#వెలగపండురోటిపచ్చడి

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2021

КОМЕНТАРІ • 715

  • @a...k.16127
    @a...k.16127 2 роки тому +259

    గచ్చు నేల, కుంపటి పొయ్యి, కడిగి ముగ్గులు వేసిన వాకిలి, రుబ్బురోలు, వినసొంపుగా వివరించి చెప్పే విధానం 🙏👌... చాలా బావుంది అండి... సంప్రదాయమైన కమ్మని గుభాళింపు రుచులు 😋😋...

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Рік тому +21

    మిమ్మల్ని చూస్తే చాలా గౌరవనీయులు గా అనిపిస్తుంది. చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది
    వంటినిండా వీపూది చారలు నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు. సాంప్రదాయ పద్ధతిలో పంచికట్టు
    కుంపటి, రోలు వాడటం. మంచి తెలుగు పదాలు
    వాహ్ వాహ్ మీరు చాలా ప్రత్యేకం
    మా చిన్నప్పుడు వంటలన్నీ చక్కగా వివరిస్తున్నారు
    నమస్కారం

  • @21padmaja
    @21padmaja 10 місяців тому +41

    స్వామి గారు మీరు చేసే విధానమే ఎంతో traditional గా ఉంటుంది..🙏 నేల పైన ముగ్గు, రోలు అవన్నీ చూస్తుంటే ఎంత బావుందో...

  • @rajithadevabhaktuni7753
    @rajithadevabhaktuni7753 2 роки тому +73

    చాలా చక్కటి వంటకాలను అతి అద్భుతంగా ఈతరం వారికి పరిచయం చేస్తున్న మీకు మా ధన్యవాదాలు. అలానే రాబోవు తరాలవారికి మీ వంటకాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

  • @chandrarekha7233
    @chandrarekha7233 Рік тому +38

    సంప్రదాయబద్ధమైన ఘుమఘుమలాడే వంటకాలు, వంట పద్ధతులు ఈ తరం వారికి తెలియజేయడంతో పాటు చక్కని శుభ్రమైన కట్టు, బొట్టు, నీట్ గా ముగ్గులతో పరిసరాలు, ఆ కుంపటి, రోలు, మూకుడు, మీరు వంటతో పాటు మంచి విషయాలను చెప్పే విధానం ఇవన్నీ భలే ఉంటాయి....చూస్తుంటే *ఆహా ఏమి రుచి తినరా మైమరచి* అన్నట్లుంటుంది గురువు గారు...శుభమస్తు🙏🙏

  • @pavaninambu6806
    @pavaninambu6806 Рік тому +12

    మీ వీడియోలు ఉత్తమమైన ప్రమాణాలు చూపిస్తున్నాయి. మీ వివరణలో ప్రేమ ,శ్రద్ద ఉంది. ప్రతి వస్తువుకు పసుపు కుంకుమ ఉండటం పవిత్ర భావన కగిస్తుంది. మీరు చెప్తే ఇక సందేలు రానే రావు. మీకు కృతజ్తతలు,నమస్సులు.

  • @kalyanisatyamohan
    @kalyanisatyamohan Рік тому +52

    మీరు పచ్చడి చేస్తున్నంత సేపు మాకు నోట్ల నిరుఉరుతుంది కాని అదేవిధంగ మీరు మాట్లాడే పద్దతి చక్కటి బ్రహ్మణ సంప్రదాయము , ఒక 50 సంవత్సరాల కిందట మన పెద్ద వారు వివరించిన విధముగా ఉంది ఇంత చక్కటి రోటి పచ్చడ
    చేసి చుపించి నందుకు ధన్యవాదములు🙏🏿🙏🏿🙏🏿

  • @satyaprasad5908
    @satyaprasad5908 2 роки тому +39

    మీరు చేసే వంటలు,పద్ధతి అద్భుతం
    70, 80స్ ల లో ఇవి అన్ని మేము చేసుకునే వాళ్ళం
    ఇప్పుడు చూసి సంతోషిస్తున్నాం

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 9 місяців тому +2

    ఇంత అచ్చమైన తెలుగులో చాలా చక్కగా చెప్తారు . వంటలు కూడా మేము చేస్తే బాగుంటాయి

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 2 роки тому +4

    ఎంతో శ్రద్ధగా అందరికీ ఉపయుక్తమైన వంటలను (పచ్చళ్ళు, కాయగూరలు)నేటి ఆధునిక సమాజానికి స్వామి వారు అందిస్తున్న తీరుకు వేనవేల వందనాలు. పిజ్జా, బర్గర్ల అనారోగ్య కాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే శాకాహార రుచులు అందరికీ పంచడం ఆనందంగా ఉంది. పదార్ధాలను వండే సమయంలో గురువు గారి వర్ణన మరింత ఆకట్టుకుంటోంది. మర్యాద, ఎదుట వారిని గౌరవించడం ఆయనను చూసి నేర్చుకునేలా ఉంది. పొగడ్త కాదు...నిండు మనస్సులో నుంచి వచ్చినది. చివరగా ...ఒక్క మాట. వెలగపండు పచ్చడేమిటి....వారి నోటి వెంట వచ్చే ప్రతీదీ అమృతప్రాయమే. స్వామి వారికి నమస్సుమాంజలి.

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081 10 місяців тому +7

    సంప్రదాయ పద్ధతిలో సూపర్ గా చేస్తున్నారు

  • @kothapallivaralakshmi3677
    @kothapallivaralakshmi3677 Рік тому +21

    మీరు చేసిన పచ్చడి చూస్తుంటే నోరు ఊరి పోతుంది.. తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు వెనక్కి పచ్చడి అంటే చాలా ఇష్టం చాలా బాగా చేశారు

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 Рік тому +15

    పచ్చడి తయారీ విధానం రోలుగురించి అందరికీ తెలియని విషయాలు చాలా వివరించారు ధన్యవాదాలు స్వామీ🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 роки тому +14

    మీకు ఎంత ఓపిక స్వామీ . మాకే ఆశ్చర్యం వేస్తుంది. అదీ కుంపటి మీద. చాలా చాలా చక్కగా వివరించారు thank you స్వామీ. మేము ప్రయత్నిస్తాము

  • @DailySaiVlogs
    @DailySaiVlogs 9 місяців тому +4

    స్వామి గారు మీరు మాట్లాడే తెలుగు చాలా వండర్ఫుల్ అండి మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంది స్వామి గారు థాంక్యూ స్వామి గారు..

  • @srivallidevi4308
    @srivallidevi4308 10 місяців тому +6

    వెలక్కాయి పచ్చడి మీరు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా అమ్మగారు వెలక్కాయ కాల్చి కూడా పచ్చడి చేసే వారు. అలాగే బెల్లం కలిపి, కలపకుండా కూడా చేసేవారు. ఇంకా కొబ్బరికాయ, వెలక్కాయ కూడాను. అంతే కాదండీ, పండిన గుజ్జును మేము అలాగే వట్టి నోటితోనే తినేసే వాళ్ళం😊

  • @tomrperfect143
    @tomrperfect143 2 роки тому +11

    అయ్యా! పళని స్వామిగారూ! మీరు పెడుతున్న పోపు ఘాటు మా విజయనగరం లో ఉన్నా మా ఇంట్లోకి వస్తూన్నాది. అభినందనలు

    • @zajz001
      @zajz001 11 місяців тому +1

      పళని స్వామి గారికి నమస్కారం. అద్భుతమైన వంటకం చూపించారు. నోరు ఊరి పోతోంది... ధన్య వాదాలు.

  • @vradha1728
    @vradha1728 Рік тому +16

    చక్కటి పచ్చడి తయారీతోపాటు శుచిగా మడిగా చేస్తూ సనాతన సాంప్రదాయం గురించి కూడా వివరిస్తూ చక్కగా చేశారు🙏

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 2 роки тому +26

    అంత పచ్చడి అవుతోందని అనుకోలేదు . చాలా బాగుంది. మేము కేవలము పండిన వెలగ పండు గుజ్జులో బెల్లం కలుపుకొని తింటాము ఈ సారి ఇలా చేసి చూస్తా ము హరేకృష్ణ👌🙏

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 2 роки тому

      నమస్తే బాబాయ్ గారు తమరు వెలగ పండుతో రొటీ పచ్చడి చేసే పద్దతి అందరికి అర్ధం అయ్యే విదంగా చక్కటి వ్యాఖ్యలు మాట్లాడుతూ పూర్వ రొటీ పచ్చడి చేసే విధానం చాలా బాగుంది ఇంకా ఏమైనా పూర్వకాలములో మన పెద్దోళ్ళు చేసు కోనే రోటీ పచ్చడులు గురుండి తెలియ జేయండి.

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 Рік тому +1

      మీ వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామి

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 10 місяців тому +7

    మీరు చేసిన విధానం చిన్నపుడు మా అమ్మమ్మ గారిని గుర్తు తెచ్చింది ధన్యవాదాలు

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +35

    నమస్తే బాబాయి గారు 🙏
    వెలగపండు పచ్చడి చాలా బాగా
    చేసి చూపించారు అద్భుతః 👌🙏

    • @venkatkumar4083
      @venkatkumar4083 2 роки тому +2

      Very nice getting water from my mouth

    • @jagguzoo7715
      @jagguzoo7715 6 місяців тому

      Nice Andi అద్భుతః

  • @saisurajramkumar4876
    @saisurajramkumar4876 9 місяців тому +1

    మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ పచ్చడి రోటిలో ఇలాగే చేసేవారు...కానీ ఇప్పుడు కుదరక మిక్సీలో చేసుకుంటున్నాము.,మీరు చెప్పినట్టుగా ఏమి రుచిగా ఉంటుందని..చెప్పలేము...మీరు చేసే, చెప్పే విధానాలు చాలా బాగుంటాయి..

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 10 місяців тому

    మీరు చానల్ పెట్టడం చాల మందికి upayogkaranaga ఉంది గురువు గారు . ఈ వయస్సు లో మీరు మాకు వంటలు చేసి చూడడ 0 మా అదృష్టం గా భావిస్తున్నాం . ఇంకా మీరు మంచి మంచి వంటలు తయారి చేసి మాకంది చగలరని మనవి

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi2244 2 роки тому +21

    🙏మా అమ్మ కూడా ఇలా నే చేస్తుంది చాలా బాగుంతుంది .thank you so much 🙏😋

  • @subramanyarajupenmetsa5442
    @subramanyarajupenmetsa5442 9 місяців тому

    మంచి ఆరోగ్యం అందించే మధురాతిి మధురమైన వెలగపండు పచ్చడి తయారు చేసే విధానమును నోరూరించే విధము గా విపులంగా వివరించి నందులకు ధన్యవాదములు. ఇది చూసి మా శ్రీమతి గారు నాకు ఈ మధురానుభూతిని కలిగించి నందులకు మీకు నమస్కారములు

  • @user-bx2ju9kg3b
    @user-bx2ju9kg3b 5 місяців тому +1

    మా అమ్మమ్మ గా వంట గుర్తొస్తోంది . మా అమ్మమ్మ గారు పోపులువేసి ఇస్తే మేము పోటీ పడి రుబ్బేవాళ్ళము. చాలా బావుంది స్వామి ధన్యవాదాలు🙏

  • @rallabhandisivaprasad8191
    @rallabhandisivaprasad8191 Рік тому +5

    చాలా బాగుంది స్వామి జీ. ఇలాంటి రోటి పచ్చళ్లు, అరుదు. మంచి రుచిగా వుంటుంది.
    అందరూ మిక్సీ లలో చెసుస్తున్నారు.👌👌👌🙏🏻

  • @ramakodimyala9988
    @ramakodimyala9988 Рік тому +12

    చాలా బాగుంది. పాత విధానం పాటిస్తూ మీరు స్వయంగా రోటిలో దంచి తయారు చేయడం అనేది మీకు ఎంత ఓపిక ఉన్నదో అర్ధం అవుతుంది. గురువు గారు 🎉🎉🎉🎉

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Рік тому +4

    బాబాయ్ గారు మీ వంటలు చూస్తూఉంటే పూర్వీకుల వంటలు కళ్ల ముందు కనబడుతున్నాయి.నాకు నోరురిపోతోంది 🙏

  • @jaggumark9651
    @jaggumark9651 Рік тому +2

    స్వామీ వందనములు మా తరం పుణ్యం చేసికొన్న తరం మీలాంటి మహానుభావులు ద్వారా వంటలే కాక మంచి విషయాలు నేర్చుకొంటున్నాము నమస్తే

  • @rajeshwarraovemula5140
    @rajeshwarraovemula5140 2 роки тому +4

    పలని స్వామి గారు మీ వంటలు అద్బుతం మర్చిపోతున్న వంటలన్నితిరిగి గుర్తుచేస్తున్నారు మీ స్వచ్చమైన తెలుగు భాష మనసుకు ఎంతో హాయిగా ఉంది

  • @sirigirivenkateshvenkatesh8639
    @sirigirivenkateshvenkatesh8639 2 роки тому +12

    🙏నమస్కారం అండి మీరు చేస్తున్న వంటలు చాలా బాగున్నాయి., మీరు చెప్పే చిదనము బాగుంది సంతోషం. మన పూర్వికులు చెప్పిన పద్ధతులు నేటి సమాజానికి చాలా అవసరము. 🍉🙏...

  • @g.k.dathatreyulu8544
    @g.k.dathatreyulu8544 2 роки тому +20

    చాలా బాగుందండి. ఇదే వెలగపండుని కాల్చి కూడా చేస్తే సువాసన తో ఇంకా మధురం గా ఉంటుంది.

  • @saradadevinishtala8312
    @saradadevinishtala8312 10 місяців тому +2

    గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు వెలగపండు పచ్చడి మా మామ్మ గారు చేసేవారు పచ్చడి చాలా బాగా చేశారు

  • @yashodabhuma9231
    @yashodabhuma9231 9 місяців тому +1

    Wow babai garu choostunte thineyani pisthu undi TQ for giving this recipe 👌👌🙏🙏

  • @lathasree1987
    @lathasree1987 Рік тому +6

    ఈ age లో కూడా ఓపికగా ఓర్పు గా సుచి శుభ్రత కు నిజంగా Great జోహార్ uncle 🙏🙏 nice super 👌👌

  • @PSiva-wz1hr
    @PSiva-wz1hr Рік тому +1

    గురువుగారు మీ సంభాషణ బహుమనీయంగా ఉంది మీ వివరణ అద్భుతంగా ఉంది మేము ఫేస్బుక్ లో కూడా ఫాలో అవుతున్నాము ఇంత చక్కగా వివరిస్తున్నందుకు తెలియని వాటి గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలుసుకొని వాటి రుచిలను మేము ఆస్వాదిస్తున్నాము ఇన్ని వివరముగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు

  • @thripuraammaji8377
    @thripuraammaji8377 2 роки тому +25

    Swamy garuu 🙏....మీ భాషలాగే మధురాతి మధురం గా ఉందండి పచ్చడి... 👌

  • @bhargavacharya1861
    @bhargavacharya1861 2 роки тому +16

    గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ రోలు చాలా బాగుంది 🙏🙏

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 2 роки тому

      అది రోలు కాదు. గ్రైండర్ నుండి వేరుచేయబడిన రోలు పొత్రము.
      మనలో చాలా మంది రోలు దొరక్క, కొనుగోలు చేయలేక, ఒకవేళ కొన్నా అది ఆక్రమించే స్పేస్ ను చూసి భయపడతారు.
      అలాంటి వారు గ్రైండర్ రిపేర్ పనివారివద్ద నిరుపయోగంగా పక్కన పడేసిన వాటిని తెచ్చుకుని ఇలా చక్కగా ఉపయోగించుకోవచ్చు.
      ఈయన మాత్రం దాదాపు కొత్త గ్రైండర్నే ఊడకొట్టినట్లున్నది.

    • @sbharathi9070
      @sbharathi9070 2 роки тому

      @@yedukondaluchirala3033 ojboobboojo obooobobjon ii

  • @ALAPUSATYANARAYANA-uu4dv
    @ALAPUSATYANARAYANA-uu4dv 10 місяців тому +2

    Very good and valuable preparation of velaga pandu chathney.

  • @srilathapagadala9960
    @srilathapagadala9960 Рік тому +1

    Challa chakaga cheparu Guru Garu 🙏

  • @brundhasholaganga3854
    @brundhasholaganga3854 2 роки тому +2

    గురువు గారు పచ్చడి చాలా బాగా చేసి చూపించారు చూస్తున్నకొద్ది నోటిలో అలా లాలజాలం ఊరిపోతుంది

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Avunu ee velagapandu pacchadi meemu ilane chestaamu tqs for reminding my previous experiences

  • @ikurmarao4754
    @ikurmarao4754 2 роки тому +35

    మీరు చేసిన పచ్చడి బావుంది మీ తెలుగు ఇంకా మధురంగా ఉంది మీకు ధన్యవాదాలు

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 2 роки тому +1

    Namaskaramulu
    Mee vantalu vedeo chustunte
    Aharamu meeda korika pudutundi

  • @lakshmidesiraju5701
    @lakshmidesiraju5701 Рік тому +5

    చేసే విధానం చాలా బాగా చెప్తారు. ధన్యవాదములు

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 Рік тому +5

    ఆరోగ్య కరమైన పచ్చడి చెప్పారు స్వామి👌👌

  • @apsaradhi5673
    @apsaradhi5673 10 місяців тому +4

    చాల చాల బాగుండి. ధాన్యవాదాలు.

  • @sailajaj6853
    @sailajaj6853 Рік тому

    Super ga vundi meerotipachaallu

  • @gayatrirani3711
    @gayatrirani3711 2 роки тому

    అయ్యా మీ వంటలు , వాటితోపాటు మీరువంటలగూర్చి చెప్పేవిధానం చాలా బాగుందండి.అలాగే వండే పదార్ధాల ఎంపిక ఎలా చేయాలో చేప్పే తీరు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

    • @venususarla6586
      @venususarla6586 Рік тому

      Velaga pandu pachhadi chala bagundi Swami gariki namassumanjalulu

  • @pendkernagendar694
    @pendkernagendar694 9 місяців тому +2

    మీరు చేపిన విధానం చాలా బాగుంది
    ఇలాంటి వీడియో లు చేసినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @Sandhya-ek8tj
    @Sandhya-ek8tj 2 роки тому

    Chaala baaga vivarinchi chepthunnaru guruvu gaaru

  • @mahalakshmibalanagu3883
    @mahalakshmibalanagu3883 4 місяці тому +1

    Mea vantalu chala baguntayi
    Swami's super andulo
    Brahmins vantalu baguntayi❤😊

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 2 роки тому

    నేను చేసాను చాలా చాలా బాగుంది అండీ

  • @swathipulakhandam8388
    @swathipulakhandam8388 2 роки тому +33

    Wow idi naa favorite తాతగారు, తిన్నది రెండు sarle gani ruchi ippatiki marchipoledu thank you🙏

    • @rajich8022
      @rajich8022 2 роки тому +2

      True..I had this almost 38yrs back..still I remember the taste

    • @kasirajusita3214
      @kasirajusita3214 2 роки тому +2

      వెలగపచడిమెతగాదంచకూడదు

    • @vijayalakshmipulagam2393
      @vijayalakshmipulagam2393 2 роки тому +1

      Sir, mee guthivankaya memo chest thinnamu, aha EMI ruching. Thank you.

    • @rajendranooty1752
      @rajendranooty1752 2 роки тому

      Ii

    • @orugalluswarna6268
      @orugalluswarna6268 2 роки тому

      super swami chustene tinalani vundi mee opikaki namaskaram andi🙏

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 10 місяців тому +2

    చాలా బాగుంది అండి

  • @chitra9123
    @chitra9123 Рік тому

    Namaskaram thathagaru....mee vantalanni adbhutham....🙏mee opikaki vandanamulu....
    Rolu gurinchi meru cheppinadi correct 💯...maa Nayanamma ammamma ilagey chepparu Naku chinnapudu🥰

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 Рік тому +3

    చాలా చక్కగా చేసి చూపించారు ధన్యవాదములు

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 2 роки тому +7

    నాకు ఇష్టమైన పచ్చడి.మీరు చెప్పే విధానం.బాగుంటుంది...... 🙏🙏🙏

  • @bujjipalakurthi9057
    @bujjipalakurthi9057 2 роки тому

    Meru sempulga videomugeste baguntade sir mevantalu chalabagutunaye try chesamu supergaunaye

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 роки тому +1

    Guruvu gaaru ardhamayela baga cheppinaaru

  • @nageshkumar4223
    @nageshkumar4223 Рік тому

    Meru explain chese vidanam chala bagundi ...

  • @nukalaraju2428
    @nukalaraju2428 2 роки тому +4

    చాలాసంతోషం ఈకాలంపిల్లలకు ఇటువంటి రుచులు పరచయం చాలమంచిది ముందుముందు ఇటువంటి మంచి వంటలు పరిచయం చేస్తారని ఆసిస్తూ

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 2 роки тому +1

    Me bhavatharagalu
    Madhuram guruji.

  • @lakshmiburra1357
    @lakshmiburra1357 10 місяців тому +7

    చాలా చక్కగా వివరించారు 👌👌🙏

  • @seshavani955malyala3
    @seshavani955malyala3 10 місяців тому +1

    సూపర్ వేలకాయ రోటి పచ్చడి బాగుంది మీరు చేసేవిధానం కూడా బాగుంది 🌹🌹🌹🙏🙏🙏🍊🍎🍇🎆👌

  • @jayaprakash-lf3gg
    @jayaprakash-lf3gg 2 роки тому +6

    మీ ఈ వంటలు వల్ల మళ్లీ మన వంటలుకు దగ్గర అవుతున్నాము గురువుగారు .

  • @sunandarajasekhar3574
    @sunandarajasekhar3574 2 роки тому +4

    Maa amma చేసేది,విధానం,మరచిపోయాను,thank you andi.చూస్తుంటేనే నోరు ఊరుతోంది.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍑🍑🍑💐💐💐🍊🍊🌼🌼🌻🌻🌻🥭🥭🌷🌷🍎🍎🌾🌾🌾🍏🍏🌺🌺🌸🌸🍓🍓🍓🍁🍁🍍🍍🍍🥰🥰

  • @murtyati2362
    @murtyati2362 2 роки тому

    Chala bagundi chesey vidanam
    Danyavadalu swami ji
    Nenu chesi meeku cheptanu

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Рік тому +3

    Palani Swamy Garu chala Baga chesi chupinncheru hat's off 👏👏😍👍👌🙏

  • @raghunadh9567
    @raghunadh9567 2 роки тому +7

    మీ వంటలు మధురం.. మీ వ్యాఖ్యానం మధురాతి మధురం 🙏🙏🙏

  • @kamalarao8354
    @kamalarao8354 Рік тому +1

    Meeru cheppi natte chesenu chala baundi guru garu ila inka chala chala vantalu maaku nerptu meeru healthy ga happy ga undali ani maa andari korika 🙏

  • @varalaxmigupta9881
    @varalaxmigupta9881 2 роки тому +3

    Guru garu 🙏 me tip bagunde 👍.Velayethy pandena kya Ela gurthupatalo chapale Marioka tip chapende 🙏

  • @lathatumula6003
    @lathatumula6003 2 роки тому

    Chala bavundi guruvu garu dhanyavaadalu manchi roti pachadi chupincheru

  • @lakshmikumari5190
    @lakshmikumari5190 2 роки тому +19

    Yummy! 😋 ma nanagaru gujju chesi bellam kalipi, elakai podi challi, neyyi lo veyinchina geedi pappu- yendu draksha garnish chesi evening snack cup lo vaddichche varu. Yummy!! Thankyou Swamy garu. 🙏🙏🙏

  • @lalithakurapati3883
    @lalithakurapati3883 Рік тому

    Bagachapparandi🙏🏻🙏🏻

  • @kalyaniavasarala1037
    @kalyaniavasarala1037 10 місяців тому +1

    గురువుగారు మీరుచేసేవిధానం చాలాబావుంది ధన్య వాదములు నమస్కారములు

  • @annapoornammamadiraju1602
    @annapoornammamadiraju1602 2 роки тому +9

    Marachipoina pachadi gurtu chesaru sir. My grandmother was doing in my childhood, thank you

  • @saradadevialamuru7460
    @saradadevialamuru7460 Рік тому

    Peddaly chese pachhallu i mean vantalu chupictunnanduku Namaskaramandi. So Happy🙏

  • @vijaybhaskar3683
    @vijaybhaskar3683 2 роки тому

    Guruvu garu super

  • @dasarisuresh8656
    @dasarisuresh8656 2 роки тому

    SUPER GAA UNDI TAATA JI ~ SHIVOHAM • SHIVOHAM.

  • @111saibaba
    @111saibaba Рік тому +16

    ఈ వెలగ పండు ను నీటిలో కాయగా ఉడికించి వండడం, లేదా పొయ్యి లొ వేసి కాల్చడం కూడా ఉంటుంది. కాయ పచ్చిగా ఉన్నపు డు ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. దీన్ని ఎక్కువ పచ్చడీకే ఉపయోగిస్తారు. పండు వాసన నచ్చని వారు ఇంకా పచ్చిగా ఉన్న కాయలు తెచ్చు కోవచ్చు. రుచి వగరు గా ఉంటుంది.
    మా ఇంట్లో పచ్చడి చేసినా తరు వాత పోపు వేయడం మగ్గించడం ఉండదు. ఈ వంటలు, స్వామీ చెప్పే మిగతా వంటలు ఈ నాటికీ బ్రాహ్మణ గృహల్లో ఇలాగే చేస్తారు. కానీ విరివిగా వెల్లుల్లి, ఉల్లిపాయలు వాడ్డం ఉండదు. చాలా కొద్ధి వంటలకే గోంగూర పులుసు, కంది పచ్చడి వంటి వంటలకు మాత్రమే వెల్లుల్లి వాడతారు. ఉల్లిపాయలు కొన్ని వేపుళ్ల కు జోడించడం జరుగు తుంది. మా అమ్మ గారు కూడా రోలు కడ క్కుండా వదిలేయ కూడదని చెప్పేవారు. కడి గిన తరువాత పొత్రం తీసి రోటి పై భాగం లొ పెట్టాలి. కానీ మళ్ళీ రోటి మద్య రంద్రం
    లొ వేయకూడదు. ఆ రోజుల్లో పొయ్యి దగ్గర కానీ కుంపటి దగ్గర గాని కూర్చునె వంటలు చేసేవారు. రాత్రి వంట గది కడిగి ముగ్గు పెట్టేవారు. పొయ్యి ఉంటే రాత్రి అలికి ముగ్గు పెట్టేవారు. ఆరోగ్య సూత్రాలు, యోగ రహాస్యాలు, extreme hygein అన్ని వంటగది లోనే ఉండెవి.అది వారికి యజ్ఞ శాల.

    • @lakshmidevasena6877
      @lakshmidevasena6877 Рік тому

      మనందరి అద్రుష్టం అదే.చేయలేక పోయినా కనీసం అలాంటి పెద్ద వాళ్ళ మధ్య పెరిగాం.

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 роки тому +7

    Super receipe guruvu garu 🙏🙏🙏🙏

  • @gangabhavani9190
    @gangabhavani9190 10 місяців тому +2

    చాల బాగుంది గురువుగారు

  • @kondurikasi8695
    @kondurikasi8695 Рік тому

    Chala baga vivaranga theliya chesaru mastaru garu. Dhanyavaadamulu

  • @sivamovva3838
    @sivamovva3838 2 роки тому +4

    Tq for So nice making..Palani swami ji💚

  • @saigopigopi3151
    @saigopigopi3151 2 роки тому +1

    Guruvu gaaru supper andi

  • @kaligotlasrinivas243
    @kaligotlasrinivas243 2 роки тому +6

    Chala bagundi guruvugaru

  • @gprmoon3043
    @gprmoon3043 2 роки тому +9

    చాలా బాగా చేశారు స్వామి వెలగపండు పచ్చడి బెల్లం కూడా వేశారు అద్భుతః అన్న వలసిందే తిని ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 роки тому +3

    Super recipe guruvu garu thank you

  • @gayathrirajaraman8217
    @gayathrirajaraman8217 2 роки тому +21

    Wonderful authentic dishes..well explained and done in simple way.

  • @nageswariprasad3120
    @nageswariprasad3120 7 місяців тому

    Chala bagundi.. nenu try chesta

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna7964 2 роки тому +2

    నమస్తే బాబాయి గారు 🙏
    వెలగపండు పచ్చడి చాలా బాగా చూపించారు మన సాంప్రదయపు వంటకాలు చూపించాలి,మీ వంటలు ముందు ఎటువంటి నీసు వంటకం పనికిరాదు.

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 Рік тому +4

    Meeru superb ga chepparu sir
    🙏🙏🙏🙏🙏

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 роки тому

    Maa naannammagaru chese vaaru. Ippudu nenoo chesta. Thanks a ton for sharing

  • @anuradhalakshmi5739
    @anuradhalakshmi5739 2 роки тому +4

    Chaala bagundi guruvu garu

  • @lionwalaedits
    @lionwalaedits 2 роки тому +16

    చాల బాగుండి గురువుగారు . కాయ పరీక్ష కూడా బాగుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hymavathipujyam7483
    @hymavathipujyam7483 10 місяців тому

    Babai garu e roju mi banta chusi e pachadi chesukoni thinam
    Chala super ga vundi
    ❤❤❤❤❤❤

  • @subhadrammach5347
    @subhadrammach5347 10 місяців тому

    Chala chakkaga vivarincharu. Chese vidhanam, cheppe padhathi, bhakthi sradhalatho meeru vupayoginche vasthuvula subhratha annee chala bavuntayandi.Dhanyawadamulu.🙏