ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోని రాజమండ్రిలో ఈవేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాగళం భారీ బహిరంగ సభ

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోని రాజమండ్రిలో ఈవేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాగళం భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజమండ్రి వేమగిరి వద్ద జాతీయ రహదారినీ చేర్చి ప్రధాని ప్రజాగళం ఎన్నికల సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపి రాష్ట్ర అధ్యక్షరాలు దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారు. కాకినాడ, అమలాపురం, ఏలూరు, నర్సాపురం ఎన్డీయే ఎంపీ అభ్యర్ధులను , రాజమండ్రి ఎంపీ పరిధిలో ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్ధులను, ముఖ్య ఎన్డీఏ నాయకులను వేదిక పైకి ఆహ్వానించనున్నారు. బీజేపీ , తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారనే అంచనాతో వేదిక వద్ద కుర్చీలు ఏర్పాట్లు చేశారు. మరో లక్ష మంది వేచి వుంటారని, జనసేన తరపున భారీగా జన సైనికులు . తరలివస్తరనే అంచనా వేసి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. . ఎలాంటి తుఫాను, గాలి వానలు వచ్చినప్పటికీ చెక్కుచెదరని అధునాతన వేదికను. జపాన్ టెక్నాలజీ తో సిద్ధం చేసారు. అలాగే భారీకేడ్లు నిర్మించారు. అయితే ఈ ముగ్గురు నేతలు వచ్చేందుకు అనువైన మూడు హెలీ ప్యాడ్ లను వేదికకు దగ్గరగానే ఏర్పాటు చేసారు. బస్సులు, కార్లు,ఆటోలు, మోటారు సైకిల్లు పార్కింగ్ సంబంధించి పలు ప్రదేశాలను పోలీసు యంత్రాంగం పరిశీలించి ఏర్పాటు చేసింది. బహిరంగ సభ ఆవరణ , వేమగిరి జాతీయ రహదారి లలో పోలీసులు భారీగా మోహరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం రాజమండ్రి నుంచి ప్రధాని మోడీ, చంద్రబాబు , పవన్ బయలుదేరి అనకాపల్లి వెళ్తారు సాయంత్రం ఐదు గంటలకు అనకాపల్లిలో జరిగే ప్రజాగళం సభలో వారు పాల్గొంటారు.

КОМЕНТАРІ •