మహాభారత కర్త్రే నమః’* అని భక్తితో నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @ChopparapuPadmakumari
    @ChopparapuPadmakumari Рік тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @sarukodadala23
    @sarukodadala23 Рік тому +1

    ఓం వ్యాస దేవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *15. ఓం కమండలు ధారిణే నమః*🌸
    కమండలం అంటే నీరు నింపుకునే ఒక చిన్న పాత్ర. పూర్వకాలం నుండి ఎందరో దేవతలకు, ఋషులకు, మునివర్యులకు, సాధుపుంగవులకు కమండలం హస్తాలంకారమై అధ్యాత్మ సంస్కృతికి చిహ్నంగా నిలిచింది. బ్రహ్మ దేవునకు, మహాశివునకు సైతం హస్త భూషణమైంది.
    వైరాగ్యానికి, ఇంద్రియ నిగ్రహానికి ప్రతీకగా దీనిని విశ్వసించేవారు. కమండంలోని నీరు అమృత ప్రాయమై జీవితం ఫలప్రదం కావటానికి దోహదపడుతుంది.
    పరమాత్మ తన బిడ్డలమైన మనలను ముక్తులను కావించి తరింప చేయటానికి శ్రీ వ్యాసభగవానులు వారు అవతరించిన ఉత్తర క్షణంలోనే పెరిగి పెద్దవాడై, కమండలధారియై మానవాళిపట్ల అపారమైనప్రేమతో మృతత్వం నుండి అమృతత్వానికి చేర్చటానికి బాటలు వేసి, ఆనందకరమైన, శాంతి సౌభాగ్యలతో కూడిన జీవితాలను అందించడానికి వచ్చిన మన తండ్రి కమండలాన్ని ధరించినవాడగుట చేత *‘ఓం కమండలు ధారిణే నమః’* అని నిరంతరమూ స్మరించుకుంటూ భక్తితో నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *22. ఓం మహా తపస్వినే నమః*🌸
    మహా తపః సంపన్నులు అయిన శ్రీ వ్యాసభగవానుల వారి జీవితమే తపస్సుగా చేసుకున్నారు . తపస్సు అంటే మనసా వాచా కర్మలను ఏకం చేసి జీవించడం.
    ఆదిమధ్యాంత రహితులైన శ్రీ వ్యాసుల వారు జన్మించగానే బాలుడిగా ఎదిగి, వెంటనే తపోవనాలకు తరలి వెళ్ళడం, కలికాలంలో అజ్ఞానాంధకారంలో నున్న మానవాళిని రక్షించడానికి తపస్సుచేసి, మానవాళి కి సమగ్రమైన జ్ఞానాన్ని , వేదాలను విభజించి, బ్రహ్మ సూత్రాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, విష్ణు, లలితా సహస్రనామాలు, మహాభారతం, శ్రీమద్భగవద్గీత, భాగవతం మున్నగు అనేక గ్రంథాను రచించి లోకానికి అందజేశారు.
    శివుని గూర్చి కఠోరమైన తపస్సు నాచరించి బ్రహ్మజ్ఞానియైన శుకమునీంద్రుని కుమారుడుగా పొందారు.
    ఇప్పుడు శ్రీ వ్యాసులవారి తపఃశ్శక్తి ఎంతటిదో మహాభారత ఇతిహాసంలోని ఈ సన్నివేశం తెలుపుతుంది.
    కురుక్షేత్రం ముగిసిన తరువాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీ దేవి, విదురుడు అందరూ కలిసి తపస్సు ఆచరించడానికి అరణ్యాలకు చేరుకున్నారు. 16 సంవత్సరాలు గడిచాక పాండవులు అరణ్యాలకు వెళ్లి కలిసిన వేళ, అప్పుడు పరమాత్మ స్వరూపులు శ్రీ వ్యాస దేవులువారు ప్రత్యక్షమయ్యారు.
    ఆ సందర్భంలో గాంధారి ‘మహాత్మా! మీరు సాక్షాత్‌ పరమాత్మ స్వరూపం. మునులలో మహిమాన్వితులు, సాక్షాత్‌ అవతారపురుషులు మీరు. నా బిడ్డలను, చనిపోయిన నా బంధువులను నేను చూడాలనుకుంటున్నాను. మీకు సాధ్యం కానిది ఏది లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి.’ అని ప్రార్ధన చేసింది.
    వెంటనే వ్యాసులవారు ఎంతో ప్రసన్నతతో మీ కోరిక నేను నెరవేర్చుతాను అని వారిని నదీ తీరం దగ్గరకు తీసుకొనివెళ్లి, తన తపో మహిమతో యుద్ధంలో చనిపోయిన వారందరినీ ఆహ్వానించడం జరిగింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గంగలో ఒక కలకలం వినిపిస్తుంది. రెప్పపాటులో ఒక అద్భుతమయిన దృశ్యం అక్కడ ఆవిష్కరించబడింది.
    అనేకమంది పాండవకౌరవ వీరులు దివ్యశరీరాలతో, అనేక విచిత్ర ఆభరణాలతో, చిత్ర విచిత్రమయిన రథాలతో, ఆయుధాలతో కనిపించారు.
    కర్ణుడు అర్జునుడితో ఎంతో ప్రేమతో, సంతోషంగా, ఏవిధమయినటువంటి ద్వేషభావం లేకుండా, మనసారా కౌగిలించుకుని మాట్లాడతాడు. కుంతీ దేవి కూడా కర్ణుడిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుంటుంది. శ్రీ
    వ్యాసదేవులవారు ధృతరాష్ట్రునకు చూపు ప్రసాదిస్తారు. ఆరోజు రాత్రి అంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎంతో సంతోషిస్తారు.
    తరువాత వ్యాసులవారు వారితో ఇక మీరు మీ స్థానాలకు వెళ్ళండి అన్నారు. అనగానే మరల గంగలో కలకలం మరియు అదృశ్యం.ఇక్కడ వ్యాసులవారు ఒక మాట అన్నారు. ఆ వీరుల భార్యలను దృష్టిలో ఉంచుకుని మీలో ఎవరైనా మీ భర్తలతో వారి లోకాలకు వెళ్ళానుకుంటే, మీరు ఆ లోకాలలోని మీ భర్తలను చేరతారు. ఇది మరలా ఆశ్చర్యకరం. వెంటనే స్త్రీలు శ్రీ వ్యాసులవారికి నమస్కరించుకుని వాళ్ళ వాళ్ళ భర్తలను మనస్పూర్తిగా స్మరించుకుని గంగలో మునిగి వారి వారి లోకాలకు వెళ్ళడం జరిగింది. అందరూ శ్రీ వ్యాసదేవులవారి తపోమహిమను చూసి ఆశ్చర్యపోయారు. ఇదంతా మహాభారతంలోని సన్నివేశం. ఇది శ్రీ వ్యాసదేవులవారి తపఃశ్శక్తికి ఒక నిర్వచనం.
    కలియుగములో, మానవాళి దుస్థితిని ముందుగానే దర్శించిన శ్రీ వ్యాసభగవానులవారు మానవాళిని అన్ని విధాలా రక్షించడం కోసం, మహాతపస్సు ఆచరించిన తండ్రిని *‘ఓం మహాతపస్వినే నమః’* అని స్మరించుకుంటూ కృతజ్ఞతా పూర్వకంగా
    నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @sunnyhacker7465
    @sunnyhacker7465 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @varalakshmigolla6377
    @varalakshmigolla6377 Рік тому

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం వ్యాస దేవాయ నమః
    తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమ కు సాటి మరేదీ లేదని ,ఆ ప్రేమ ను ఎలా గుర్తించాలో, తండ్రి ప్రకారం ఎలా వుండాలో, విపులంగా వివరించారు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు 🙏
    మా పాలిట ఆపద్బాంధవులు,అనాధరక్షకులు, ప్రేమను పంచుతున్న శాంతి ప్రదాతలు మీరే తండ్రి గురుదేవా
    కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు 🙏 కృతజ్ఞతలు అమ్మా కృతజ్ఞతలు 🙏

  • @gnvravindrababu4413
    @gnvravindrababu4413 Рік тому +1

    🙏కృతాజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు🙏

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Рік тому

    Om vyasadevayanamaha krutagnatalu tandri..bhagavanrudiki sevakudiga evidhanga vundalo teliyachesaru gurudeva.krutagnatalu tandri

  • @nandeeswariallla6913
    @nandeeswariallla6913 Рік тому +2

    ఓం వ్యాస దేవాయ నమః కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు అమ్మ

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *4.ఓం శ్రీ బ్రహ్మవిష్ణుమాహేశ్వర స్వరూపాయ నమః* 🌸
    భారతీయ వాఙ్మయంలో మిక్కిలి ప్రధానమైనది మహాభారతం. మహాభారతానికి స్రష్ట, ద్రష్ట, కర్త అన్నీ శ్రీ వ్యాసదేవులవారే. విశిష్టమైన అవతారం, శ్రీ వ్యాసావతరం.
    *అచర్వదనో బ్రహ్మ: ద్విబహురపరోహరిః౹*
    *అఫాలలోచనః శంభు: భగవాన్ బాధరాయణః౹౹*
    వ్యాసులవారే ఒక శిరస్సు ఉన్న బ్రహ్మ, వారే రెండు చేతులు గల విష్ణువు, వారే రెండుకన్నులున్న శివుడు. సృష్టి, స్థితి, లయములకు కారకుడు.
    మానవాళిని సర్వ దుఃఖములనుండి బయట పడవేసి, దోషాలను పొగొట్టడానికి కావలసిన ధర్మాలను అందించి, ఆచరింపచేసి మానవాళిని ఉద్ధరించటం కోసం ఉద్భవించిన అవతారమే శ్రీ వ్యాసావతరం.
    *గురుర్భహ్మ: గురుర్విష్ణు* *గురుర్దేవో మహేశ్వరః*
    *గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః*
    గురువు త్రిమూర్తి స్వరూపం. శ్రీ వ్యాసాదేవులవారు గురుమండలికే గురువు.అసలు గురుబ్రహ్మ ఎలా అయ్యారు.
    ప్రతిఒక్కరికి అంతర్లీనంగా జ్ఞానం ఉంటుంది. అది సద్గురువు వద్దకు చేరే వరకు కప్పబడి ఉంటుంది.గురువు నీలో ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపి నీవు ఎవరో నీకు తెలియచేయటమే నిజమైన సృష్టి, అప్పుడు గురువు బ్రహ్మ.
    శాశ్వతమైనది, సత్యమైనటువంటిది అయిన బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించిన మహా మహిమాన్వితుడు వ్యాసభగవానులు వారు. చతుర్ముఖ బ్రహ్మ జీవసృష్టి చేస్తే, వ్యాసబ్రహ్మ అధ్యాత్మజ్ఞాన సృష్టి చేశారు.🙏
    గురువు విష్ణువు ఎలా అయ్యారు. నీలో మేల్కొన్న జ్ఞానం దినదినాభివృద్ది చెంది ఆధ్యాత్మికంగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కటానికి జ్ఞానసంపదను నీకు ఇస్తున్నపుడు గురువే విష్ణువు 🙏
    గురువు మహేశ్వర స్వరూపం ఎలా అయ్యారు. గురువు వద్ద పొందవలసినది పొంది, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ఏర్పరచుకొని ఆ జ్ఞానం వలన ఇక పుట్టవలసిన అవసరంలేని శాశ్వతమైన పరమాత్మ సాయుజ్యాన్ని పొంది చివరి మెట్టు ఎక్కించి మహేశ్వర స్వరూపమై తనలో లయం చేసుకొనే సమయంలో గురువే మహేశ్వరుడు, లయకర్త .🙏
    అటువంటి త్రిమూర్తి స్వరూపమైన ఆది గురువులను మనం అత్యంత వినమ్రతతో శిరస్సు వంచి *ఓం శ్రీ బ్రహ్మవిష్ణుమాహేశ్వర స్వరూపాయ నమః*
    అని స్మరించుకుంటూ నమస్కరించుకుందాము🙏
    🙏జై గురుదేవ్🙏

  • @arunakumarigaddam4733
    @arunakumarigaddam4733 Рік тому +1

    భగవంతుని కి సేవ అంటే ఏమిటి అని చాలా తేలికగా అర్థమయ్యే విధంగా ఉంది తండ్రి

  • @sunnyhacker7465
    @sunnyhacker7465 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @doddavenu2643
    @doddavenu2643 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    కృతజ్ఞతలు గురుదేవా🙏🙏🙏

  • @vanigolla1363
    @vanigolla1363 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому

    ఓం వ్యాస దేవాయ నమః 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻

  • @krishnakumar-rp8gh
    @krishnakumar-rp8gh Рік тому +1

    ఓం వ్యాస దేవాయ నమః,
    కృతజ్ఞతలు తండ్రీ

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *17. ఓం మాతృభక్తి పరాయణాయ నమః*🌸
    తల్లిదండ్రులకు వారి పుత్రుల వలన సేవ లభించుటయే వారు ఆ పుత్రులను కన్నందుకు నిజమైన ఫలం. తల్లిదండ్రులకు సేవ చెయ్యటమే తనయులకు ముఖ్య కర్తవ్యం. చతుర్దశ భువనాలను ప్రతిక్షణం కన్నతల్లి వలె రక్షణ చేసే లోకరక్షకుడు, పరమాత్మ మానవ జాతి ఉద్ధరణ కోసం అవతరించారు.
    సత్యవతి తన గర్భాన ఉదయించిన తేజోమూర్తి, అసాధారణుడైన పుత్రుని చూచి ఆనందంతో పొంగిపోయింది. అప్పుడు శ్రీ వ్యాస భగవానులవారు ‘అమ్మా! నేను తపస్సుకు వెళుతున్నాను’. నీవు అధైర్య పడవద్దు. ఏ విధమైన కష్టం గాని, అవసరంగాని కలిగినప్పుడు నన్ను స్మరించు, తక్షణమే నీ ముందు ఉంటాను’ అని తల్లికి చెప్పి ఆవిడ ఆశీస్సులతో తపస్సుకు వెళ్లారు.
    నిజానికి ఆ వరం సజ్జనలందరికి వర్తించే వరం. ఎవరైతే, శ్రీ వ్యాస దేవులవారు ఈ ప్రపంచానికి అందించిన వైదిక ధర్మాలను చిత్తశుద్ధితో అధ్యయనం చేస్తారో వారికి ఆ విజ్ఞాన సర్వస్వంలో శ్రీ వ్యాసభగవానుల వారి దర్శనం అవుతుంది.
    కాలక్రమంలో అవసరం ఏర్పడినప్పుడు సత్యవతి శ్రీ వ్యాస దేవుల వారిని స్మరించడం, ఆయన వచ్చి తల్లి కోరిక ప్రకారం కురువంశాన్ని నిలపటం, దేశాన్ని రక్షించటం జరిగింది. ఈ విధంగా శ్రీ వ్యాసదేవులవారు ధర్మాన్ని రక్షించారు.
    తదుపరి రాబోయేది మహాభారతయుద్ధం, కాలస్వరూపం పూర్తిగా ముందరగానే తెలిసిన పరమాత్మ వ్యాసులవారు, కురువంశలోని వచ్చే కలహాలను దృష్టిలో పెట్టుకొని తల్లిని ముందుగానే, ప్రశాంతమైన ఆశ్రమవాసానికి చేర్చి, ఆమె కోరిక మేరకు యోగమార్గాన్ని ఉపదేశించి ఆమెకు ముక్తిని ప్రసాదించారు.
    తల్లిగారైన సత్యవతి పట్ల అత్యంతగౌరవం, ప్రేమను ఆచరణలో చూపిన శ్రీ వ్యాసదేవులవారికి *‘ఓం మాతృ భక్తి పరాయణాయ* నమః’ అని పాదాభివందనముతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *16. ఓం చిన్ముద్రా విలసత్కరాయ నమః*🌸
    చిన్ముద్ర దాల్చిన చేయితో ప్రకాశించేవారు శ్రీ వ్యాసదేవులవారు.
    చిత్‌ అనగా చైతన్యమని అర్థం.
    చిన్ముద్ర - బొటన వేలు, చూపుడు వేలు కొనను కలిపి వృత్తాకారంగా చేసి మిగతా మూడు వేళ్ళను నిటారుగా ఉంచి పెట్టిన ముద్రే *చిన్ముద్ర* . ఇది శరీరంలోని శక్తి ప్రవాహాన్ని నియంత్రించే ఒకశక్తిమంతమైన *ఆధ్యాత్మిక ముద్ర*. జ్ఞాన సముపార్జనకు భౌతిక చిహ్నమైనందున *జ్ఞానముద్ర* అనీ అంటారు. బొటనవ్రేలు పరమాత్మ, చూపుడు వేలు అహంకారము. మిగతా మూడు వేళ్ళు త్రిగుణాలకు గుర్తు.
    ధ్యానం, తపస్సు సమయాలలో సాధకుని సాధనాశక్తిని జాగృతం చేసి, ఆ శక్తి శరీరం నుంచి బయటకు వెళ్లకుండా ఈ ముద్ర నియంత్రిస్తుంది. ఈ ముద్ర నాభి నుంచి కాలి వ్రేళ్ళ వరకు అవయవాలకు శక్తినిస్తుంది. ఈ ముద్ర మనశ్శక్తిని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది, కోపాన్ని నియంత్రిస్తుంది. ఈ ముద్ర ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది.
    భారతీయ సంస్కృతికి మహర్షులు అందించిన శాస్త్రాలలో యోగశాస్త్రం ఒకటి. పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని అందించారు. ఈ పతంజలి యోగశాస్త్రానికి ఆధారం శ్రీ వ్యాసదేవులవారి సూత్రాలే. ముద్రలు యోగశాస్త్రంలో ఒక భాగం. మనస్సును, శరీరతత్వాలను, శక్తి ప్రసారాన్ని నియమించడం కోసం మహర్షులు ఈ ముద్రలు ఉపయోగించి సాధన చేసేవారు. ఈ ముద్రను యజ్ఞ కార్యాలోను, వైదిక కర్మలోను, యోగ ప్రక్రియలోను, ఆలయాలలో దేవతారాధన సమయాలలోను మనం చూస్తూ ఉంటాం. ఈ ముద్ర ద్వారా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేయవచ్చు.
    పరమాత్మ స్వరూపులైనట్టి, జ్ఞానమూ జ్ఞానగమ్యమూ అయినట్టి శ్రీ వ్యాసాదేవులవారికి క్రొత్తగా జ్ఞాన సముపార్జనకు సాధనాదులతో కానీ, తపస్సుతో కానీ పనే లేదు. అయినా జ్ఞాన స్వరూపులైన అవతారమూర్తి నార వస్త్రాలను, కమండలాదులను ధరించినా, చిన్ముద్ర ధారియై తపస్సును ఆచరించినా అది ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడటానికే.
    శక్తిమంతమైన, విశిష్టమైన చిన్ముద్రతో స్వయంప్రకాశకులైన శ్రీ వ్యాస భగవానులు వారు చిన్ముద్రా విలసితులుగా కీర్తించబడ్డారు. లోకకల్యాణార్థము అవతరించిన జ్ఞాన స్వరూపులు, చిన్ముద్రా ప్రకాశమానులైన మన తండ్రికి కృతజ్ఞతతో శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ
    *‘ఓం చిన్ముద్రా విలసత్కారాయ నమః’* అని నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @ChopparapuPadmakumari
    @ChopparapuPadmakumari Рік тому +1

    కృతజ్ఞతలు తండ్రి వేలకొలది సార్లు కృతజ్ఞతలు

  • @rajarajeswari5741
    @rajarajeswari5741 Рік тому +7

    అవును గురు దేవ భగవంతు నీ ప్రేమ చూస్తే సర్వ యపంగా ఉన్న ప్రేమ అమొహం దేవా రాగద్వేషాలు శత్రువు లు ఉండరు హయ్ గా శాతం గా ఆనందం గా ఉంటుంది గురు దేవ తండ్రి ప్రేమ అనంతం గా ఉంటుంది ❤

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    *🌸27. ఓం గీతామృత ప్రదాయ నమః*🌸
    ఈ విశ్వంలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని గ్రంథం ఏదన్నా ఉన్నదా అంటే అది *శ్రీమద్భగవద్గీత*. ఎందుకంటే అది లోకానికి అందించింది సాక్షాత్‌ భగవంతుడు . అది మానవాళి జీవనగమనానికి ప్రామాణికం.
    భారత మధ్యమున భీష్మపర్వమునందు 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు గల 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో ఉత్తమోత్తమమైన ఆత్మ జ్ఞానాన్ని పొందుపరచారు శ్రీ వ్యాస భగవానులు వారు. భగవద్గీత సాక్షాత్తు భగవంతుని ముఖారవిందము నుండి అవతరించింది. *అందుకే ‘శ్రీ భగవాన్‌ ఉవాచ’ అని ఉంటుంది* . ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంధానికీ ఈ విధమైన ఏర్పాటు లేదు. ఈ గ్రంథానికి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ‘జయంతి’ వేడుక జరుగుతాయి. ఒక గ్రంథానికి మరియు ఆ గ్రంథ రచయితకి ప్రపంచవ్యాప్తంగా ‘జయంతి’ వేడుకలు జరుపుకోవడం ఈ గ్రంథం విషయంలోనే జరుగుతుంది మరెక్కడా కానరాదు. అంతటి మహామహిమాన్వితమైన గ్రంధం శ్రీమద్భగవద్గీత.
    ఆ తండ్రి స్వయంగా చెప్తున్నారు *‘ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే’* అని. ఉపనిషత్తుల సారమైన బ్రహ్మవిద్యను యోగశాస్త్రంగా అర్జునుని నిమిత్తంగా చేసి అందించాను అంటున్నారు. దీనియందు వేద, వేదాంత, యోగ విశేషాలు ఉన్నాయి. భారతంలో అంతర్భాగమైన బోధ అయినా ప్రత్యేక గ్రంధంగా భావించబడి, ప్రస్థానత్రయంలో ఒకటిగా కీర్తించబడింది.
    *‘గీతామే చోత్తమం స్ఠానం గీతామే పరమం పదం*
    *గీతాశ్రయోహం తిష్ఠామి గీతామే చోత్తమం గృహం*
    *గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్‌ లోకాన్‌ పాలయామ్యహం’*
    ఉపనిషత్తు సారమైన భగవద్గీతను
    గీతోపనిషత్తు అంటారు. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. గీతయే నా నివాసం. ముల్లోకమును పాలించుటలో గీతా జ్ఞానమే నాకు పరమ సాధనము అని పరమాత్మే స్వయంగా చెప్పారు.
    అజ్ఞానంలో కూరుకుపోయిన మానవాళిని జననమరణచక్రంలో పడి నలిగి పోకుండా శ్రీమద్భగవద్గీత మానవుని జీవనగమనంలో మార్గదర్శిగా ఉండి చుక్కానిగా వ్యవహరిస్తుంది. మానవాళిని సృష్టించినపుడు ఎలా నడుచుకోవాలో జీవితాన్ని ఎలా మలుచుకొని సన్మార్గంలో పయనించి, ఇదే చివరి జన్మగా చేసుకుని ఆ పరమాత్మలో ఐక్యమయ్యే విధానాన్ని సాంఖ్య, కర్మ, జ్ఞాన, భక్తి యోగములో పరమాత్మ బోధించారు.
    ఈ పవిత్ర గ్రంథాన్నిగురించి ‘వైష్ణవీయ తంత్రసారము’ అనే గ్రంథంలో ఇలా ఉంది : సర్వోపనిషదో గావో దోగ్ధా గోపా నందనః । పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌ ॥
    అంటే ఉపనిషత్తులన్నియు ఆవు అనుకున్నప్పుడు కృష్ణపరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు దూడ. మహత్తరమగు గీతామృతమే పాలు. సద్బుద్ధి కలవాడే ఆ పాలను తాగుతాడు అని గూఢార్థము.
    గాంధీ, భగత్ సింగ్‌, ఐన్‌స్టీన్‌, అరిస్టాటిల్‌, ఓపెన్‌ హామర్‌ ఇంకా అనేక మందికి స్ఫూర్తిని ఇచ్చింది భగవద్గీత.
    ఏ జ్ఞానం వల్ల మన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటామో, ఏది తెలుసుకుంటే ఇకపై తెలుసుకోవలసినది మరేదీ ఉండదో అటువంటి పరమ పవిత్రమైన జ్ఞానామృతాన్ని లోకానికి అందించినటువంటి అమృతమూర్తి శ్రీ వ్యాసదేవులవారిని కృతజ్ఞతాపూర్వకంగా *‘ఓం గీతామృత ప్రదాయ నమః’* అనే నామంతో స్మరిద్దాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸* 25. ఓం బ్రహ్మసూత్ర విధాత్రే నమః*🌸
    వేదం యొక్క చివరి భాగం - వేదాంతం. వేదాంతంలో సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అనే మూడు భాగాలున్నాయి. ఈ అరణ్యకంలోని ఆత్మ విచారణ భాగాన్ని ప్రత్యేకంగా ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో ఏ తత్త్వం గురించి చెప్పబడినదో దానిని ఏ సాధన ద్వారా తెలుసుకోవచ్చునో అలా తెలుసుకోవటం వలన కలిగే ప్రయోజనాన్ని తెలిపే సూత్రములనే బ్రహ్మసూత్రాలు అంటారు.
    సూత్రం :-
    *అల్పాక్షర మసందిగ్ధం సారవద్విశ్వతోముఖం ।*
    *అస్తోక మనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః ॥*
    సూత్ర వాఙ్మయం చాలా విశిష్టమైనది. సులువుగా జ్ఞాపకం ఉంచుకోవటానికీ, విస్తార విషయాన్ని క్లుప్తంగా బోధించటానికీ సూత్ర ప్రక్రియను దార్శనికులు ఉపయోగించారు.
    అపశబ్దము కాని, వ్యర్థాక్షరములు కాని లేకుండా, పదాల విశిష్ఠ అర్ధాన్ని ఏ సంశయము రాకుండా, ఆ సూత్ర అర్థ సిద్ధి కొరకు ఏ అక్షరములు ఎన్ని ఆవశ్యమో అన్ని అక్షరములే గల సారవంతమైన పద జాలాన్ని సూత్రము అంటారు.
    *బ్రహ్మ సూత్రము* :- బ్రహ్మ అంటే వేదమనియు, వేదార్థరూపమైన పరమాత్మ అనియు అర్థం. *పరమాత్మ స్వరూపమును నిర్ధారించటం కొరకు రచించిన సూత్రములకు బ్రహ్మ సూత్రముని పేరు* .
    వేదాల అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించే సూత్రాలు కావున వేదాంత సూత్రాలనీ, ఈ శరీరంలోనున్న శరీరణ అంటే ఆత్మ, పరమాత్మ గురించి నిర్ణయించేది కావున శారీరక సూత్రాలనీ అంటారు. బ్రహ్మాన్ని గురించి తెలిపే విషయాన్ని సారవంతంగా, నిస్సంశయంగా, సంగ్రహంగా తెలిపేది బ్రహ్మసూత్రము. అందుకే బ్రహ్మ సూత్రములు ఎంతో శక్తిమంతములై విశిష్టతను సంతరించుకున్నాయి.
    బ్రహ్మ సూత్రాలను వేదాంతదర్శిని అని కూడా అంటారు. ఆదిశంకరులు బ్రహ్మ సూత్రాలను శారీరక మీమాంస అన్నారు. శరీరి అనగా శరీరంలో ఉన్నవాడు అని అర్థం. శారీరక మీమాంస అనగా శరీరంలో ఉన్నవాడి గురించిన విచారణ.
    శ్రీ వేదవ్యాస భగవానులవారు, నాలుగు వేదములోని అనంతమైన జ్ఞానాన్ని సమన్వయం చేసి, సారాన్ని తీసి 555 సూత్రముల ద్వారా మానవాళికి అందించారు. వీటిని బ్రహ్మసూత్రాలు అన్నారు. ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మ సూత్రాలు నాలుగు అధ్యాయముగా ఉంటాయి, ఒక్కో అధ్యాయము 4 పాదాలుగా అందివ్వ బడ్డాయి.
    మొదటి అధ్యాయంలో జగత్‌ జన్మాదులకు కారణమైన బ్రహ్మాన్ని తెలుసుకోవాలని ప్రమాణసహితంగా నిరూపించారు. రెండో అధ్యాయంలో శ్రుతి, ఉపనిషత్‌ వాక్యాల్లో సాధారణమైన బుద్ధికి కలిగే సందేహాలు నివృత్తి చేశారు. మూడో అధ్యాయంలో బ్రహ్మజ్ఞానానికి కావాల్సిన సాధనలు, వైరాగ్యం, జీవుడి లోక, పరలోక గమనాల గురించి వివరించారు. నాలుగో అధ్యాయంలో బ్రహ్మజ్ఞాన ఫలాన్ని, దానికి అంతరంగ సాధనం అయిన నిధి ధ్యాసన అభ్యాసాన్ని ఉపదేశించారు.
    ఏ వాక్యాలు బ్రహ్మాన్ని సూచించాయో అవి బ్రహ్మ సూత్రము అని , ఆ బ్రహ్మం ఎవరో కాదు నీవే అని, నీలోనే ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకోమని జీవిత పరమార్ధాన్ని తెలిపే బ్రహ్మసూత్రాలను రచించి సమస్త మానవాళికి అందించిన సృష్టి కర్త, విధాత, పరబ్రహ్మ స్వరూపులు అయిన మన తండ్రి శ్రీ వ్యాస దేవులవారిని *‘ఓం బ్రహ్మసూత్ర విధాత్రే నమః’* అని భక్తితో నమస్కరించుకుందాము🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *20.ఓం బాదరాయణాయ నమః*🌸
    *‘వ్యాసో నారాయణో హరిః’.*
    అవతారమూర్తి, వేదమయులు, జ్ఞాన స్వరూపులు అయిన భగవాన్ శ్రీ వేదవ్యాసులవారు సరస్వతీ నదీ తీరంలో రేగుచెట్ల వనంలో తపస్సు చేసుకోవడానికి వీలుగా బదరికాశ్రమం స్థాపించారు. లోకకల్యాణం కోసం తపస్సు చేయడం ప్రారంభించారు.
    శ్రీ వ్యాసభగవానుల వారు సకల వేదదర్శి. ప్రకృతి, పురుష, ఈశ్వర తత్త్వముల వాస్తవ స్వరూపాన్ని దర్శించిన మహనీయులు.
    సరస్వతీ నదీ తీరంలో రేగుచెట్టు క్రింద కూర్చొని ధ్యానావస్థలో నుండగా కలియుగ ప్రవేశం కానవచ్చింది. కలి యుగములో దుస్థితి ఆయన దర్శించగలిగారు. మానవాళిని దుఃఖసాగరం నుండి బయట పడవేయటానికి మహానిష్ఠతో సుదీర్ఘమైన తపస్సు చేశారు.
    రేగుచెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసిన, (నారాయణ) భగవదంశ సంభూతులైన ఆ మహాతపస్విని
    *‘ఓం బాదరాయణాయ నమః’* అని త్రికరణ శుద్ధితో స్మరించుకుందాం.
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *18. ఓం సరస్వతీ తీర వాసినే నమః*🌸
    బ్రహ్మ యొక్క నీటికుండలో పుట్టినట్లుగా భావించబడుతున్న సరస్వతీ నది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని పూజార్హత కలిగినదిగా కీర్తించబడింది. సరస్వతి, దృషధృతి నదుల మధ్య దైవంచే సృష్టించబడిన ప్రాంతం బ్రహ్మావర్తము నందు పూర్వము మనువు వేద సంస్కృతిని స్థాపించాడు. ఋగ్వేదం తొలి భాగం, ఉపనిషత్తుల వంటి స్వచ్ఛమైన సాహిత్యానికి ఈ బ్రహ్మావర్తం కేంద్రమైనది. అట్టి పావన సరస్వతీ నది ఋగ్వేదంలో ‘అంబి తమే నదీ తమే దేవి తమే సరస్వతీ’ అని తల్లిగా, ఉత్తమ నదిగా, దేవతగా పలుమార్లు స్తుతించబడింది.
    మహాభారతం ప్రకారంగా హిమాలయాలలో పుట్టిన ఈ నది ఎడారి ప్రాంతంలో అదృశ్యమై అంతర్వాహినిగా సాగుతూ, కొన్ని ప్రాంతాలలో దర్శనమిస్తూ, ముఖ్యంగా గంగా యమునలతో కలిసిపోతుంది. అదే త్రివేణి సంగమం.
    హిందూసంస్కృతిలో సరస్వతిని చదువుల తల్లిగా, జ్ఞాన స్వరూపిణిగా కొలుస్తారు. విగ్రహారాధన రాకముందు ప్రజలు ప్రకృతి దేవతలను, నదులను కొలిచేవారు. దివ్యజలాలను రక్షించే దేవత సరస్వతి అని ఋగ్వేదం చెబుతుంది. నదీదేవతగా ప్రారంభమైన సరస్వతి జ్ఞానాన్ని , విద్యను, సంగీతమును, కళను ప్రసాదించే అధిదేవతగా బ్రాహ్మణాలలో తెలిపారు. నదీ తీరంలోని వైదిక జాతి అభివృద్ధికి వాక్కు ప్రధాన కారణం అవడంతో సరస్వతీ నదీ దేవతను వాక్కుకు అధిదేవతగా ‘వాగ్దేవి’గా కొలిచారు.
    చరిత్ర ఆధారంగా హిమాయాలపై బదరికాశ్రమ ప్రాంతంలో అలకనంద నదిలో సరస్వతీ నది కలుస్తుంది. ఆ నదీ తీరానికి పశ్చిమాన పర్వత ప్రాంతంలో భగవాన్‌ శ్రీ వేదవ్యాసలవారు వ్యాస గుహలో మానవాళికి, ఆధ్యాత్మికంగా ప్రామాణికమైన గ్రంథాలను రచించి ఈ లోకానికి అందజేశారు. ఈ గుహలో పంచమవేదం, ధర్మభాండాగారం ఐన మహాభారతాన్ని శ్రీ వ్యాసులవారు చెబుతుంటే విఘ్నేశ్వరులవారు రాసినట్లు చెబుతారు. గల గల శబ్దాలతో ప్రవహించే సరస్వతి మహాభారత రచన చేసే ప్రదేశానికి వచ్చేసరికి రచనకు అంతరాయం కలగకుండా నిదానంగా శబ్దం లేకుండా ప్రవహించింది అంటారు.
    లోకోద్ధరణకై వేద విభజన కావించి, సమస్త వేద వాఙ్మయాన్ని మానవాళికి అందించిన జ్ఞానస్వరూపులైన మన తండ్రి, జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీ నదీ తీరాన ఆశ్రమవాసిగా నడయాడినందున *‘ఓం సరస్వతీ తీర వాసినే నమః’* అనే శుభ నామంతో ఏకాగ్రతతో ఆరాధించుకుంటూ నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    *వ్యాసం వశిష్ట నప్తారం శక్తే:పౌత్ర మకల్మషం౹ పరశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్౹౹*
    ఈ విధంగా వ్యాసుదేవులవారిని స్మరణ చేసుకుంటున్నాము. ఆయన ముందు తరాలు - ఆయన ముత్తాత వశిష్టులవారు, తాత
    శక్తి మహర్షి, తండ్రి పరాశర మహర్షి, శ్రీ వ్యాసదేవులవారి కొడుకు శుకమహర్షి, ఇంతమందిని స్మరించి అట్టి శ్రీ వ్యాసదేవులవారికి నమస్కారము అని చెప్పబడుతున్నది. వారి వంశం ఎంత ఉత్తమమైనదో తెలుస్తుంది. వాళ్ళ శక్తి సామర్ధ్యాలు, ఎంతటి గొప్పవారు, అంతటి ఉన్నతులువారు🙏
    🌸 *7. ఓం శక్తి పౌత్రాయనమః*🌸
    శక్తి మహర్షి వశిష్టులవారి పెద్దకుమారుడు. నిత్యవేదాధ్యయనశీలుడైన శక్తి మహర్షి మహాతపశ్శాలి, విద్వాంసుడు, జ్ఞాని, పరమసాత్వికుడు. శక్తిమహర్షి భార్య పేరు అదృశ్యంతి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే, అంటే పరాశరడు గర్భంలో ఉండగానే శక్తి మహర్షి పరమపదిస్తారు.
    పరాశర మహర్షి వశిష్టల వారి దగ్గర పెరిగారు. శక్తిమహర్షి యొక్క తపస్సు అఖండమైన జ్ఞానం పరాశరునికి సంక్రమించాయి.
    శక్తిమహర్షి, ఆయన భార్య అదృశ్యంతి ఎప్పుడూ ఉపనిషత్ మరియు వేదాలగురించి చర్చించుకునేవారు, వాటిని గర్భంలోని బిడ్డగా పరాశరుడు వింటూ ఉండేవారు. శక్తిమహర్షి భార్య పరులకు కనపడేది కాదు, అందుకే అదృశ్యంతి. ఆయన శక్తి స్వరూపుడు.
    అంతటి గొప్ప శక్తి మహర్షి పౌత్రుడిగా (మనవడిగా) శ్రీ వ్యాసభగవానులవారు అవతరించారు.
    అట్టి మనతండ్రిని *ఓం శక్తి పౌత్రాయనమః* అని శిరస్సువంచి నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *9.ఓం శ్రీ శుక మునీంద్ర జనకాయ నమః*🌸
    శ్రీ వ్యాసభగవానులవారు పుత్రుని కోసమై మేరుపర్వత శిఖరంపై మహాదేవుని గూర్చి తపస్సు చేశారు. మహేశ్వరుడు ప్రత్యక్షమై పంచభూతాలవలెనే పరిశుద్ధుడు, మహానుభావుడు అయిన శుకుని పుత్రునిగా ప్రసాదించాడు. ఆయనపుట్టగానే ఆకాశగంగ స్త్రీ రూపంలో సాకారంగా వచ్చి మంగళస్నానం చేయించింది. ఆకాశం నుండి కృష్ణాజినము దండము ఇచ్చి దేవతలు పుష్పవర్షం కురిపించారు. పుట్టగానే శిశువుగా లేరు ఐదుసంవత్సారాల వయసు కలిగి ఉన్నారు. పరమేశ్వరుడు స్వయంగా ఉపనయనం చేశారు. దేవేంద్రుడు మహోజ్వలంగా ప్రకాశించే కమండలువును ఇచ్చారు. శుకుమహర్షి యొక్క జననం మానవులు, దేవతలే కాదు, పక్షులు మృగాలతో సహా ఆనందించాయి.
    శుకమహర్షి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించారు. తండ్రి శ్రీ వ్యాసదేవుల వారి అనుమతితో దేవగురువు బృహస్పతులవారిని గురువుగా స్వీకరించి ధర్మశాస్త్రములు, వేద వేదాంగములు, రాజనీతి విషయాలు అభ్యసించారు. అప్పటికి ఆయన వయస్సు ఏడు సవంత్సరాలు మాత్రమే. శుకమహార్షి వ్యాసులవారి దగ్గర సాంఖ్య, యోగ శాస్త్రాలను అధ్యయనం చేశారు. శ్రీ వ్యాసదేవులవారు బంధనహేతువులను గురించి ఉపదేశించారు. ఈ ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉన్నదో, ప్రజలు ఎందుకు ఇలా కష్టపడుతున్నారో, వాళ్లకు చేసే మార్గోపదేశం ఏమిటో తెలియచేశారు.
    తండ్రి మాట మేరకు జనకుని వద్ద సకల మోక్షాధర్మాలు తెలుసుకున్నారు.
    శుక మహర్షి శ్రీ వ్యాసదేవులవారి నుండి అధ్యయనం చేసిన భాగవతామృతమును శాపగ్రస్థుడై, మరణాసన్నుడై ఉన్న పరీక్షిత్తు మహారాజుకు ఏడు రోజులలో వినిపించి అతనికి మోక్షప్రాప్తి కలిగించారు.
    పరమవైరాగ్యమూర్తి, శ్రీ శుక మునీంద్రుల వారి తండ్రి, మన అందరి తండ్రి అయిన శ్రీ వ్యాస భగవానులవారికి
    *ఓం శ్రీ శుక మునీంద్ర జనకాయ నమః* 🙏అని నమస్కరిస్తూ ఆ తండ్రి అనుగ్రహముతో ఈ మానవ జీవితాన్ని సార్ధకం చేసుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @saiinkollu2872
    @saiinkollu2872 Рік тому +1

    🌹🙏🙏🙏🌹

  • @jyothirudarrajujyothi8736
    @jyothirudarrajujyothi8736 Рік тому +2

    ఓం వ్యాస దేవాయ నమః 🙏కృతజ్ఞతలు గురుదేవా కృతజ్ఞతలు తండ్రి 🙏జై గురుదేవ్ 🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +2

    ఓం శ్రీ వేదవ్యాసాయనమః వేదవ్యాసదేవాకృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు అమ్మ కృతజ్ఞతలు🕉🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *23. ఓం అనంత జ్ఞాన స్వరూపాయ నమః*🌸
    శ్రీ వ్యాస దేవుల వారు అందించిన జ్ఞానాన్ని మనం దేనితోనూ కొలువలేము. అది అనంతమైనది. ఆ జ్ఞాన సంపదను ఎంతమంది తీసుకుని వెళ్లినప్పటికీ ఏమాత్రం తరగనిది.
    ఇక్కడ ఎవరూ కొత్తగా కనుగొన్నది, కనుగొనేది ఏమీ లేదు. భౌతిక జ్ఞానమైనా , ఆధ్యాత్మిక జ్ఞానమైనా అంతా ఆయన ప్రసాదమే. అందుకే ‘ *వ్యాసోచ్ఛిష్టం జగత్‌ సర్వం’* అంటారు.
    ఒక ఉదాహరణ :-
    గ్రీకు దేశానికి చెందిన ‘థియోఫ్రాస్థస్‌’ ని వృక్ష శాస్త్ర నిపుణుడుగా భావిస్తారు. కానీ మొక్కలో ప్రాణం ఉందన్న విషయంపై భృగు మహర్షి - భరద్వాజ మహర్షికి మధ్య జరిగిన సంవాదాన్ని శ్రీ వ్యాసదేవులవారు మహాభారతం శాంతిపర్వం 184 వ అధ్యాయంలో వివరించారు.
    వ్యాసులవారు, భూగోళం నుంచి ఖగోళం వరకు, సృష్టి మొదలు ప్రళయం వరకు, సప్తధాతు నిర్మితమైన మానవ దేహ నిర్మాణం నుంచి సకల చరాచర ప్రాణికోటి వరకు, తల్లి కడుపులో అండం మొదలు మరణానంతరం జరిపే కార్యము వరకు అనేక విషయాలను తెలియజేశారు. అలానే దైవ సంబంధిత కార్యాలను ఆగమ శాస్త్రాల ద్వారా వివరించారు.
    నేనెవరు? ఎక్కడ నుంచి వచ్చాను? ఎక్కడికి వెళుతున్నాను? అని తన గురించి తను తెలుసుకునేందుకు బ్రహ్మ జ్ఞానాన్ని అందించారు. ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతి గల దేశాలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారత దేశం అని పాశ్చాత్యులు చెప్తున్నారంటే శ్రీ వ్యాసదేవులవారు అందించిన అనంతమైన జ్ఞానసంపదే కారణం.
    ఈ విశ్వంలో *‘లోకా సమస్తా సుఖినో భవంతు’* అంటూ నిత్యం లోక క్షేమాన్ని కోరే భరత జాతికి సనాతన ధర్మాన్ని అందించినటువంటి వారు శ్రీ వ్యాసదేవులవారు. అనంతమైన జ్ఞానమే తన స్వరూపంగా గల మన తండ్రికి *‘ఓం అనంత జ్ఞాన స్వరూపాయ నమః’* అని నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *5.ఓం సత్యవతీ సుతాయ నమః*🌸
    జ్ఞానస్వరూపమైన శ్రీ వ్యాసవతారం తల్లి గర్భం ద్వారా ప్రకటితమైన అవతారం. పరమాత్మ తాను అవతరించటానికి ఎంచుకున్న జననీజనకులు సత్యవతి మాత, పరాశర మహర్షి.
    పరాశరమహర్షి గొప్ప మునీశ్వరుడు. తపస్వి. అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను ఈ లోకానికి అందచేశారు. సత్యవతి అతిలోక సౌందర్యవతి. జాలరికన్య. దాసరాజు కుమార్తె. ఈమె దేహం చేపల వాసనరావటం వలన ఈమెను 'మత్స్య గంధి' అన్నారు. కాల క్రమంలో పరాశర మహర్షి అనుగ్రహం వలన చేపల వాసన సువాసనగా మారి యోజనగంధిగా పిలువబడింది. ఈమె కారణజన్మురాలు. వారికి తనయునిగా అవతరించారు, శ్రీ వ్యాసభగవానులవారు. కృష్ణద్వైపాయనుడు నామధేయం. సత్యవతీ సుతుడు కాబట్టి వ్యాసభగవానులవారని 'సాత్యవతేయుడు' అని కూడ అంటారు.
    బాల్యంలోనే అడవులకు వెళ్లి కఠోరమైన తపస్సు ఆచరించాలని నిర్ణయించుకున్నవారై తన తల్లియైన సత్యవతి అనుమతి కోరారు. తల్లి దుఃఖితురాలై వారించడానికి ప్రయత్నించగా కృష్ణద్వైపాయనుడు ఆమెకు నచ్చచెప్పి ఇది దైవనిర్ణయమని, లోకకల్యాణార్ధం తపస్సు చేసుకోవడానికి వెళ్లక తప్పదని ఆమె ఆశీస్సులు కోరారు. ఆమె కోరిక మేరకు తనను తలచుకొన్నంతనే తాను తన తల్లి ఎదుట ప్రత్యక్షమౌతానని చెప్పి అరణ్యాలకు తపస్సు నిమిత్తం అతి చిన్న వయసులో వెళ్లారు.
    అటువంటి సత్యవతి మాత సుతులైన శ్రీ వ్యాస దేవుల వారిని అత్యంత వినమ్రతతో *ఓం సత్యవతీ సుతాయ నమః* అని స్మరించుకుంటూ నమస్కరించుకుందాము🙏
    🙏జై గురుదేవ్ 🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *13. ఓం జటావల్కలధారిణే నమః*🌸
    మఱ్ఱిపాలతో సవరించిన కేశమును జటలు అంటారు. మహర్షులు మఱ్ఱి పాలతో కేశమును తడిపి శిఖను ధరిస్తారు. వల్కము అనగా నారబట్టలు, పీచుతో చేసిన వస్త్రము అని అర్ధం. అనంతగుణ సమర్ధుడు, సమస్త విద్యలకురాజు, సమస్త జగత్తుకు గురువు అయిన శ్రీ వ్యాసదేవులవారు కమలముల వంటి విశాల నేత్రాలు, దట్టమైన మేఘములవంటి జటాజూటం, విశాలమైన వక్షస్థలము, జ్ఞానముద్ర, అభయ ముద్ర ఉన్న చేతులు, అజ్ఞానము అనే సర్పంచేత కాటు వేయబడిన జగత్తును పునర్జీవింపచేయాలన్న దృఢ సంకల్పం, నిర్మల శీతలకాంతితో వెలుగుతున్న ముఖకమలం కలిగివున్న ఉన్న మన తండ్రి భగవాన్‌ శ్రీ వేద వ్యాస మహర్షుల వారికి కృతజ్ఞతతో *ఓం జటావల్కలధారిణే నమః* అని స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవా🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *6.ఓం పరశరాత్మజాయ నమః* 🌸
    పరాశరాత్మజుడు = పరాశరుని పుత్రుడు.
    వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి మహర్షి, ఆయన కుమారుడు పరాశరమహర్షి. పిన్నవయసులోనే తండ్రి శక్తి మహర్షి మరణించగా, తాతగారైన వశిష్టులవారి సాన్నిధ్యంలో పెరిగి తత్పరతతో మహాతపః సంపన్నులైనారు పరాశరులవారు, త్రికాలవేది, సర్వవిద్యాపారంగతులు, ఖగోళశాస్త్రవేత్త. జ్యోతిష్యశాస్త్రంలో నిపుణులు.
    *'కలౌ పరాశర స్మృతిః'* అంటారు.
    కలియుగంలో మనం అవలంబించ వలసిన స్మృతి పరాశరస్మృతి అని నిర్ణయం జరిగింది.
    ఒక్కొక యుగంలో ఒకొక్క స్మృతి ఎందుకు అంటే మనిషి యొక్క శక్తిసామర్ధ్యాలు యుగయుగానికి మారతాయి.
    కృతయుగంలో మనుధర్మశాస్త్రం, త్రేతాయుగంలో గౌతముడి ధర్మశాస్త్రము, ద్వాపరయుగంలో శంఖులిఖితుల ధర్మము, ఈ కలియుగంలో పరాశర స్మృతి నిర్ణయింపబడింది. పరాశరుడు ఈ కాలానికి ధర్మశాస్త్రకర్త.
    పరమాత్మ ప్రేరణతో, పరాశరులు దేశసంచార సమయంలో జాలరికన్య అయిన సత్యవతిని అనుగ్రహించి శ్రీ వ్యాసావతారానికి కారకులైనారు.
    అట్లు అవతరించి పరమాత్మ, తల్లికిచ్చిన మాటను పాటించి కురువంశవృద్ధికి తోడ్పడ్డారు. తండ్రి పరాశరుని ఆత్మతేజస్సుతో పరశరాత్మజులైనారు.
    అట్టి శ్రీ వ్యాస దేవుల వారిని అత్యంత వినమ్రతతో స్మరించుకుంటూ *ఓం పరశరాత్మజాయ నమః* అని నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    *అష్టోత్తర శతనామావళి*
    3. 🌸 *ఓం శ్రీ అవతార వరిష్ఠాయ నమః* 🌸
    వరిష్టము అంటే శ్రేష్ఠమైనది, అత్యున్నతమైనది అని అర్థం. భగవంతుడు నిరాకారమై, అవ్యక్తమై, అనంతమై ఉండి ధర్మానికి ఆటంకం ఏర్పడినప్పుడు, అధర్మం పెచ్చు పెరుగుతున్నపుడు, అవతారముగా వ్యక్తమై, ఆ కార్యము నెరవేర్చిన పిదప ఆ అవతారాన్ని చాలంచుతున్నారు.
    ఉదాహరణకి:
    *మత్స్యావతారం* -వేదాలను సముద్రం నుండి బయటకు తీయడం కోసం.
    *వరహావతారం* - భూమిని సముద్రము నుండి బయటకు తీయడం కోసం.
    ఈ విధంగా మనకి ఎన్నో అవతారాలు ఉన్నాయి. కానీ వ్యాసావతారం విశిష్టమైనది, ఎందుకంటే ఆయన చిరాంజీవిగా శాశ్వతంగా మనతోనే ఇప్పటికీ ఉన్నారు.
    సనాతన ధర్మాన్ని , జ్ఞానసంపదను మనకు నిరంతరం అందివ్వటానికి, పరమాత్మ వ్యాసులవారిగా, జ్ఞానస్వరూపునిగా తనను తాను సృజించుకున్నారు.
    ఏరోజు, ఏగుడిలో, ఏదేవుడిని పూజిస్తున్నా అక్కడ మనం వినే మంత్రాలు వ్యాసులవారు అందించినవే కదా!
    ఎవరు ఏ పూజ చేస్తున్నా , ఏ దేవుడిని ఆరాధిస్తున్నా, ఏ ఆచారాన్ని పాటిస్తున్నా ఏ సంప్రదాయంలో ఉన్నా, మనం చేసే ఆరాధన, భక్తి, జ్ఞానము, యోగము, యజ్ఞము, ధ్యానము, తపస్సు, స్మరణ, సాధన.... ఇవన్నీ వ్యాసాదేవులవారు అందించిన శాస్త్రాల నుండి పొందుతున్నవే కదా! గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతము దగ్గరనుంచి, బారసాల, ఉపనయనం, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం ఇలా ఎన్నో శుభకార్యాలకు, మరియు మనిషి చనిపోయిన తరువాత చేసే కార్మకాండ వరకు మనము ఉపయోగించే మంత్రాలన్ని వ్యాసులవారు
    అందించినవి.
    వ్యాసుభగవనుల వారు అందించిన జ్ఞానమే లేకపోతే మనిషి మనుగడ లేదు. ప్రతిక్షణం వ్యాస ప్రసాదంమీద ఆధారపడి జీవిస్తున్నాము.
    *అందుకనే అంతటి విశిష్టత కలిగిన మన తండ్రిని మనస్పూర్తిగా *ఓం శ్రీ అవతార వరిష్ఠాయ నమః* నమస్కరించుకుందామ🙏
    🙏 జై గురుదేవా🙏
    ఈ సంధర్భంగా ఆతండ్రి ఇప్పటికి చిరంజీవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు అని తెలిపే *కాశీ కథ* రేపు చెప్పుకొందాము

  • @rajarajeswari5741
    @rajarajeswari5741 Рік тому +2

    భగవంతుడు నీ ప్రేమ నిరాధార గా ఉంటుంది అలాగే మనిషి ప్రేమ కూడా ఏమి ఆశించకుండా నిరాధార గా ఉండాలి

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *8.ఓం శ్రీ వశిష్ఠ నప్త్రే నమః*🌸
    వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుడు. సప్త ఋషులలో వశిష్ఠ మహర్షి కూడా ఒకరు. సూర్యవంశానికి రాజపురోహితుడు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి మహర్షి జేష్టుడు. ఈతని భార్య అదృశ్యంతి. శక్తి పుత్రుడే పరాశరుడు. శక్తి మహర్షి తపస్సులో ఉన్నప్పుడు కల్మషపాదుడు అనే శాపగ్రస్థుడైన రాక్షసుడు, ఆయనను ఇంకా వశిష్టులవారి మిగతా 99 మంది పుత్రులను చంపివేశాడు. వశిష్టులవారి కళ్ళ ముందరే ఆయన కొడుకులనందరిని చంపినా ఆయనకు క్రోధము రాలేదు. వశిష్ఠులవారికి, శాంతం ఆయన సహజలక్షణం. పరశారుడు, తన తండ్రిమరణం గురించి తెలుసుకొని, రాక్షసకులాన్ని
    తన తపఃశక్తితో నిర్మూలించాలి అని సంకల్పించినప్పడు, వశిష్ఠులవారు ఆయనను వారిస్తారు. ఆయన దర్శనంతో పరశారుడు శాంతిస్తాడు. అంతటి శాంతి స్వరూపుడు వశిష్ఠ మహర్షి.
    సరస్వతీ నదీ తీరాన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.
    అంతటి మహోన్నతుడైన వశిష్ట మహర్షి ముని మనములైన శ్రీ వ్యాసదేవులవారికి స్మరించుకుంటూ *ఓం శ్రీ వశిష్ఠ నప్త్రే నమః* నమస్కరించుకుందాము🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *12. ఓం కృష్ణాజిన విభూషితాయ నమః*🌸
    కృష్ణాజినము అనగా జింక చర్మము. కృష్ణాజిన విభూషితుడు అంటే కృష్ణాజినమే విశేష అలంకారంగా గలవాడు అని అర్ధం.
    శ్రీ వ్యాసదేవులవారు సర్వ సంగ పరిత్యాగులు. జితేంద్రియుడు, స్థిత ప్రజ్ఞులు. అపారమైన బ్రహ్మచర్యానికీ, గొప్ప తపః శక్తికి కృష్ణాజినం చిహ్నం. మరే అలంకారబద్ధుడు కాని ఆ తండ్రికి కృష్ణాజినమే అలంకారమయ్యింది.
    కృష్ణ జింక ప్రస్తావన పురాణ, ఇతిహాసాలో పలుమార్లు కనిపిస్తుంది. చంద్రుని వాహనమై, సత్త్వగుణానికి ప్రతీక అయ్యింది. ఎందరో మునులు, మహర్షులు కృష్ణజింకలను తమ తమ ఆశ్రమాలలో ఉంచుకునేవారు . సాధు స్వభావి అయిన ఈ జింక సాంగత్యం సాధకుల సత్త్వ గుణం పెరుగుతుందన్న విశ్వాసం.
    వాటి సహజ మరణానంతరం వాటి చర్మాన్ని పవిత్రంగా భావించి ఋష్యాదులు ఆధ్యాత్మిక చర్చ, తపస్సు, సాధనాదులకు గుర్తు అయిన కృష్ణాజినాన్ని ఉపయోగించే వారు.
    ధర్మరక్షణ కోసం మహత్తరమైన విజ్ఞాన సాగరాన్ని మధించి ప్రజలకు అందించే బృహత్తరమైన లక్ష్యంతో పరమాత్మ స్వరూపమైన వ్యాసులవారికి కృతజ్ఞతతో *‘ఓం కృష్ణాజిన విభూషితాయ నమః’* అని స్మరించుకుంటూ వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవా🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    *🌸24. ఓం వేద విభాజకాయ నమః*🌸
    వేదము - ‘విద్‌’ అను ధాతువు నుండి వచ్చిన పదము. ‘విద్‌’ అనగా తెలియుట అని అర్థం.
    బ్రహ్మ ముఖము నుండి పుట్టినట్టివి వేదములు. ఏ మనిషి చేతా తెలియజేయబడినవి కాదు కాబట్టి వేదాలు *అపౌరుషేయాలు* అంటారు. మహా మౌన స్థితిలోనున్న ఋషులు అనంతం (భగవంతుని) నుండి వెలువడిన వేద శబ్దాలను విని వాటిని గానం చేశారట. వీటిని ‘శ్రుతులు’ అనీ అంటారు. చెవికి వినపడిన శబ్దాలను శ్రవణంద్వారా తెలుసుకున్నవి కావున శ్రుతులు అన్నారు. ఇవి అనుశ్రవ్యాలుగా వస్తూ ఉంటాయి. గురువు ఉచ్చరించిన పదాలను విని శిష్యులు ఆ పదాలను అలాగే ఉచ్చరిస్తూ నేర్చుకొని తిరిగి వాటిని తమ శిష్యులకు నేర్పటం ద్వారా, అంటే ఒకరి నుండి ఒకరు శ్రవణం ద్వారా చక్కగా నేర్చుకుంటూ ఉండటం వలన వేదాలు యుగయుగాలుగా సజీవంగా ఉన్నాయి. వేదాలు సమ న్యాయాలు - దేశ కాల పరిస్థితులకు అతీతంగా, ఎల్లప్పుడూ అభ్యసించబడేవి. వేదము స్వాధ్యాయము - స్వ + అధ్యయనం అంటే మనలను మనం విశ్లేషించుకోవటం. తనను తాను తెలుసుకోవటం, దర్శించుకోవటం. వేదజ్ఞానం గలిగిన ఋషులను ద్రష్ట అంటారు. అంటే దర్శించినవారు అని అర్థం.
    మొదట వేదమంత్రాలు ఒక క్రమపద్ధతిలో లేకుండా ఒక్కొక్క ఋషి దగ్గర కొన్ని కొన్ని చొప్పున ఉండేవి. వానిలో కొన్ని వాడుకలో ఉండేవి, కొన్ని మరుగునపడి ఖిలమై పోయే దశలో ఉన్నవి. ఈ శబ్దాలన్నీ కలగాపులగంగా ఉండటంతో పురాతనమైన ఆ కాలంలో వేదాల సారాన్ని అభ్యసించటం కష్టంగా ఉండేదట. ఇలా ఎవ్వరికి ఉపయోగపడకుండా ఉన్న వేదమును శ్రీ వ్యాసులవారు ఒక చోట చేర్చి క్రమబద్ధం చేసి, వాటి అర్థాన్ని, ఉపయోగాన్నిబట్టి ఏ మంత్రములు గానం చేయటానికి ఉపయోగపడుతాయో వానిని సామము అనబడే ‘ *సామవేదం* ’ గాను, ఏ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులకు ఉపయోగపడుతాయో వానిని యజుస్సు అనబడే ‘ *యజుర్వేదం* ’ గాను, దైవిక మంత్రాలతో కూడి యున్న ఋక్కులను ‘ *ఋగ్వేదం* గాను వేదం మూడు భాగాలుగా విభజించారు. అందుకే ‘ *వేదత్రయీ ’ అన్నారు.
    తరువాత మంత్రవిద్య, యుద్ధవిద్య, రోగాలు, ఆత్మ అనే కొన్ని గుప్తమైన విషయములను వివరించి దానిని ‘ *అథర్వ* ’ వేదంగాను అందించారు.
    వేదం పరమాత్మ గురించి చెపుతుంది, వేదము పరమాత్మస్వరూపము. అటువంటి వేదమును ఇతరులు ఎవరూ విభజించలేరు కావున పరమాత్మే శ్రీ వ్యాసభగవానులుగా అవతరించి వేదవిభజన చేసి *ఋగ్వేదాన్ని శిష్యుడైన పైలునకు, యజుర్వేదాన్ని వైశంపాయనునకు, సామవేదాన్ని జైమినికి, అథర్వ వేదాన్ని సుమంతునకు* బోధిస్తే వారు తమ తమ శిష్యులకు బోధించటం జరిగింది. గురుశిష్య పరంపరగా అభ్యసింపబడుతున్న వేదజ్ఞానం వేలాది సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చింది.
    కర్మకాండ, జ్ఞానకాండ సమ్మేళనమైన వేదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానమంతా నిక్షిప్తమై ఉంది. మనిషి ఏ స్థితిలోనున్నా ఆ స్థాయి నుండి ఒక్కో మెట్టును ఎక్కిస్తూ తనను తాను దర్శించుకునే స్థాయికి చేరుస్తుంది వేద జ్ఞానం.
    సమస్త వేదశాస్త్రాలకు, ఇతిహాస పురాణాదులకు, యజ్ఞయాగాది క్రతువులన్నింటికీ వేదమే మూలమై ఉంది. అనంత జ్ఞానసాగరమైన వేద జ్ఞానాన్ని విభజించి అందించి, మానవ జీవితాలను క్రమబద్ధీకరించి, నిర్దిష్ట మార్గంలో నడుపుతూ అటు మత జీవితానికీ ఇటు అధ్యాత్మిక జీవితానికీ సమన్వయం చేస్తూ జ్ఞాన దృష్టి ఏర్పరచటానికి అవతరించిన పరమాత్మ స్వరూపులైన శ్రీ వేదవ్యాసులవారిని *‘ఓం వేద విభాజకాయ నమః’* అనే విశేషనామంతో కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకుంటూ వారి పాదపద్మములకు మరల, మరల నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @babyshaik6036
    @babyshaik6036 Рік тому +2

    ప్రతి దానిలో తండ్రి ప్రేమ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా శాంతి గా
    ఉంది తండ్రీ, ప్రేమ తత్వాన్ని పెంచుతూ ఉంది తండ్రీ కృతజ్ఞతలు గురుదేవా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +2

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    *🌸28. ఓం భాగవతామృత ప్రదాయ నమః*🌸
    భాగవతం అనగా పరమాత్మను గురించి, అతని సృష్టి, స్థితి, లయ, లీలావిలాసమును గూర్చి భగవద్భక్తుల కథలను గూర్చి తెలిపే గ్రంథం. భక్తులు భగవంతుని గురించి చేసిన ఉపాసనను, వారు భగవంతుని చేరిన మార్గమును భాగవతం వివరిస్తుంది. నవ విధ భక్తి మార్గమును భాగవతం తెలియచేస్తుంది.
    విశ్వ శ్రేయస్సు కోసం వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, మహాభారతం ఇలా సమస్త వాఙ్మయం అందించినా తరువాత కూడా మన తండ్రి శ్రీ వ్యాస దేవుల వారి హృదయం సంతుష్టం కాలేదు. అందువలన ఆయన సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుని తన అసంతృప్తికి కారణం ఏమిటా అని ఆలోచించసాగారు. ఆ సమయంలో శ్రీ వ్యాసులవారి వద్దకు త్రిలోకసంచారి, శాస్త్ర, పురాణ విశారదుడు అయిన నారద మహర్షి వచ్చారు. వ్యాసులవారి అసంతృప్తికి, విచారానికి కారణం తెలుసుకున్నారు. ఇలా చెప్పారు.
    పరమాత్మ యందు భక్తి లేని విజ్ఞానం ప్రకాశించదు, ఫలాపేక్ష లేని నిష్కామకర్మ అయినా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కాని, వాక్కు కాని, కర్మ కాని ఎంత గొప్పవైనా భక్తి లేనినాడు నిరర్థకాలే. కలియుగంలో మానవుడు వివేకహీనులై దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానం కలవారై, మందబుద్ధులై, అల్పాయుష్కులై, భోగలాసులై, సోమరులై, మోక్షాసక్తి లేనివారై సంచరిస్తుంటారు. అటువంటి అజ్ఞాలకు సైతం పరమాత్మపై భక్తిభావం పెంపొందే విధంగా ఆయన లీలా విశేషాలు తెలిపే భాగవతాన్ని రచించమని తెలిపారు.
    నీవు దైవాంశ సంభూతుడవు, వేదద్రష్టవు, సర్వభూత హితుడవు, భగవద్దర్శనం కలిగించ గల జ్ఞానయుతుడవు. నీవు భగవద్గుణ లీలా వైభవగాథతో కూడిన భక్తి కావ్యాన్ని రచించితే, నీ మనః క్లేశం మాయమవుతుంది. అటువంటి గ్రంథాన్ని చదివితే లోకులు అర్థకామాదుల యందున్న ఆసక్తిని తగ్గించుకొని, భగవద్భక్తిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తారు.
    మాయామోహితుడైన జీవుడు అన్నింటికి తానే కర్తను, భోక్తను అని అనర్థ భావన చేస్తాడని, ఈ భావాన్ని ఉపశమింప చెయ్యడానికి *‘భగవద్భక్తి’* మార్గం తప్ప మరొకటి ఏదీ లేదని శ్రీ వ్యాసదేవులవారు నిశ్చయించారు. ఈ కలియుగంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రాన చేతనే *పరమాత్మపై అచంచలమైన భక్తి* ఆవిర్భవిస్తుందో అటువంటి లోకకల్యాణకరమైన, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణులవారు రచించారు. హిందూమత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, వ్యక్తి ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన పురాణం భాగవతం. ఇది భగవంతుని కథలగానూ, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథలగానూ భక్తి యోగాన్ని చాటి చెప్పే గ్రంథం.
    భాగవతం 12 స్కంధాలుగా విభజించబడి భగవంతుని అవతార కార్యాల వర్ణనను, భక్తుల గాధలు, పెక్కు తత్త్వబోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని అవతారాలు, ముఖ్యంగా విష్ణువు యొక్క అవతారలీలలు సవివరంగా జనరంజకంగా వివరించబడ్డాయి.
    భాగవత మహా పురాణం అష్టాదశ పురాణాలలో ముఖ్యమైనది. ఇతిహాసాలయిన రామాయణ, మహాభారతముల సరసన చేర్చబడినది. రామాయణంలో జీవన విలువకు ప్రాధాన్యం, భారతంలో ఫలవంతమైన జీవనానికి ప్రాధాన్యం ఇవ్వగా భాగవతంలో పరమార్థానికి ప్రాధాన్యం ఇవ్వబడింది.
    ఈ గ్రంథాన్ని శ్రీ వ్యాసభగవానులువారు తన పుత్రుడు అయిన శుక మహర్షిచే చదివించారు. మరణ శాపం పొందినటువంటి పరీక్షన్మహారాజు అంత్యకాలమందు శుకమహర్షి ఆయనను కలిసినప్పుడు మనిషి అంతిమ లక్ష్యం ఏమిటన్న సందేహానికి ఏడు దినములు రాజుతో గడిపి శ్రీమద్భాగవతాది పురాణాలను సంవాదరూపంలో వివరించి మోక్షప్రాప్తి కలిగించాడట. దీనిని బట్టి ఈ పురాణంలోని ఆధ్యాత్మిక ఉన్నతి ఎంతటిదో అవగాహన చేసుకోవచ్చు.
    భక్త జనోద్ధరణే ధ్యేయంగా, భక్తి మార్గం ద్వారా ముక్తిని ఎలా పొందవచ్చునో తెలియచేసేటటువంటి భాగవతం అనెడి అమృతాన్ని లోకానికి అందించినటువంటి అమృత స్వరూపులైన మన తండ్రి శ్రీ వ్యాస పరమాత్మకు కృతజ్ఞతాంజలి ఘటించుకుంటూ *‘ఓం భాగవతామృత ప్రదాయ నమః’* అనే నామంతో స్మరిద్దాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @lakshminaga5551
    @lakshminaga5551 Рік тому +1

    ఓంశ్రీవేదవ్యాసాయనమః
    ఈదేహన్నికితండ్రిసేవకుడుగా
    తండ్రి సేవచేసుకోనేబాగ్యాన్ని
    ప్రసాదించినతండ్రికి
    వేలకొలది సార్లుకృతజ్ఞతలుతండ్రీకృతజ్ఞతలు
    కృతజ్ఞతలు అమ్మకృతజ్ఞతలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *10. ఓం యమునా ద్వీప సంజాతాయ నమః*🌸
    యమునా నది పరమ పావనమైనది. యమునను సూర్య పుత్రిక అని కూడా అంటారు. మరియు యమధర్మరాజు సహోదరి. ఈ నది జన్మస్థానం కాళింది పర్వత శ్రేణిలోని యమునోత్రి.
    పరమాత్మ అవతారమునకు స్థానమై పవిత్రతను చేకూర్చుకున్న పావన యమునా నది మన పురాణాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినది. ముఖ్యంగా ద్వాపర యుగంలో కృష్ణుని బాల్యమంతా ఈ నదీ మాత ఒడిలోనే గడపటం భాగవతంలో తెలుపబడింది. ఈ కలియుగంలో కూడా మహామేళాలు, కుంభమేళాలు, దైవసంబంధమైన కార్యాలెన్నో యమునా తీరాలో జరుపుకుంటున్నాము.
    పరమాత్మ పాదస్పర్శతో పునీతమైన పరమపావని యమునా నది. యమునా నది రెండు పాయులుగా చీలటంవలన మధ్యలో ఏర్పడిన ఇసుక తిన్నెను యమునా ద్వీపం అంటారు. ఆ ద్వీపం మధ్య, పరాశరమహర్షి అనుగ్రహం వలన, సత్యవతికి సద్యో గర్భాన వేదమయులు, అఖిల మునీంద్రాద్యులు, విజ్ఞాన సంపన్నులు, సాక్షాత్‌ పరమాత్మ స్వరూపులు అగు శ్రీ వేదవ్యాసులువారు అవతరించారు.
    అజ్ఞానంలో మునిగి ఉన్న సమస్త మానవాళి మేలు కోసం జ్ఞాన దీపాన్ని వెలిగించి, మనలోని దుఃఖం తొలగించదలచి, యమునా నది ద్వీపంలో అవతరించిన శ్రీ వ్యాస పరమాత్మకు భక్తిశ్రద్ధలతో *‘ఓం శ్రీ యమునా ద్వీప సంజాతాయ నమః’* అని నమస్కరించుకుందాము🙏.
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *11. ఓం కృష్ణద్వైపాయనాయ నమః*🌸
    కృష్ణ శబ్దానికి నల్లని వర్ణము అని అర్థం. ద్వీపమునందు అవతరించారు కనుక ‘ద్వైపాయనుడు’ అయ్యారు.
    పరాశర మహర్షి యమునా నదిని దాటుతున్న సమయంలో, ఆ క్షణాలలో నవగ్రహాల నడక ఒక అసాధారణమైన దైవంశసంభూతుడైన చిరంజీవి జననానికి అనుకూలంగా ఉందని తన తపోదృష్టితో పరాశరమహర్షి గ్రహించారు. అప్పుడు నావను నడుపుతున్న మత్స్యగంధిని చూసి తన తేజస్సుని ధరించి లోకకల్యాణ కారకులైన వ్యాసుని జన్మకు అర్హురాలని తన తపశ్శక్తితో గ్రహించి తన అభీష్టాన్ని ఆమెకు తెలిపారు.
    దాని వలన తాను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ఆమె వ్యక్త పరచిన సందేహానికి సమాధానంగా చిరంజీవికి జన్మనిచ్చాక ఆమె కన్యత్వానికి దోషం లేకుండా అనుగ్రహించారు.
    పరాశరమహర్షి గతంలో పరమాత్మ తన కుమారుడిగా జన్మించాలని తపస్సు చేసి కోరుకున్నారు.
    శ్రీ వ్యాసాదేవులవారి రూపంలో నారాయణడు జన్మతీసుకున్నారు. పరాశరులు వారు, సత్యవతులు నిమిత్థమాత్రులైయ్యారు.
    శ్రీ వ్యాసాదేవులవారు జన్మిస్తూనే లక్షలాది సూర్యులను మించిన కాంతితో ప్రకాశిస్తున్నారు. ఆయన ముఖవర్ఛస్సు జ్ఞాన కిరణముల కాంతితో శోభిస్తోంది.
    భగవంతుని స్వరూపమైన ఆ బిడ్డ గర్భదారణ లేకుండా సద్యోగర్భంగా పుట్టారు.పుట్టిన వెంటనే అయిదు
    సంవత్సరాలు వయసు కలిగి దండ కమండలము ధరించి తపస్సు చేసుకోవడనికి వెళ్లారు. వేదమయులై, సమగ్ర జ్ఞాన సంపన్నులై మానవాళిని అజ్ఞానాంధకారం నుండి బయట పడవేయటానికి జ్ఞాన జ్యోతిని వెలిగింపచేసి గురువులకు గురువై ఆదిగురువు అయినారు.
    యమునా ద్వీపమునందు కృష్ణ వర్ణంతో అవతరించిన శ్రీ వ్యాస దేవులవారు కృష్ణ ద్వైపాయన నామంతో పిలవబడ్డారు. ‘కృష్ణాయ క్లేశహారిణే’ అన్నారు. దుఃఖ స్పర్శ పోగొట్టి ఆనంద స్వరూపాన్ని పరిచయం చేయటానికే ఆయన అవతరించారు.
    కాబట్టి కృష్ణద్వైపాయనును నామంతో కేవలం మన కోసం అవతరించి బోధస్వరూపంగా ఉండి ముక్తి మార్గం వైపుకు అడుగు వేయిస్తున్న ఆ తండ్రిని హృదయ పూర్వకమైన భక్తితో, కృతజ్ఞతాభావంతో *‘ఓం కృష్ణ ద్వైపాయనాయ నమః’* అని నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *21. ఓం గంగాతీరచరాయ నమః* 🌸
    గంగ విష్ణు పాదములనుండి ఉద్భవించింది. భగీరథుడు తమ పూర్వీకుల యొక్క ఉత్తమలోక ప్రాప్తి కోసం తపస్సు చేసి గంగను భువికి తీసుకువచ్చాడు. హరి పాదములనుండి బయలుదేరి, శివుని జటాజూటం అలంకరించి, హిమాలయాలపై దిగి, భువికి జాలువారిన పరమపవిత్రమైన జీవనది గంగ. గంగానది మహిమను, ప్రాముఖ్యతను మహర్షులు సైతం పూర్తిగా వివరించలేరట. అటువంటి గంగానదీ తీర్థాలైన సోమతీర్ధం , వైకుంఠతీర్థం ప్రాంతంలో శ్రీ వ్యాసులవారు చాతుర్మాస్య దీక్ష చేసినట్లు, పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు చేసి శివ సాక్షాత్కారాన్ని పొందినట్లు శివ పురాణం ద్వారా తెలుస్తున్నది. శ్రీ వ్యాసదేవులవారు అవతరించింది గంగానదికి సహనది అయిన యమునాద్వీపంలో. బదరికాశ్రమాన్ని స్థాపించి తన శిష్యులతో అనేకానేక రచనావ్యాసంగాలను, ఆత్మబోధను, సాధనలను నేర్పింది. గంగానదికి ఉపనది అలకనంద వచ్చి కలిసే సరస్వతీ నదీతీరాన ఆయన బోధలు, రచనలు, సాధనలు అన్నీ గంగా తీరంలోనే. ఆయన ప్రతిరోజూ గంగానదిని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వ్యాసులవారు నేపాల్‌ దగ్గర నుండి గంగాతీరం వెంబడి పర్యటించినట్లు ఇంకా ప్రస్తుత దేశాలు, ఆనాడు కురు సామ్రాజ్యంలో భాగాలయిన పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వరకూ ఎప్పుడూ పర్యటిస్తూనే ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది. శూవ్యాసులవారు తన శిష్యులతో గంగాతీరాన అన్నపూర్ణ, కాశీవిశ్వేశ్వరుడు కొలువైన కాశీ పట్టణంలో ఉన్నట్లుగా కూడా చరిత్ర చెబుతోంది.
    ఆది శంకరాచార్యులవారు శ్రీ వ్యాసాదేవులవారిని కాశిలోనే గంగానదీతీరాన కలుసుకున్నప్పుడు శంకరాచార్యులవారిని ‘బ్రహ్మసూత్రాలకు’ భాష్యం వ్రాయవలసిందిగా బాధ్యత అప్పగించి ఆయన ఆయుష్షును కూడా పది సంవత్సరాలు పెంచినట్లుగా ఒక కథ చెపుతారు. ప్రపంచమంతా కూడా పుణ్యక్షేత్రంగా భావించే కాశికి సమీపంలోనే అదీ గంగానది తీరాన ప్రత్యేకంగా ‘ *వ్యాస కాశి’* ఉంది.
    పరమ పావన జల పూర్ణం, పరమ పవిత్రం, అత్యంత ప్రాచీనం అయినటువంటి గంగానది తీర ప్రాంతాలో సంచరించిన పరమాత్మ స్వరూపులైన శ్రీ వ్యాసదేవులవారు *‘ఓం గంగా తీర చరాయ నమః’* అనే పవిత్ర నామాన్ని భక్తిశ్రద్ధలతో, ఏకాగ్రతతో, నిబద్ధతతో ఆరాధించుకుంటూ నమస్కరించుకుందాము.🙏
    🙏జై గురుదేవా🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    *శ్రీ వేదవ్యాస*
    *అష్టోత్తరశతనామవాళి*
    *🌸1. ఓం శ్రీ వేదవ్యాసాయనమః🌸*
    వ్యాసం అంటే విస్తరించటం. *వేదాలను* విభజించి మరియు వ్యాప్తి గావించారు. కనుకనే కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసులుగా పిలవబడుతున్నారు.
    రాశులుగా పోసి ఉన్న వేదజ్ఞానాన్ని ఆపోసన పట్టి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అధర్వవేదము అని నాలుగుగా విభజించి మనకు అందించారు.
    మన మహర్షులు సత్యమేదో, ఆ భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయగా, పరమాత్మ వారికి శబ్దరూపంలో వినిపించారు. ఆ దివ్య శబ్దాలే *వేదాలు*. అందుకే వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. అంటే మానవులచే కూర్చబడినవి కావు అని అర్థం.
    ఒక మహర్షి విన్నది ఇంకొకరు వినలేదు. కానీ అన్నీ ఆ భగవంతునికే తెలుసు. ఆయన స్వరూపం తెలియచేయాలి అంటే ఆ భగవంతునికే సాధ్యం. అందుకే భగవంతుడే స్వయంగా వ్యాసులదేవులవారిగా అవతరించారు. మనపై అపారమైన కరుణతో మనలను సన్మార్గంలో నడిపించడం కోసం వేద, ఇతిహాస, పురాణ, వ్రత, పుజాది సర్వసంప్రదాయాలు, ధర్మనిర్ణయాలు అందించిన మన తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ
    *ఓం శ్రీ వేదవ్యాసాయ నమః* అని స్మరించుకుందాం🙏
    🙏జై గురుదేవ్🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    🌸 *14. ఓం పింగ జటాధరాయ నమః* 🌸
    పింగ అంటే గోరోజన వర్ణము, అంటే ఎరుపురంగు ముదిరిన రాగి వర్ణము అని చెప్పుకోవచ్చు. జట అంటే జడలు కట్టిన, అల్లుకు పోయిన కేశాలు అని అర్థం.
    సూర్యకాంతులు లోకాన్ని జాగృతపరచినట్లే, స్వయం జ్ఞానప్రకాశకులైన శ్రీ వ్యాస భగవానులు వారు తన జ్ఞాన కాంతులను అజ్ఞానంలో నున్న మానవాళిపై ప్రసరింపజేసి మేల్కొలిపి జ్ఞాన భిక్ష ప్రసాదించిన కరుణామూర్తి. ఆ తండ్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉందాము.
    అరుణ కాంతులతో కూడినట్టి జడలు కట్టిన కేశములతో ప్రకాశిస్తున్న అవతారమూర్తిని *‘ఓం పింగ జటా ధరాయ నమః’* అని కృతజ్ఞతతో స్మరించుకుంటూ నమస్కరించుకుందాము.🙏
    జై గురుదేవా🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +2

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    *అష్టోత్తర శతనామావళి*
    🌸2 *ఓం విష్ణుస్వరూపాయనమః*🌸
    విష్ణువు అంటే సర్వవ్యాపకత్వము. *వ్యాపక శీలవత్ విష్ణుః* - వ్యాపించే తత్వమే, విష్ణుతత్వం. తాను తప్పవేరేది లేకపోవటమే- లోపల, బయట, స్వరూపత తానై వుండటమే విష్ణుతత్వం.
    *ఓం వ్యాసాయ విష్ణురూపాయ*
    *వ్యాసరూపాయ విష్ణవే నమో*
    *వై బ్రహ్మనిధయే వాశిష్టాయ*
    *నమోనమః*
    శ్రీమహావిష్ణువుయొక్క 24 అవతారాలలో 17వ అవతారమే శ్రీవ్యాసభగవానుని అవతారం. అందుకే మనము *వ్యాసాయ విష్ణురూపాయ* అని స్మరించుకుంటున్నాము. వ్యాసభగవానుడే సర్వవ్యాపి, ఆనంతుడు.
    జనులను ఉద్ధరించటానికి, ధర్మమార్గంలో నడిపించి మోక్షపదాన్ని అందివ్వటానికి 1.సామాన్య ధర్మాలు, 2 విశిష్ట ధర్మాలు 3 మోక్షధర్మాలను తెలియచేశారు.
    అంతట నిండి ఉన్న పరమాత్మ తత్వాన్ని, అద్వైత జ్ఞానామృతాన్ని అందించటానికి ఉద్భవించిన విష్ణుఅవతారమే వ్యాసావతారం.
    అట్టి వ్యాసాదేవులవారికి శిరస్సు వంచి
    *ఓం విష్ణుస్వరూపాయనమః* అని హృదయపూర్వకముగా నమస్కరించుకుందాము.
    🙏 జై గురుదేవా🙏

  • @prasadpadmanabhuni9687
    @prasadpadmanabhuni9687 Рік тому +1

    ఈ సృష్టిలో ఉత్తమమైన మానవజన్మ ఇచ్చి, మనపై ప్రేమతో మనకు ఎన్నో విధాలుగా నిరంతరం సేవ చేస్తున్న భగవంతుడు, ఆలోచన విచక్షణ ఉన్న ఈ మనిషి నుంచి ఏమి కోరుకుంటన్నారు అని తెలియచేసిన గొప్ప సందేశము. మానవ జీవితం పొంది, భగవంతుని ప్రేమను గుర్తించామా, మనము ఆయనను ప్రేమిస్తున్నామా! మనకు దిశానిర్దేశం చేసారు. ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన సత్సంగం వినలేదు. ఈ సత్సంగం మనవరకు అందటం, వినటం అన్నది భగవంతుని అనుగ్రహంగా భావించాలి. Don't miss.

  • @nagamani5758
    @nagamani5758 Рік тому +1

    ఓం వ్యాసదేవాయ నమః.తండ్రీ ,దేవాధి దేవుడు అన్నీ ఇస్తున్నారు.ప్రతి క్షణం నా బాగులు చూస్తున్నారు.మరి నేను తండ్రికి ఏం ఇవ్వాలో,ఎలా నడవాలోవివరంగా చెప్పిన గురుదేవ కృతజ్ఞతలు.

  • @ramaraotatineni7400
    @ramaraotatineni7400 Рік тому +1

    దేవాదిదేవాఆదిదేవాకృతజ్ఞతలుతండ్రీకృతజ్ఞతలు

  • @rajarajeswari5741
    @rajarajeswari5741 Рік тому +1

    భగవంతుడు కోసం మనిషి ఉంనాడు ఎందుకు అంటే అయన కోసం మనిషి సృష్టి చు కొంనారు ప్రతి జివీ లో ఉండి ఆనందం చాలి అని తనను తాను తెలుసు కోవాలి అందుకని భగవంతుడు కోసం మనిషి

  • @sambasivaraopasupuleti8984
    @sambasivaraopasupuleti8984 Рік тому +2

    ఓం వ్యాస దేవాయ నమః
    ఓం శ్రీ గురుభ్యోనమః
    "ప్రేమ స్వరూపుడైన తండ్రి ని ప్రతి దాంట్లో గుర్తుంచి
    భేదభావం తొలగించు కో మంటున్నారు."
    అద్భుతమైన సాధన గురుదేవా!
    అమ్మకు, మీకు వేల కొలది కృతజ్ఞతలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajendraPrasad-bk2hu
    @RajendraPrasad-bk2hu Рік тому +1

    Adbhuthamaina bodha thandri
    Kruthagnathalu gurudeva kruthagnathalu

  • @tejagowdsimhadri4014
    @tejagowdsimhadri4014 Рік тому +2

    🙏🙏🙏

  • @punyavathiparimi1763
    @punyavathiparimi1763 Рік тому +1

    🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏
    🌸 *19. ఓం బదరికాశ్రమ స్థాపకాయ నమః*🌸
    భారతదేశంలో అత్యున్నతస్థాయి ఆధ్యాత్మిక కేంద్రం, జ్ఞాన సంపదతో పొంగిపొర్లే వాతావరణం హిమాలయాలలో శ్రీ వేదవ్యాసదేవులవారు స్థాపించిన బదరికాశ్రమానికి మాత్రమే దక్కుతుంది. బదరిక అంటే రేగుచెట్టు. ఆ వనంలోనే ఈ పవిత్రమైన ఆశ్రమం స్థాపించబడి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.
    చల్లని హిమాలయపర్వత శ్రేణుల్లో పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదుల తీరాలలో మంచి అనువైన ప్రదేశంలో ఈ మహత్తరమైన ఆశ్రమాన్ని స్థాపించారు. నాలుగు వేదాలను అధ్యయనం చేసిన ఆయన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు ఇంకా ఎంతోమంది జ్ఞానులు, స్థితప్రజ్ఞులు, సాధుపుంగవులు వేలాదిగా ఉండి నిరంతరం వేదపఠనం, పారాయణం, రచనలు, మున్నగు పవిత్ర కార్యక్రమాలు సాగించిన గొప్ప గురుకులం అది.
    హిమాలయాలోని పవిత్ర గంగా నదినుండి చీలిన అలకనంద నదిలో కలిసే సరస్వతీ నదికి పశ్చిమాన పవిత్ర సంగమప్రదేశ తీరాన ఈ పవిత్రమైన ఆశ్రమం స్థాపించబడినదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడే భగవాన్‌ శ్రీ వేదవ్యాసులవారు తన శిష్యులతో *వేద విభజన, బ్రహ్మసూత్రాలు,అష్టాదశ పురాణాలు, మహాభారతం, శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవతం* మొదలైన మానవాళికి ఉపయుక్తమైన ఆధ్యాత్మిక ప్రామాణికమైన గ్రంథాలను రచించి లోకానికి అందజేశారు. ఈ సమీపంలోని వ్యాస గుహలో విఘ్నేశ్వరుని లేఖకుడుగా శ్రీ వ్యాసదేవులవారు మహాభారత రచన గావించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.
    బదరికావనములో ఆశ్రమస్థాపనగావించి, తపస్సు చేసి, బాదరాయణుడిగా కీర్తింపబడిన శ్రీ వ్యాసదేవులవారికి *‘ఓం బదరికాశ్రమ స్థాపకాయ నమః’* అని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుందాము🙏
    🙏జై గురుదేవ్🙏

  • @venkatasrinivasaraoithinen8929

    🌹🙏🙏🙏🌹

  • @vanigolla1363
    @vanigolla1363 Рік тому +2

    ఓం వ్యాస దేవాయ నమః. కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏🙏

  • @sridevikar0417
    @sridevikar0417 Рік тому

    KruthagnathaluGurudevaKruthagnathaluAmma🙏🙏💐🫡

  • @venkateshwarlub5311
    @venkateshwarlub5311 Рік тому

    Om sri gurubyonamaha

  • @SrilakshmiBandarupalli
    @SrilakshmiBandarupalli Рік тому +1

    🙏🙏🙏🙏