మహాభారతములో బభ్రువాహనుడు-1 | అర్జునుడు తీర్థయాత్రకు బయల్దేరుట | Brahmasri Chaganti KoteswaraRao garu

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • "మహాభారతములో బభ్రువాహనుడు - అర్జునుడు తీర్థయాత్రకు బయల్దేరుట"
    పంచమ వేదమైన మహాభారతములోని అనేక వ్యక్తులు, వారి వ్యక్తిత్వముల నుండి మనం అనేక విషయములు నేర్చుకోవచ్చు. అనేక మాధ్యమముల వలన మహాభారతములోని అనేక మంది వ్యక్తులను గూర్చి అనేక అపోహలు, అపార్థములు ఏర్పడినవి. వాటిని తొలగించి, అందరికీ ఆయా వ్యక్తులను గూర్చి వ్యాసుడు, కవిత్రయము ప్రతిపాదించిన విషయములను తెలియజేయుటకు పూజ్య గురుదేవులు, ప్రవచన సార్వభౌమ బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన మహోన్నత ఉపకారము - మహాభారతములోని వ్యక్తులు అన్న శీర్షికతో అనేక మంది వ్యక్తులను గూర్చి సమగ్రముగా చేసిన ప్రవచనముల పరంపర.
    ఈ పరంపరలో భాగముగా పూజ్య గురువుగారు మహాభారతములో బభ్రువాహనుని వ్యక్తిత్వము, మనము నేర్చుకోవలసిన విషయములను గూర్చి అద్భుత ప్రవచనములు చేసారు.
    "మహాభారతములో బభ్రువాహనుడు - అర్జునుడు తీర్థయాత్రకు బయల్దేరుట" ఘట్టమును గూర్చి పూజ్య గురుదేవులు చేసిన అద్భుత ప్రసంగము ఈ సంచికలో...
    #srichagantivaani #chagantikoteswararaogaru #chagantipravachanam #Chaganti#srichaganti #mahabharatham #Babruvahana#Babruvahanudu#bharatam #chagantikoteswararaospeecheslatest

КОМЕНТАРІ •