నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను|| దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను|| జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను|| శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| పాపాల సంద్రమందున పయనించు వేళలో (2) పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2) నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి|
నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను||
దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా ||నన్ను||
మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను||
జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా ||నన్ను||
ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను||
శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా ||నన్ను||
వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||
పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి|
Glory to God hallelujah
Praise God
Tq brother
దయచేసి ఈ పాట లిరిక్స్ కూడా పెట్టండి