Shirdi Sai Parthi Sai Divya Katha Episode- 43, Anjali Devi

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 1

  • @satyabhamag1068
    @satyabhamag1068 3 роки тому +1

    🌸షిరిడీ సాయి-పర్తి సాయి🌸
    🌸Part--43
    🌸భజన,నామ స్మరణ ద్వారా మానవతా విలువలు బోధించుట.🌸
    🌸1)సత్యం ప్రజలను ఏవిధంగా ఆధ్యాత్మికత వైపు తిప్పారు?
    A)తన అవతార లక్ష్యం లో భాగంగా..ముందు భజనలు ద్వారా భక్తిని బోధించి తరువాత నెమ్మది నెమ్మదిగా సేవ చేయడం నేర్పించారు.
    సేవ అనేది కర్మ మార్గం.
    సత్కర్మలు చేస్తూ ఉంటేనే మనసు శుద్ధి అవుతుంది.
    మనసు శుద్ధి అవుతేనే ఆత్మ వైపు తిరగ గలదు.
    మనసు శుద్ధి అవుతేనే ప్రేమ అనేది తెలిస్తుంది.అందుకే స్వామి.Love All, Serve all అని బోధించారు.
    (ఇది అంతా వీడియో లో లేదు,కేవలం పిల్లలకు తెలియ చేయడానికి.)
    🌸2)భక్తులు పెరిగిపోవడవలన సుబ్బమ్మ గారు ఈశ్వరమ్మ గారికి ఇచ్చిన సలహా ఏమిటి?
    A)ఈశ్వరమ్మా,మీఇల్లు చాలక పోవడం వలన మా ఇంటికి మార్చాము.. ఇపుడు ఇది కూడా సరిపోవడం లేదు.చిత్రావతి దగ్గర్లో నా భూమి కొంత ఇస్తాను.
    సత్యం మామూలు బిడ్డ కాదు .
    యుగపురుషుని కన్న ..తల్లివి నువ్వు.సత్యం దైవం.
    🌸3)స్వామి దుష్ట సంకల్పములకు,సత్సంకల్పములకు తేడా ఏమిటని తెలియ చేసెను?
    A)దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును.
    సత్య సంకల్పముల చేత సాధువగును.
    సకల సంకల్ప రహితుడే శాంతినొందు
    ఉన్నమాట తెలుపు చున్నమాట.
    🌸4)కోరికలను ఎలా తీసుకోవాలని చెప్పారు స్వామి?
    A)అనేక దారముల చేరికయే వస్త్రం.
    ఒక్కొక్క దారమును తీసివేస్తే..వస్త్రం ఉండదు.
    అదే విధంగా ఒకొక్క సంకల్పాన్ని తీసి వేస్తే మనస్సే ఉండదు.
    కోరికలను అదుపులో పెట్టుకున్నపుడే మనిషిలో మానవతా విలువలు అభివృద్ధి చెందుతాయి.
    మానవతా విలువలు లేనివాడు మానవుడే కాదు.
    🌸5)సత్య,ధర్మ,శాంతి,ప్రేమల గురించి సత్యం ఏమని వివరించారు?
    A)సత్యమును అనుసరించక పోతే తలను కోల్పోయినట్టే,
    ధర్మమును ఆచరించక పోతే భుజములు పోయినట్టే,
    శాంతి లేకపోతే ఉదరం లేనట్టే,
    ఈ మూడింటికి ప్రేమయే ఆధారం,
    ప్రేమ తో కూడిన పలుకే సత్యం,
    ప్రేమతో కూడిన ఆచరణే ధర్మం,
    మనసులో ప్రేమ ఉంటే అదే శాంతం.
    🌸6)కరణం సుబ్బమ్మ గారి గురించి ప్రజలు ఏమని భావించారు?
    A)సుబ్బమ్మ గారికి స్వామి అంటే విపరీతమైన భక్తి.
    ఆ భక్తి వల్లనే ఆవిడలో త్యాగ గుణం,ధర్మ గుణం ఉన్నాయి.
    ఆ త్యాగ గుణం ఉండబట్టే ఇంత మంచి కార్యం చేయ గలుగుతున్నారు. స్వామివారికి తన సొంత భూమిని ఇస్తున్నారు.
    🌸7)ఇంకా ఏమని భావిస్తున్నారు?
    A)బాల స్వామి కి జన్మనిచ్చి ఈశ్వరమ్మగారు ధన్యులు అయ్యారు.
    ఈపుట్టపర్తి గ్రామంలో పుట్టడం
    ఈ గ్రామ ప్రజల సుకృతం.👏
    జై సాయిరాం.👏