Це відео не доступне.
Перепрошуємо.

బిర్యానీ మసాలా పొడి | వెజ్ బిర్యానీ | Biryani Masala Powder | Veg Biryani Recipe

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2020
  • బిర్యానీ మసాలా పొడి | వెజ్ బిర్యానీ | Biryani Masala Powder | Veg Biryani Recipe ‪@HomeCookingTelugu‬
    మనకి ఎప్పుడూ దమ్ బిర్యానీ చేయడం అన్నివేళలా కుదరదు. కానీ అంతే రుచికరంగా ఉండే బిర్యానీని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సులువుగా నిమిషాల్లో చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి.
    #vegbiryani #teluguvantalu #biryanimasalapodi #vantaluintelugu #tastyvantalu #biryanimasalapowder #masalapowderrecipe #homecooking #homecookingtelugu #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: • Biryani Masala Powder ...
    తయారుచేయడానికి: 25 నిమిషాలు
    వండటానికి: 40 నిమిషాలు
    వెజ్ బిర్యానీ సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    బిర్యానీ మసాలా పొడి:
    ధనియాలు - 4 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2sP7i1Z)
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    సోంపు గింజలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2u1p6rl)
    మిరియాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2RPGoRp)
    షాజీరా - 2 టేబుల్స్పూన్లు
    దాల్చిన చెక్క - 4 ముక్కలు (Buy: amzn.to/31893UW)
    నల్ల యాలకులు - 2 (Buy: amzn.to/2V4OXd6)
    పచ్చ యాలకులు - 12 (Buy: amzn.to/2U5Xxrn)
    అనాస పువ్వులు - 2 (Buy: amzn.to/37JQNnl)
    లవంగాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/36yD4ht)
    రాతి పువ్వు - 2 ముక్కలు (Buy: amzn.to/2V7wyMV)
    జాపత్రి - 2 ముక్కలు (Buy: amzn.to/2uLpr1n)
    జాజికాయ - చిన్న ముక్క
    బిర్యానీ ఆకులు - 2 (Buy: amzn.to/31cpSxL)
    ఎండుమిరపకాయలు - 3 (Buy: amzn.to/37DAVT1)
    వెజ్ బిర్యానీ:
    నెయ్యి - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2RBvKxw)
    నూనె - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2RGYvrw)
    ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
    దంచిన అల్లం వెల్లుల్లి - 1 టేబుల్స్పూన్
    టొమాటో - 1 (తరిగినది)
    క్యారెట్ - 1 (తరిగినది)
    తరిగిన బీన్స్
    బంగాళాదుంప - 1 (తరిగినది)
    పచ్చిబఠాణీలు
    పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    ఎండుకారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    బిర్యానీ మసాలా పొడి - 3 టీస్పూన్లు
    కొత్తిమీర
    పుదీనా ఆకులు
    బాస్మతి బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు) (Buy: amzn.to/2vywUkI)
    నీళ్లు - 2 కప్పులు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    తయారుచేసే విధానం:
    బిర్యానీ మసాలా పొడి:
    ముందుగా ఒక పాన్లో ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, పచ్చ యాలకులు, అనాస పువ్వులు, లవంగాలు, రాతి పువ్వు ముక్కలు, జాపత్రి ముక్కలు, జాజికాయ, బిర్యాని ఆకులు వేసి కొన్ని నిమిషాలు వేయించిన తరువాత ఎండుమిరపకాయలు కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి
    వీటిని చల్లార్చిన తరువాత, మిక్సీలో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి
    అంతే, బిర్యానీ మసాలా పొడి తయారైనట్టే, దీన్ని ఎయిర్-టైట్ డబ్బాలో వేసి దాచిపెడితే చాలా రోజులవరకూ నిలవుంటుంది
    వెజ్ బిర్యానీ:
    ఒక ప్రెషర్ కుక్కరులో నెయ్యి, నూనె వేసి, అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
    ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, దంచుకున్న అల్లం వెల్లుల్లి, టొమాటో, క్యారెట్, బీన్స్, బంగాళాదుంప, పచ్చిబఠాణీలు వేసి వేయించాలి
    ఇందులో పసుపు, ఎండుకారం, ఉప్పు, బిర్యానీ మసాలా పొడి వేసి కలపాలి
    ఆ తరువాత కొత్తిమీర, పుదీనా ఆకులు, బాసుమతి బియ్యం, నీళ్లు పోసి బాగా కలిపి, కుక్కరుకి మూత పెట్టాలి
    ఆవిరి రావడం మొదలైన తరువాత కుక్కరుకి విజిల్ పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, కుక్కరుకి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ బిర్యానీని ఉడికించాలి
    ఆవిరి తగ్గిన తరువాత వేడివేడి బిర్యానీని రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 33