Sri VishnuMurthy Chalisa || శ్రీ విష్ణు చాలీసా || Lord Vishnu Devotionals || Bhakti Taal

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024
  • Title: Sri VishnuMurthy Chalisa || శ్రీ విష్ణు చాలీసా || Lord Vishnu Devotionals || Bhakti Taal
    Lord Vishnu Devotionals
    Lyrics: Srirangam Jogi
    Music: Sai Deva Harsha
    Singer: Shanti Venumadhav
    #LORDVISHNUDEVOTIONALS
    #VISHNUDEVOTIONALSONGS
    #devotionalchants
    #devotionalsongsintelugu
    Lord Vishnu Devotionals
    Produced By: B.N.Murthy, Palli Nagabhushana Rao
    Bhakti Taal
    Also Listen On itunes
    itunes.apple.c...
    Also Listen On Spotify
    open.spotify.c...
    Also Listen On Deezer
    www.deezer.com...
    హరి ఓం హరి ఓం నారాయణ
    అచ్చుత కేశవ నారాయణ
    జగతి పాలకా జనార్ధనా
    జయము జయము హరి నారాయణ
    మాయాలోక నివాసి
    మోహన రూప ప్రకాశి
    వ్యాపకత్వమున తెలిసేవు
    శివ హృదయాన వెలిగేవు
    సృష్టి కర్తనే సృష్టించి
    సృష్టికి మూలంగా తెలిసి
    స్థితి కార్యమున నిలిచేవు
    లయకారకుని కలిసేవు
    మనసున మాయను నింపి
    కామము మోహము పెంచి
    సత్వ గుణమును తీసేవు
    రజో తమములను పెంచేవు
    కల్పాంతములో కనిపించి
    వట పత్రములో శయనించి
    విష్ణుమూర్తిగా తెలిసితివి
    విశ్వ పాలన చేసితివి.
    కమలములోన భాసించి
    కమలనాభునిగ కనిపించి
    కమలాక్షునిగా విరిసావు
    కమలానికి ఘనతొసగావు
    ఏడు గడపల సమహారం
    వైకుంఠముగా వ్యవహారం
    విశ్వ ప్రకాశం నీ తేజం
    పాలకడలి నీ నిజవాసం.
    పద్మనాభునిగ తెలిసితివి
    పద్మ నేత్రిని కూడితివి
    పరమేష్టి నెరుగగ జేసితివి
    పరమ పురుషునిగ ప్రభవించితివి.
    సంకల్పమున సృష్టించి
    సామరస్యమున పాలించి
    దుష్ట శిక్షణ గావించి
    శిష్ట రక్షణ చేసితివి.
    భక్తుని శాపము భరియించి
    శాపముక్తుని గావించి
    శోకమునే తొలగించావు
    శాంత మనస్కుని చేసావు.
    ధరణిని ధర్మము పూయించ
    ధర్మ కర్మములు పాటించి
    ధర్మ మార్గమును చూపేవు
    దర్మ రక్షణ చేసేవు
    అంబరీశునికి అభయముతో
    అందిందు జనించ ఒడంబడి
    ఆకారములను దరియించి
    అవనిని పావనమొనర్చావు
    పలు యోనుల జన్మించి
    పలు రీతులగ ప్రభవించి
    ప్రత్యగాత్మగ తెలిసితివి
    పరమానందం పంచితివి.
    అవని భారము తొలగించ
    అవతరించగా తలచావు
    అవతారములను దాల్చావు
    అసుర శక్తులను తృంచావు
    విష్ణు వాసమును వదిలలావు
    వింత వాసమును చేసావు
    వేడుకగా కథలెరిగించావువు
    విశ్వానికి పాఠంగా తెలియజేసావు
    మత్సరూపమున అరుదెంచి
    సోమాకాసురుని దృంచితివి
    వేదములను రక్షించావు
    విరించి ముఖమున నిలిపావు
    కూర్మ రూపమున కదలాడి
    మంద్రగిరిని మరి భరియించి
    పాలకడలి చిలికించావు
    పరమార్ధమును అందించావు
    భూభారమును మోసావు
    భూమి భారమును తీసావు
    పాలన చందము నెరిగించి
    పరిపాలన చేయగ నిలిచావు
    మోహన రూపము దాల్చావు
    మోహినిగా అగుపించావు
    అసురుల మాయ చేసావు
    సురలకు అమృతము పంచావు
    లక్ష్య సాధన సాగించి
    లక్ష్మికి చేయిని అందించి
    పత్ని పీఠము ఒసగావు
    పట్టమహిషిగా తెలిపావు
    వరాహ రూపము నరుదెంచి
    హిరణ్యాక్షుని హతమార్చి
    వసుధకు రక్షణ కూర్చావు
    భూపతిగా భాసించావు.
    చిత్తమునెంచిన రూపంతో
    చిత్రమైన సందేశముతో
    కంభము నుండి కదిలావు
    కన్నులు చెదరగ మెరిసావు
    నృసింహమూర్తిగ అరుదెంచి
    నిజ భక్తుని మాటకు విలువిచ్చి
    దాసుని శాపము తీర్చావు
    సర్వాంతర్యామిగ శోభించావు.
    వర బలమును ఎరిగావు
    వైరితొ రణమున నిలిచావు
    నఖములతో చీల్చేసి
    నర వైరిని నిర్జించావు
    వామనమూర్తిగ విచ్చేసి
    విప్ర రూపమున యాచించి
    నీ వాక్కున మర్మం దాచావు
    ఆ వాక్కున కట్టడి చేసావు
    దాన గ్రహీతగ చేయుంచి
    దానవ సర్వం గ్రహించి
    పాతాళానికి పంపావు
    భూతలమున కీర్తిని పెంచావు .
    జమదగ్ని సుతునిగ జన్మించి
    రామ నామమున చరియించి
    పరమేశుని వరమున ప్రభవించి
    పరశు రామునిగ తెలిసేవు.
    ధరణిని రాజుల జయించి
    ధర్మ రూపాన అగుపించి
    దాతగ జనులకు తెలిసావు
    దక్షిణ దిక్కుకు సాగేవు
    రఘు వంశములో జనియించి
    రఘు రామునిగా రావించి
    వశిష్టుని కూడి విరిసావు
    వంశ తిలకమై వెలిగేవు
    సూర్య వంశమున శోభించి
    సంఘ మిత్రునిగ చరియించి
    చంద్ర కాంతుల మెరిసేవు
    అమృత వాక్కుల విరిసేవు
    వానర మూకల కూడేవు
    వారది కట్టగ వినిచేవు
    కడలిని కలగా దాటేవు
    కోలాహలమును చాటేవు
    రావణ రావమునాపేవు
    రాక్షస మూకల అణచేవు
    విభీషణ పాలన స్థాపించి
    లంకకు లక్షణమొసగేవు
    యుగములందు అగుపించి
    యుగ ధర్మమును పాటించి
    కర్మాచరణము తెలిపావు
    కర్మ యోగిగా మసలేవు.
    మాతృ ప్రేమకు మురిసావు
    మరలా మరలా పుట్టావు
    అచ్చట ఇచ్చట పెరిగావు
    ముచ్ఛట తీరగ మసలావు
    చీకటి వేళల జనియించి
    వెలుగుల పూవులు పూయించి
    జగతిని మత్తున ముంచేవు
    పల్లెకు గుట్టుగ సాగేవు
    వరములు తీర్చగ అరుదెంచి
    శాపము తీర్చగ చరియించి
    నిశ్చల స్థితిని నిలిచేవు
    స్థితి కారకునిగా తెలిసేవు
    గోవింద నామాన మురిసేవు
    పలుమార్లు కీర్తిగా బడసేవు
    ఘనమగు స్మరణగ తెలిసేవు
    గగన వీధుల మెరిసేవు
    అవతరించుటే అర్ధమని
    కరుణించుటయే యోగమని
    పరి పరి విధముల అరుదెంచి
    ప్రక్షాళన గావించావు
    నల్లని రూపున మెరిసేవు
    చల్లని చూపుల విరిసేవు
    ఏక పక్షమున నిలిచేవు
    ఏనాటికి జయమును కూర్చేవు
    హరి హరి హరి హరి గోవింద
    హరి నారాయణ గోవింద
    ముకుంద మాదవ గోవింద
    మధుసూదన హరి గోవింద .......2

КОМЕНТАРІ •