కొత్తకోట లో పోలీసుల వృత్తి ధర్మంపై డీజీపీ వ్యాఖ్యలు | Prime9 Mahbubnagar

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024
  • పోలీసులకు కుటుంబ ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పది రాష్ట్ర విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డిజిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో చట్టాలు మారాల్సిన అవసరం ఉందని ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
    ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కు చెందిన దాదాపు 270మంది కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో క్యాడేట్ లు నిర్వహించిన గౌరవ వందనాన్ని జోనల్ డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తో కలసి ఆయన స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలలో పోలీస్ ఉద్యోగం చాలా గొప్పదని ప్రజలకు ప్రతేక్షంగా సేవలు అందించే వారు పోలీసులని అన్నారు. తొమ్మిది నెలల పాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థులు పాత చట్టాల తో పాటు కొత్త చట్టాలను సైతం నేర్చు కున్నారని విధుల్లో చేరిన తరువాత సంఘ విద్రోహుల పట్ల కర్కశంగా ఉంటూనే సామాన్య ప్రజల హక్కులను కాపాడాలని సూచించారు. ప్రజలకు కష్టాల సమయంలో గుర్తొచ్చేది పోలీసులేలని ఇంకా సమాజంలో పోలీసు ల పై గౌరవం ప్రేమ ఉందన్నారు. దేశ రక్షణ కోసం తమ పిల్లలని పోలీసు లుగా తయారు చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు తాను ఎస్పీ గా ఉన్నప్పుడు పడిన శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. చాలా క్రమశిక్షణతో ఈ తొమ్మిది నెలలు శిక్షణ తీసుకున్నారని రేపటి నుంచి తమకు కేటాయించిన పట్టణాల్లో, గ్రామాల్లో సమతవంతంగా విధులు నిర్వహించి సమాజంలో డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.
    | Subscribe |
    | Prime9 Mahbubnagar |

КОМЕНТАРІ •