ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందు
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2) ||ఎందుకో||
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2) ||ఎందు