వినాయక నిమజ్జనం వేలంపాటలో గణేష్ లడ్డూ ను దక్కించుకున్న ముస్లిం యువకుడు

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరెళ్ళ గ్రామంలోని గల్లి డాన్స్ యూత్ ఆధ్వర్యం లో పూజలు అందుకున్న బొజ్జ గణేషుడి ప్రసాదాన్ని మొహమ్మద్ మొయిస్ అనే ముస్లిం యువకుడు హిందూ యువకులతో పోటీగా వేలం పాటలో పాల్గొని గణేష్ ప్రసాదాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మొయిస్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి తను తన స్నేహితులు కలిసి గణేష్ లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకుంటున్నము అని కుల మతాలకు అతీతంగా మేము వేలంపాటలో పాల్గొనడమే కాకుండా ప్రతి రోజూ పూజలో పల్గొంటున్నము అని అన్నాడు. ఊరెళ్ళ గ్రామం లో గత అయిదు సంవత్సరాలు సర్పంచ్ గా పని చేసిన మొహమ్మద్ జహంగీర్ కూడా ముస్లిం కమ్యూనిటీ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ తను కూడా ప్రతి హిందువుల పండగ దగ్గర ఉండి మరీ జరిపించేవారు అని గ్రామ ప్రజలు తెలిపారు. ఊరెళ్ల బీఆర్ఎస్ యువ నాయకులు మొహమ్మద్ ఆసిఫ్ కూడా గ్రామం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం తో పాటు ప్రతి రోజూ వినాయక పూజలో పాల్గొని గ్రామ ప్రజల నుండి ప్రశంశలు పొందుతున్నారు. మాకు ఎలాంటి కుల మత బేధాలు లేవు అని మేము చిన్నప్పటినుండి అందరం కలిసే ఉంటున్నాము మా పండగలకు హిందువులను పిలుస్తాము హిందువుల పండగలను మేము వెళ్తాము మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు అని వాళ్ళు చెప్పడం నిజంగా సంతోషకరం.

КОМЕНТАРІ • 7