ఏ మంత్రం లేదా బీజాక్షర జపం చేయాలి? అకథహ, అర్వణం, అరవణం ఏమిటి? అందరికీ అన్ని బీజాక్షరాలు పనికిరావా?
Вставка
- Опубліковано 10 лют 2025
- ॐ
శ్రీ లక్ష్మీ నృసిం హాయ నమః
చేయదగిన మంత్రములను తెలిసికొనుట
ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి .... ఈ అయిదు పంచభూతముల సమ్మేళనమే సృష్టి. మంత్రములు, వాటి ఫలితములు అన్నీ ఏ మంత్రమును జపించితే ఆ మంత్రం ఫలం మాత్రము సాధకునికి సిద్ధిస్తుంది. మంత్రం అనునది భగవంతునికి సంబంధించినది. సృష్టి అనగా భగవంతుడు. అటువంటి భగవంతునికి సంబంధిత మంత్రాన్ని జపించిన ఆ మంత్రమునకు సంబంధించిందే ఫలితం వుంటుంది. కాని మరొకటి ఇవ్వజాలవు. ఒక్కొక్క మనిషికి ఒక్కక్క మంత్రం జపం ఫలితాన్ని ఇస్తుంది. మరికొందరికి ఆ మంత్రం ఇవ్వదు. వేరొక మంత్రం ఇవ్వవచ్చు. కావున ఏ మంత్రము ఏ వ్యక్తికి లేదా సాధకునకు అనుకూలమో తెలుసుకొనెడి విధానమే అర్వణ చూచుట అని అంటారు.
మంత్రము యొక్క ప్రారంభ అక్షరమునకు, సాధకుని పేరులో గల మొదటి అక్షరమునకు సంబంధం వుండాలి. అట్టి పొంతన లేదా సంబంధం కుదరకుండా చేసెడి మంత్ర జపము వలన అనేకానేక కష్టములు సంభవించవచ్చును. ఈ విధానమునుఏ అర్వణ చూచుట అంటారు.
కావున ఏ కోరికతోనైనను సాధకుడు మంత్రమును ప్రారంభించవలెనన్న అర్వణ చూచి అనుకూలంగా వుంటేనే మంత్ర జపము చేయుటకు సిద్ధపడవలెను. ఆ మంత్రం అర్వణ సరిగా అనుకూలించకపోయినా వేరొక అనుకూల మంత్రం అర్వణం చూసుకుని ప్రారంభించాలి.
ఈ అర్వణ చక్రం 16 గడులతో వుంటుంది. దీనిలో సిద్ధ, సాధ్య, సుసిద్ధ, అరి అనే భాగాలు వుంటాయి. సిద్ధములో : సిద్ధ సిద్ధ, సిద్ధ సాధ్య, సిద్ధ సుసిద్ధ, సిద్ధ అరి అనే భాగాలు వుంటాయి సిద్ధ అరి పనికి రాదు. అలానే సాధ్య, సుసిద్ధ, లకు కూడా నాలుగు బాగాలు వుంటాయి వాటిలో కూడా అరి పనికి రాదు. అలానే అరి లో వచ్చే 4 పనికి రావు. అనగా మొత్తం అరి అనేవి 7 గడులు వస్తాయి. వీటిలో వచ్చిన ఏ బీజాక్షరం పనికిరాదు.
మీకు సంబంధించిన మంత్రాన్ని తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన మంత్రాన్ని తెలుసుకోవాలంటే మీ పేరు మీద అకథహ చక్రం వేసి అర్వణం చూసి ఏ మంత్రం ఉపాసన చేస్తే కలసి వస్తుందో చెప్పాలంటే తగిన (కాలానుగుణంగా ఫీజు మారుతూ ఉంటుంది ) రుసుం చెల్లించవలసి వుంటుంది. 8330990990 అనే నంబరుకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపి ఆ పంపిన స్క్రీన్ షాట్ 9338900900 కి టెలిగ్రామ్ మెసేజ్ చేయండి.