June 13, 2024

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • అందరినీ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తాం
    - కిమ్స్ సహకారంతో హాస్టల్ బాత్ రూమ్స్ కి హంగులు
    - ఆరోగ్య రాజమండ్రిపై దృష్టి పెడతాం
    - ప్రతివార్డులో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పనుల పరిశీలన
    - హాస్టల్స్ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు
    రాజమహేంద్రవరం, జూన్ 13:
    బిసి, ఎస్సీ హాస్టల్స్ లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి కిమ్స్ యాజమాన్యంతో చర్చించి హాస్టల్ బాత్ రూమ్స్ బాగుచేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాసు చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి పనులు, నగరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన తాను హాస్టల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి హాస్టల్స్ సందర్శించినట్లు చెప్పారు . వైజంక్షన్ హాస్టల్ ని అనంతరం గణేష్ చౌక్ లోని హాస్టల్ ని కూడా గురువారం ఉదయం ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైజంక్షన్ హాస్టల్ ని తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీ గా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని చెప్పారు. అయితే ఇక్కడ బాత్ రూమ్స్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన ఐదేళ్లలో బిసి వర్గానికి చెందిన మార్గాని భరత్ రామ్ ఎంపీ గా ఉండికూడా కనీసం పట్టించుకోలేదని, అలాగే బిసి మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడి పరిస్థితులపై శ్రద్ధ వహించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫలితంగా ఇక్కడి బిసి బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారని అందుకే ఒక బిసి బిడ్డగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటీకీ అభివృద్ధి పనులు చేపట్టడానికి సమయం పడుతుందని భావించి, ఇప్పటికే పేద ప్రజలకు వైద్య సేవల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న కిమ్స్ యాజమాన్యాన్ని సంప్రదించి, సహకరించాలని కోరానని చెప్పారు. కోరిందే తడవుగా ఇక్కడ ఉన్న 30బాత్ రూమ్స్ ని బాగుచేయించి టైల్స్ వేసి, నీటి సరఫరాకు పైప్ లైన్ కూడా వేయించడానికి ముందుకొచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అదేవిధంగా గణేష్ చౌక్ లోని హాస్టల్ లో కూడా 16బాత్ రూమ్స్ బాగుచేయిస్తున్నారని, మొత్తం రెండు చోట్లా 46బాత్ రూమ్స్ కిమ్స్ యాజమాన్యం బాగుచేయిస్తోందని అన్నారు. కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను, వ్యాపార వేత్తలను భాగస్వామ్యం చేస్తామని ఆయన చెప్పారు.
    స్పోర్ట్స్ కాంప్లెక్స్, రివర్ ఫ్రెంట్ , ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, గోదావరి ఘాట్ ల పరిశుభ్రత వంటి విషయాలపై ఐదేళ్ల ప్రణాళిక తయారు చేయాలనే దానిపై నగరపాలక సంస్థ కమిషనర్ తో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి తరపున ఎన్నికల్లో ఆరోగ్య రాజమండ్రి గురించి ఇచ్చిన హామీలో భాగంగా వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజి వ్యవస్థపై దృష్టి పెడతామన్నారు. డీసిల్ట్, మేజర్ డ్రైన్స్ లో సిల్ట్ తీసే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచిస్తామన్నారు. అలాగే వాంబే గృహాలను ఒక క్లస్టర్ గా తీసుకుని ఎం హెచ్ ఓ తో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య రాజమండ్రి అంశంపై శుక్రవారం సమీక్షిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు చెప్పారు. అలాగే శుక్రవారం నుంచి ప్రతి వార్డులో తమ పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు ప్రతి రోజూ ఉదయం ఆరుగంటలకే వార్డుల్లో తిరుగుతూ శానిటరీ ఇనస్పెక్టర్లు, పారిశుధ్య కార్మికులతో తిరిగి పనులు సక్రమంగా చేసే విధంగా చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు చెప్పారు. 72వేల మెజార్టీ ఇచ్చిన బాధ్యతతో చాలా కార్యక్రమాలు చేపడతామని అయన ప్రకటించారు. మరోసారి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కూటమికి అనుకూలంగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, అందుకు అనుగుణంగా చాలా పనులు చేయాల్సి ఉందని, ఇలాంటి సమయంలో వైసిపి వారిపై దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా బాలుర బీసీ వసతి గృహం ఎదురుగా చేపట్టిన హాస్పిటల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఇంచార్జ్ లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

КОМЕНТАРІ •