IndoMach Exhibition at Hitex Hyderabad | B2B Industrial and Machinery Expo | Machinery | Expo, h5tv

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ‘ఇండోమ్యాక్’ ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథి శ్రీ కుమగయి, సీ ఓ ఓ డైరెక్టర్, కోయికే కట్టింగ్ మరియు వెల్డింగ్ ఇండియా లిమిటెడ్; హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేడు ప్రారంబించారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23వ తేదీ వరకు జరగనుంది. బీ2బీ ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ఇది. ఈ ఎగ్జిబిషన్లో మెషిన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, వెల్డింగ్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేవలు, భారీ, తేలిక పాటి యంత్రాలు, యంత్ర పరికరాలు, ఉపకరణాలు, సాధనాలు, పాక్షిక సాంకేతిక పరికరాలు, ఉత్పత్తులు, ఇంజనీరింగ్ సాధనాల ప్రదర్శన ఉంటుంది. అత్యాధునిక సాంకేతికతలు, గ్లోబల్ ఇన్నోవేషన్‌లు, ఆధునిక పరిష్కారాలతో సహా విస్తృతమైన పారిశ్రామిక అప్లికేషన్‌లను ఆవిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. వీటిలో కొన్ని భారత్‌లో మొదటిసారిగా పరిచయం కానున్నాయి.
    మూడు రోజుల ఈ ఎక్స్‌పో హైదరాబాద్‌లో జరగనున్న ఇండోమ్యాక్ మూడో ఎడిషన్. అంతకుముందు 2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన రెండు ఎడిషన్‌లు అపూర్వమైన విజయాన్ని సాధించాయి. ఎగ్జిబిటర్‌లు, సందర్శకులు ఇద్దరికీ ఉపయోగపడింది. ఇండోమ్యాక్ హైదరాబాద్‌తో పాటు జంషెడ్‌పూర్, నాగ్‌పూర్‌తో సహా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలలో ఏటా జరుగుతుంది.
    ఈ సంవత్సరం ఇండోమ్యాక్ ఎగ్జిబిషన్‌లో దేశ, విదేశాల నుంచి 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు విచ్చేశారు. ఇండస్ట్రియల్ మెషినరీ కొనుగోలుదారులు, అమ్మకందారుల సమ్మేళనాలలో ఇది ఒకటి. 750కి పైగా లైవ్ మెషినరీలను ప్రదర్శిస్తున్నారు. 900కి పైగా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ మూడు రోజులలో ఎగ్జిబిషన్‌కు పాన్ ఇండియా నుంచి.. ముఖ్యంగా దక్షిణ భారతదేశం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి 18,000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. ఈవెంట్ కోసం 12,000 మంది సందర్శకులు ముందస్తుగా నమోదు చేసుకున్నారు. ఎక్స్‌పోకు ప్రవేశం ఉచితం.
    ఇండోమ్యాక్ ఎక్స్‌పోలో ఇంజినీరింగ్ మెషినరీ, మెషిన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్, సీఎన్సీ మెషీన్‌లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్, హైడ్రాలిక్స్, న్యూమాటిక్స్, వెల్డింగ్ ఎక్విప్‌మెంట్స్, సేఫ్‌డక్ట్స్, సేఫ్‌డక్ట్స్ క్విప్మెంట్, లేజర్ టెక్నాలజీ, ఎన్-ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ సెక్టార్ నుంచి ఇతర కేటగిరీలు కలవు.
    #machinary #indimach #indomachexpo #exhibition #hitex #hitechcity #h5tv #news #hyderabad #telangana #exhibition

КОМЕНТАРІ •