ఎమ్మెల్యే కురుగొండ్ల సీరియస్ యాక్షన్..

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్న టిట్కో ఇళ్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు.
    తిట్కో ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారుల వద్దకు స్వయంగావెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి వసతితో పాటు, డ్రైనేజీ,కరెంటు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు..
    టిట్కో ఇళ్ల వద్ద రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని మద్యం సేవిస్తూ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. దీని మీద వెంటనే స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ జిత్వ నాయక్ పిలిపించి ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు.
    మా పార్టీ మీ పార్టీ అని తేడా లేకుండా ఎవరికైనా కఠిన శిక్ష విధించాలన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇల్లు అద్దెకిచ్చిన వారి గృహాలను పట్టా క్యాన్సల్ చేయాలని కోరారు.. లబ్ధిదారి కాకుండా అందులో వేరే ఎవరైనా కాపురం ఉంటే వారి పట్టాలను పరిశీలించి వారు లేకుంటే ఆ ఇంటి పట్టాను రద్దు చేయాలని కమిషనర్ కు తెలిపారు.
    టిట్కో ఇళ్లలో స్వయంగా లబ్ధిదారులే నివసించాలన్నారు. అద్దెకు ఇచ్చిన లేక ఆ గృహాన్ని అమ్మిన వారి పట్టా రద్దు చేయబడుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాకు తెలియజేశారు... #venkatagiri #vgrnews #tdp
  • Розваги

КОМЕНТАРІ • 4