ప్రజలందరి దృష్టి జాతీయ పార్టీ జై భారత్‌ నేషనల్ పార్టీ వైపే - మన్నవ రఘురామ్‌ వెల్లడి

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2024
  • - జనసేన ఓట్లన్ని జై భారత్‌ నేషనల్ పార్టీ కే
    - ఎన్నికల్లో సంచలానాలకు కేంద్రంగా రాజమండ్రి
    - అధికార, ప్రతిపక్ష ల పై అసంతృప్తి జై భారత్‌ నేషనల్ పార్టీ కు అనుకూలం
    - ప్రజలందరి దృష్టి జాతీయ పార్టీ జై భారత్‌ నేషనల్ పార్టీ వైపే - మన్నవ రఘురామ్‌ వెల్లడి
    మే 13న జరిగే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌లో జై భారత్‌ నేషనల్ పార్టీ విజయం తధ్యం అని, రాజమండ్రి రూరల్‌ జనసేన ఓట్లన్నీ జై భారత్‌ నేషనల్ పార్టీ కే అని మన్నవ రఘురాం పత్రికా ప్రకటనలో తెలిపారు. జనసేనలో ఉన్న యువత, విద్యావంతులు ఈరోజు ఆలోచనలో పడ్డారని, ఐదు సంవత్సరాల పాటు కష్టపడ్డ వాళ్ళ నాయకుడు కందులు దుర్గేష్‌ని కాదని బుచ్చయ్య చౌదరికి టికెట్‌ ఇవ్వడం పట్ల నిరాశ నిస్పృహలతో ఉన్నారని అన్నారు. మోసపూరిత రాజకీయాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని వాళ్లు నిర్ణయించుకున్నారని, వారి చూపుంత జై భారత్‌ నేషనల్‌ పార్టీ వైపు ఉందని అన్నారు. ప్రజల్లో జైభారత్‌ పార్టీ పట్ల విశ్వనీయత పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల వల్ల తమకు కలిగింది ఏమీ లేదని రాజమండ్రి యువత ప్రజలు గుర్తించారని ఖచ్చితంగా తమకు అనుకూలమైన జైభారత్‌ నేషనల్‌ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ అయిన వై.సి.పి ప్రభుత్వంలో తమకు ఉపాధి కరువైందంటూ యువత తాము ప్రచారం చేస్తున్న సందర్భంలో వాపోయారని, ఈ ఎన్నికల్లో జై భారత్‌ పార్టీకి ఓట్లేసి గెలిపించుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాది పొందుతామని నిరుద్యోగ యువత ఆశతో ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ గుర్తయిన టార్చ్‌ లైట్‌ సింబల్‌ కేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఈసారి రాజమండ్రి రూరల్‌ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందని కచ్చితంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ గెలుస్తుందన మన్నవ రఘురాం గారు తెలియజేశారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జై భారత్‌ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

КОМЕНТАРІ •