Saadhana Sopaanamulu [సాధన సోపానములు]

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ •

  • @parabrahmasatyanarayana6209

    JAI JAI JAI GURUDEV

  • @anuradhapentakota7809
    @anuradhapentakota7809 4 роки тому

    🙏💐

  • @సత్యనారాయణవాసంశెట్టి

    🙏
    ధన్యవాదాలండీ

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 6 років тому

    Guruvulaku namaskaramulu

  • @vignufinance
    @vignufinance 5 років тому +1

    Gurubhyo Namaha...
    nidhi dhyasa anaga emiti..? thelusukogoruchunnaanu....

  • @sathsang
    @sathsang  6 років тому +2

    దైవాన్ని దర్శించాలి అని అనుకుంటూ వుంటారా? లేదా?
    మానవులందరికీ దివ్యత్వాన్ని పొందాలి,
    దైవ దర్శనం పొందాలి, అనుకుంటారా? లేదా?
    ఎలా సాధ్యం?
    దానికేగా సాధనలన్నీ!
    జపం చేయండి,
    ధ్యానం చేయండి,
    యాగం చేయండి,
    యోగం చేయండి...
    ఏ సాధన చేసినా, ఈశ్వరుడిని దర్శించటం కోసమే!
    అలాగే ఈశ్వరీయమైనటువంటి శక్తి, నీ ద్వారా పనిచేయటం కోసమే.
    కాబట్టి, మహానుభావులందరూ ఎలా జీవించారు?
    ఈశ్వరుని యొక్క కార్యంలో మనం కూడా భాగస్వాములమైతే,
    ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా పనిచేయడం కనుక వస్తే, అప్పుడేమయ్యింది? సులభమైపోలేదా?
    నేను వేరే, దేవుడు వేరే,
    నా పని వేరే, నా సంసారం వేరే,
    నా శరీరం వేరే, నా ప్రపంచం వేరే...
    ఇలా అనుకున్నప్పుడు ఏమైపోయావు?
    దూరం జరిగిపోయావు.
    అర్థమైందా?
    కాబట్టి, మానవుడికి ప్రశాంతమైన జీవనం దేని వల్ల లభిస్తోందట?
    నేను, నేను అనుకున్న వాడు ప్రశాంతంగా వుండటం లేదుగా!
    అశాంతితోటి వుంటున్నాడు.
    ఎందుకని అంటే,
    ఆ 'నేను' ఎందులో పడితే, అందులో ప్రతిక్షేపించవచ్చు దానిని.
    అది ఎటువంటిది అంటే, 'X' లాంటిది.
    Algebra లో 'x' లాంటిది.
    'x' యొక్క value ఎంత? అంటే,
    నువ్వు ఎంత ఆపాదిస్తే, అంత!
    ఏమీ విలువ లేదు అంటే దానికి,
    అలా కూడా okay అంటుంది.
    'x = 0' అన్నా కూడా it is acceptable.
    'x is infinite' అన్నాకూడా acceptable.
    అట్లాగే, మనలోని 'నేను' ఆ 'x' లాంటిది. అర్థమైందా? అండీ!
    నువ్వు దానికి ఎంత విలువ ఆపాదిస్తావు,
    ఏ విలువ ఆపాదిస్తావు అన్నదానిని బట్టే,
    దాని యొక్క వ్యవహారం ఆధారపడి వుంటుంది.
    నామరూపాత్మకంతో శరీరంగా వున్నటువంటి 'జీవుడే నేను'గా వున్నావనుకో,
    అప్పుడు సుఖదుఃఖ వ్యవహారమే నా జీవితం అనుకుంటావు. అర్థమైందా?
    అసలు మనం ఎట్లా ముసుగేసుకుంటాం అంటే,
    ఇట్లా ముసుగులు వేసుకుంటాము.
    వేసుకుని ఆయా పాత్రోచితమైనటువంటి సుఖదుఃఖాలను అనుభవిస్తుంటాము.
    అనుభవించేటప్పటికి ఏమైంది?
    మనోబుద్ధులు అదే పాత్రలని సత్యం అనుకుంటాయి.
    నిజానికి పాత్రలు భౌతికంలో వున్నాయా?
    అవి భౌతికం కాదుగా!
    మానసికం. ఔనా?
    అమ్మాయి అయినా, అమ్మ అయినా భౌతికంగా ఏం మారిందమ్మా?
    ఏం మారలేదుగా!
    Physical Features ఏమీ మారవు.
    ఎట్లా మార్పు వచ్చింది మరిప్పుడు?
    మనోబుద్ధులలో మార్పు వచ్చేసింది.
    పరిణతి వచ్చింది.
    అమ్మమ్మ అయ్యావు.
    అప్పుడు?
    అప్పుడేమన్నా physical గా మారావా?
    అమ్మ నుంచీ అమ్మమ్మ అవ్వడానికి ఏం physical గా మారవు.
    అవే organs, అంతా అవే functioning.
    Slight little bit change of hormone cycle system మార్పు.
    అంతే తప్ప, భౌతికంగా వచ్చే పెనుమార్పులు ఏమీ వుండవు.
    కానీ, మానసికమైనటువంటి, బౌద్ధికమైనటువంటి, పరిణతి మరి?
    చాలా మార్పు రాలేదా?
    బాల్యానికి, వృద్ధాప్యానికి మధ్యలో... అవస్థాత్రయ భేదం వలన,
    జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు ప్రతి రోజూ అనుభవించడం ద్వారా,
    ఆ మనోబుద్ధులు పరిణతి చెందుతున్నాయి.
    మనోబుద్ధులకేగా జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు...!
    నేనుకు లేవు.
    'నేను' మూడవస్థలలోనూ ఒక్క తీరుగానే వుంది.
    దాని పేరే ఆత్మ.
    జాగ్రత్‌ స్వప్న సుషుప్తుల యందు మార్పు చెందక ఏది కలదో, అదే ఆత్మ.
    ఏది వ్యవహరించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తుందో, అది చైతన్యం.
    అందుకని 'ఆత్మ చైతన్యం' అన్నాము.
    ఆ మూడు అవస్థలలోనూ నీకు వ్యవహారం వుంది కదా!
    ఆ వ్యవహరించగలిగే శక్తి ఎక్కడి నుంచీ వచ్చింది నీకు అన్నాము?