ఆ దోమకు ఎంత అసూయో?

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • #chatuvulu
    #చాటువులు
    #దోమ
    #అసూయ
    అందరికీ నమస్కారమండీ.
    పక్ష.... అనుటకు బదులుగా
    పక్ష్మ...... అని పొరపాటున పలుకబడినది.
    దయచేసి అన్నిచోట్ల.... పక్షయుగ్మ అని అర్థము చేసుకొనవలసినది అని మనవి.
    🙏🙏🙏
    #పరగగ నాల్గు పాదములు బాగుగ తుండము ఘీంకృతంబు మా
    కిరువురకున్ సమంబె మఱి యెక్కువ యొక్కటి పక్షయుగ్మ ఖే
    చరుఁడను నాకు సామ్య మొక సామజమా? యని దోమ పల్కు న
    ట్లరయ మహానుభావులను నల్పుఁడు నోరికొలందు లాడెడిన్
    సహితయోః శబ్దార్థయోః భావః సాహిత్యం అని సాహిత్యానికి నిర్వచనం . హితమును చేకూర్చే అనగా మంచిని కలుగజేసే శబ్దార్థాల కలయికే #సాహిత్యం. ఎవరికి హితాన్ని కలిగిస్తుంది అంటే సమాజానికి హితాన్ని కలిగిస్తుంది. సమాజం అంటే మనమే. మనిషి జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావలసిన నైతిక విలువలను, సూచనలను, స్ఫూర్తిని, ధైర్యాన్ని, విచక్షణా జ్ఞానాన్ని సాహిత్యం అందిస్తుంది.
    కౌముది అంటే వెన్నెల. ప్రకాశాన్ని, ఆహ్లాదాన్ని కలిగించడం కౌముది లక్షణం. ప్రకాశం అంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆహ్లాదం అంటే ఆనందం. సాహిత్యం జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించేది కాబట్టి మన ఛానల్ కు సాహితీ కౌముది అనే పేరును నిర్ణయించాము.
    #ప్రాచీనం నుండి #ఆధునికం వరకు మహాకవుల కలాల నుండి జాలువారిన సాహిత్యగంగ సహృదయుల హృదయాలలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ఉన్న అనేక అనేకానేక అంశాలను, #ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావిస్తూ బాలలనుండి పెద్దల వరకు అందరికీ ఆనందాన్ని కలిగించేలా ఈ ఛానల్ ని రూపుదిద్దాలనే నిబద్ధతతో ఉన్నాము.
    దీనికి అమూల్యమైన మీ సహకారాన్ని అందించి ఛానల్ ను ముందుకు నడిపిస్తారని ,నన్ను ప్రోత్సహిస్తారని అభిలాషిస్తూ...
    మీ
    ద్విశతావధాని బులుసు అపర్ణ
    • బిచ్చగాళ్ళు కూడా మనకి ...
    Facebook page link
    www.facebook.c...
    Instagram
    www.instagram....

КОМЕНТАРІ • 35

  • @ramasureshvanapalli6354
    @ramasureshvanapalli6354 7 днів тому

    Thanks

  • @పురుషోత్తంభువనగిరి

    మంచి సందేశాన్ని అందించారు.. అభినందనలు..🎉 ఆశీస్సులు

  • @RamaseshuKomonduri-yo8ud
    @RamaseshuKomonduri-yo8ud 7 днів тому

    నేటి సమాజానికి మంచి సందేశం.....శుభాకాంక్షలు...

  • @acharyasrisukthi
    @acharyasrisukthi 7 днів тому

    అసూయ-అనసూయల వివరణ బాగుంది!దోమ-ఏనుగుప్రత్యేకతలలో స్థూలకాయం యొక్కఅవస్థలను తలచుట్టుతిప్పి ముక్కుచూపించినట్టుచెప్పారు! చేసుకున్నవారికి చేసుకున్నంతమహాదేవ!కదా!సీత బాధలు సీతవి!పీతబాధలు పీతవి!మా లాంటివారికి పద్యం అర్థమైనా?కాకున్నా మీ టీకా!బాగా గుణంచేస్తుంది!
    గీతాశ్రీభాష్యాన్నికొనసాగించండి!700శ్లోకాల పెద్ద ప్రాజెక్టుకదా!ధన్యవాదములు!😊

    • @sahithikoumudi
      @sahithikoumudi  7 днів тому

      ధన్యవాదాలండీ
      ఈ వీడియోలకు సమాంతరంగా గీతావివరణమును కూడా కొనసాగిస్తానండి
      🙏🙏🙏

  • @vamadevakota6748
    @vamadevakota6748 5 днів тому

    🎉🎉🎉🎉🎉

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 7 днів тому

    🎉🎉🎉🎉🎉

  • @RR-fw3kr
    @RR-fw3kr 7 днів тому +1

    అమ్మ భగవద్గీత వివరము

    • @sahithikoumudi
      @sahithikoumudi  7 днів тому +1

      @@RR-fw3kr ఈ వారంలో పెడుతున్నానండి
      🙏🙏🙏

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 7 днів тому +1

    నమస్తే అమ్మా 🙏 అల్పుల లక్షణం ఇలాగే ఉంటుంది. చక్కగా వివరించారు 🙏

  • @Dharmadaveeranjaneylu
    @Dharmadaveeranjaneylu 7 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 дні тому

  • @RR-fw3kr
    @RR-fw3kr 7 днів тому +1

    🙏

  • @kottelaxman111
    @kottelaxman111 3 дні тому

    Super explanation madam

    • @sahithikoumudi
      @sahithikoumudi  2 дні тому

      🙏🙏🙏

    • @kottelaxman111
      @kottelaxman111 День тому

      @@sahithikoumudi madam,
      మనసుంటే మార్గం ఉంటది
      జాతీయమా?
      సామెత? ఆ madam??

  • @DgdGgii
    @DgdGgii 6 днів тому

    కొంతమంది మంచిలోకూడా చెడు వెతుకుతుకుతారు కొంత మంది చెడులో కూడా మంచి వెతుకు తారు, ఏదయినా పొరపాటు ఉంటే క్షమించండి, మీరు చాలాబాగా చెప్పినారు ధన్యవాదములు

  • @padmamandadi8864
    @padmamandadi8864 7 днів тому

    మంచి చాటువు చెప్పారమ్మా..

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 7 днів тому

    మీరు వీటిని వివరించేటప్పుడు వీలైతే రచించిన కవి పేరు సెలవియ్యండి

    • @sahithikoumudi
      @sahithikoumudi  4 дні тому

      నమస్తే అండి
      ఇవి చాటువులు కదండీ.
      అందువల్ల కొన్ని పద్యాలకు కవి ఎవరు అనేది లభ్యం కాదండి.
      అలా లభ్యం అయ్యే వాటికి తప్పకుండా కవి పేరు కూడా చెప్తానండి.
      🙏🙏🙏

    • @sudhamodumudi545
      @sudhamodumudi545 4 дні тому

      సరేనండి. ధన్యవాదములు