#TPM

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • గత చరిత్ర : దానియేలును అతని ముగ్గురు స్నేహితులు సమస్త జ్ఞానములోను శ్రేష్ఠులును రాజ కార్యమునకు యోగ్యులైనవారు (దానియేలు 1:4) వారికి బబులోను తర్పీదు శాలలో 3 సంవత్సరములు తర్పీదు లభించింది. (దానియేలు 1:5) వారి స్వదేశ పేరులను మార్చుటకు బెత్తెషాజరు అను క్రొత్త పేరు దానియేలుకు ఇవ్వబడినది. దానియేలు యొక్క జ్ఞానము మరియు కలల భావము చెప్పు సామర్థ్యము వలన ఆయనకు నెబుకద్నెజరు, దర్యావేషుల రాజ్యాంగములలో ప్రవేశము కలిగినది. ఎటువంటి అపవిత్రతకును లోనుకాని దానియేలును నీతితో నిండిన జీవితమునకు మాదిరిగా యెహెజ్కేలు చూపించుచున్నాడు. (యెహె 14 - 20, 28: 13) విశ్వాసము, ప్రార్థన జీవితము, ధైర్యము, నీతి భక్తి, క్రమము అనునవి నిండిన జీవితముగా ఆయన జీవితము ఉన్నది. నీవు బహుప్రియుడవు అని ప్రభువు ఆయనను పిలుచుచున్నాడు. బబులోను సామ్రాజ్యము పతనమయి మాదీయ పారశీక సామ్రాజ్యము వచ్చినప్పటికిని దానియేలు తన శేష్టమైన పదవిలో కొనసాగాడు. నెబుకద్నెజరు, బెల్లసరు, దర్యావేషు,కోరెసు, అను నలుగురు రాజుల కాలములోను ప్రధానమంత్రి అను శ్రేష్టమైన పదవిని వహించాడు.
    గ్రంథ విశిష్టత : దానియేలు యొక్క దైవ దర్శనములు, మెస్సియాను గూర్చి సూటియైన ప్రవచనముల వంటివి నిండిన అనేక కాల మట్టములలో దేవుని ప్రణాళికలను గూర్చిన ఒక క్లుప్త వివరణ ఈ గ్రంథములో ఇవ్వబడియున్నది. ( 8 - 12 అధ్యాయములు)
    ముఖ్య పదజాలము : మహోన్నతుడైన దేవుడు, మానవుల రాజ్యాంగములను, పదవులను నియంత్రించే ఉన్నతమైన దేవుని ఈ ప్రవచనము మనకు చూపించుచున్నది. దేవుని యొక్క మార్పులేని పాలన ఎల్లప్పుడును ఉండునను దానిని దానియేలు తెలియజేయుచున్నాడు.
    గ్రంథ విభజన : పాతనిబంధన ప్రకటన గ్రంథము అని పిలువతగిన దానియేలు ప్రవచన గ్రంథము దీర్ఘకాల ప్రపంచ చరిత్రను తెలిపే గ్రంథమగును మొదటి అధ్యాయము యొక్క ఉపోద్ఘాతము అర్ధమయిన తరువాత 2 నుంచి 7 వరకున్న అధ్యాయములలో లోకము యొక్క భవిష్యత్తు చెప్పబడియుంటున్నది. 8 నుండి 12 వరకైన అధ్యాయములలో అన్యజనుల పాలన క్రింద యూదా ప్రజల భ విష్యత్తు చెప్పబడియున్నది. ప్రపంచ చరిత్రపై దేవుని పరిపాలన (అధికారము) అను అభిప్రాయము ఈ ప్రవచనముల మూలముగా గ్రాహ్యమగుచున్నది. అది బబులోనీయుల వలన నాశనము చేయబడిన యూదా ప్రజలకును, క్రైస్తవ సంఘములకును ఓదార్పును, ఆధరణను ఇచ్చుచున్నది. బబులోను, పారశీకము, గ్రీకు, రోమా మహాసామ్రాజ్యములు ఉదయించి అస్తమించును. అయినను దేవుని విమోచన జనము ద్వారా ఆయన తన నిత్యరాజ్యమును స్థాపిస్తాడు. దానికి ఎప్పుడును అంతము లేదు. గ్రంథవిభజన క్రింద చూడండి.
    1. దానియేలు యొక్క వ్యక్తిగత జీవితము అధ్యాయము 1.
    2. అన్యజనుల దేశముల భవిష్యత్ కాల స్థితి అధ్యాయము 2 - 7.
    (a) నెబుకద్నెజరు కలలు అధ్యా 2 - 4.
    (b) బెల్లసరు దర్శనము అధ్యా 5.
    (C) దర్యావేషు ఆజ్ఞ అధ్యా 6.
    (d) నాలుగు (జంతువుల) దర్శనము అధ్యా 7 (మృగముల)
    3. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల స్థితి. అధ్యా 8 - 12.
    ( a) పొట్టేలు మరియు మేకపోతుల దర్శనము. అధ్యా 8.
    (b) 70 వారముల గూర్చిన దర్శనము అధ్యా 9.
    (C) ఇశ్రాయేలీయుల భవిష్యత్తును గూర్చిన దర్శనము. అద్యా 10 - 12.
    --------------------------------------------------------------------------------------------------------------------------
    #Bible Study Sermons | #TPM SONGS | #Vijayawada Convention Songs | #Telugu TPM Songs | #TPM Messages | #Bible Sermons | #Christian Messages | #Christian Sermons | #TPM Songs | #TPM Latest Songs Jukebox |
    Give thanks to Yahweh! Call on his name! Make his doings known among the peoples.Psalm 105:1 (WEB)

КОМЕНТАРІ • 19