చేర్యాల ప్రాంతాన్ని మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే : కాంగ్రెస్

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • చేర్యాల ప్రాంతానికి మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది
    బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు లేదు
    ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా పనిచేసిన నీవు డివిజన్ ఎందుకు తీసుకురాలే
    చేర్యాల : చేర్యాల ప్రాంతానికి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ కి కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ జేఏసీ నాయకులు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్మ ఆగం రెడ్డి, మండల అధ్యక్షులు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ విమర్శించారు. చేర్యాల మండల కేంద్రంలోని కొమ్మూరి నివాసంలో శుక్రవారం ఏర్పడి చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజుల్లో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచి ఈ ప్రాంత భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను ఏనాడు పట్టించుకోలేదని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి జేఏసీగా ఏర్పడి అనేక దీక్షలు, ధర్నాలు,రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి నాడు ప్రతిపక్షంలో నేడు అధికారపక్షంలో ఉండి కూడా తమ ప్రియతమ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి నాయకత్వంలో మంత్రులను ప్రభుత్వ అధికారులను కలుస్తూ కార్యక్రమాలతో పాటు లాబీయింగ్ చేస్తూ చేర్యాల ప్రాంత ముద్దుబిడ్డగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని గుర్తు చేశారు. దొంగ ఓట్లతో దొంగ చాటున గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పది ఏండ్లు అధికారంలో ఉండి డివిజన్ తీసుకురాలేక చేతగాక నేడు ప్రజల ఆదరణ పొందడానికి కల్లబొల్లి మాటలతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఓ రెండు పార్టీలతో కొత్త జేఏసీ ఏర్పాటు చేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మీ అన్యాయాలను, అక్రమాలు, మోసాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండ కడతామని ఈ సందర్భంగా తెలిపారు. 10 సంవత్సరాలు తమ జేఏసీ అలుపెరుగని పోరాటాలు చేసి చేర్యాల ప్రాంతంలో నెలకు అనేక సమస్యలతో పాటు రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా మీ స్వార్ధ రాజకీయాల కోసం నాడు చేర్యాల ప్రాంతాన్ని తాకట్టు పెట్టామని గులాబీ పార్టీ నాయకులు ప్రజల్లో ఒప్పుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఆడేపు చంద్రయ్య పాల లక్ష్మి నారాయణ మంచాల చిరంజీవులు చెవిటి లింగం ముస్త్యాల యాదగిరి వెలుగల దుర్గయ్య అంబాల రాములు గౌడ్ పోతుగంటి ప్రసాద్ చింతల మల్లేశం మిట్టపల్లి నర్సిరెడ్డి తాళ్ళపల్లి రమేష్ రంగు శంకర్ బందీగ రాకేష్ కర్క సంతోష్ రెడ్డి బైతి శ్రీనివాస్ మేడిచెల్మి రాకేష్ ఎండీ తాహెర్ ఎండీ జౌర్ అల్లం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •