Sankatahara Chaturdhi || Angaraka Chaturdhi || సంకటహర చతుర్థి || అంగారక చతుర్థి

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2023
  • సంకటహర చతుర్థి || అంగారక చతుర్థి
    ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి.
    పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం గణపతిని పూజించి, ఉండ్రాళ్ళు, మోదకములు మొదలైనవి నైవేద్యంగా పెట్టి, చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రునికి, చతుర్థీ దేవతకు అర్ఫ్యప్రదానం చేసిన తరువాత ప్రసాదాన్ని స్వీకరించలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించడం కష్టనివారణం, అభీష్టదాయకం.
    సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!
    ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.
    ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.
  • Розваги

КОМЕНТАРІ •