Sai Gurukulam Episode1377 //శ్రీ సాయిబాబా సమాధి అనంతరం భక్తులకు ఇచ్చిన అనుభవాలు

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024
  • Sai Gurukulam Episode1377 //శ్రీ సాయిబాబా సమాధి అనంతరం భక్తులకు ఇచ్చిన అనుభవాలు // శ్రీ సాయిబాబా సమాధి అనంతరం భక్తులకు ఇచ్చిన అనుభవాలు.
    బాబాను ధ్యానించు టెట్లు? భగవంతుని నైజముగాని, స్వరూపమునుగాని అగాధములు. వేదములుగాని వెయ్యి నాలుకలు గల ఆది శేషుడుగాని వానిని పూర్తిగ వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని, యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికికూడ అనుకూలించును.
    నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో అ సందుద్వారా చూచునపుడు దూరముగానున్న చంద్రుని యాకారమొకగీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది! వారు కాళ్ళను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు యెడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకీ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. “నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము.”

КОМЕНТАРІ • 25