Sapthapadhi Sabita Bhamidipati

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 5

  • @vijaygopal5819
    @vijaygopal5819 10 місяців тому +3

    సప్తపది
    ఒక అద్భుతమైన సినిమా, లేదు ఒక కళా ఖండం అనాలేమో...
    సామాజిక రుగ్మతలకు సంస్కరణ, అడుగంటిపోతున్న భారతీయ సంప్రదాయ సంగీత నాట్యాలకు ప్రాధాన్యం, సనాతన భారతీయ సంస్కృతి, హావ భావాల మీదే సినిమా నీ నడిపించడం, 80 దశకాలలో పల్లెల్లో వుండే జీవన విధానం,ఇలా ఎన్నో అద్భతమైన విషయాలను పొందుపరుచుకున్న సినిమా....
    *కథ*
    ఒక నిష్ఠ కలిగిన గుడి పూజారి మనసా వాచా కర్మణా పరస్త్రీ ని తల్లిగా చూసే తన మనవడికి (కొడుకుకి కొడుకు) ఒక గొప్ప నర్తకి అయిన తన మనవరాలు (కూతురు కూతురు) కి పెళ్లి చేస్తాడు. పెళ్లికి ముందే తన మనవరాలు ఒక హారిజనుడిని ప్రేమించింది అన్న విషయాన్ని పెళ్ళైన తర్వాత తెలుసుకొని ఆ హరిజనుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు...
    అప్పటి సమాజానికి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న తన చర్యను శాస్త్రాన్ని వుటంకిస్తూ సమర్ధిస్తాడు......
    *నన్ను బాగా ఆకట్టుకున్నవి*
    ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల కంటే మానవత్వం మే గొప్పది అని చూపించి విశ్వనాధ్ గారు ఒకరకంగా సాహసమే చేశారు అనాలి...
    శ్రుతి స్మృతి విరోధేతు శ్రుతి యేవ గరియసి (శ్రుతి స్మృతుల మధ్య విరోధం వున్టే, శ్రుతి దే పై చేయి) అన్న వాక్యానికి అద్దం పడ్తుంది ఈ సినిమా....
    పర స్త్రీ లో కేవలం తల్లిని మాత్రమే చూడగల ఒక పాత్ర ని (మనవడి పాత్ర) సృష్టించి ఆ విషయాన్ని ఎంతో అందంగా మనచేత ఒప్పించిన విధానం. కేవలము పురాణ కథల్లోనే కనపడే ఆ పాత్రను ఒక సామాజిక సినిమా లో చూపించి అప్పటి ఇప్పటి ఎప్పటి సమాజానికి అయినా వర్తిస్తుంది అని నిరూపించారు....
    పెళ్లి అంటే రెండు మనసుల కలయిక అనీ కేవలం శోభనానికి ముందు జరిగే తంతు కాదని, జన్మతో ప్రతీ ఒక్కడు శూద్రుడేనని, కర్మ వలన మాత్రమే బ్రాహ్మణత్వం వస్తుందని శాస్త్రాలను వుటంకిస్తూ అప్పటి ఛాందసులకు చురక అంటిచిన విధానం.....
    గుడి పూజారి (తాత) అప్పటిదాకా తను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకుని తన అవివేకాన్ని ఎటువంటి అహం లేకుండా దిద్దుకుని చూపించిన విజ్ఞత అమోఘం.....
    మహానారాయనోపనిషత్ లోని దుర్గా సుక్తానికి నాట్యాన్ని జోడించి చూపించిన ఆలోచన, విధానం.... మాటలు లేవు.....
    ఇంకా, జానకమ్మ, కె వి మహదేవన్, వేటూరి, శేషు (నాట్యాచార్యుడు), హేమ (కథానాయకి) ల కలయిక మహాద్భుతం......
    *ఒక చిన్న సద్విమర్శ*
    విమర్శ అనాలో లేక సందేహం అనాలో.....
    'మరుగేలరా ఓ రాఘవా' అన్న త్యాగరాజు గారి కీర్తనను కథానాయకుడు కథానాయిక ల ఒక ప్రేమ గీతంలా పెట్టటం ఎంతవరకు సబబు? మిగతా దర్శకులు అయితే అనుకోవచ్చు, కానీ విశ్వనాథ్ గారి లాంటి దర్శకుడు ఇలా పెట్టరేంటి అని అనిపిస్తుంది. కానీ, ఈ రకంగా సమాధాన పరుచుకోవచ్చేమో.....
    ఈ సినిమా లో కథానాయకుడు నాయికను ఒక దేవత లాగా ఆరాధిస్తాడు. మనం అను నిత్యం చూసే ప్రేమ కథ ల కంటే పది మెట్లు ఎక్కువ స్థాయిలో వున్నందున, ఆ పాట కొంత వరకు సబబేనేమో...
    చివరగా సప్తపది పది కాలాల పాటు చిరస్థాయిగా ఉండగలిగే ఒక అపురూపమైన కళాఖండం...
    మనం మళ్ళీ మళ్ళీ చూసి భద్రపరచుకోవాలి మరి!!!!
    గడిచిన 5 వేల సంవత్సరాలుగా అగ్ర వర్ణాలు అయిన బ్రాహ్మణ, క్షత్రియులు ఇంత పరిణితి (కనీసపు మానవతా విలువలు) ప్రదర్శించి వున్నట్లయితే, వర్ణ వ్యవస్థ భారత దేశంలో ఇంత భ్రష్టు పట్టేది కాదేమో, తద్వారా వేయి సంవత్సరాల పై పడిన దాస్యం వుండి వుండేది కాదేమో....

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 2 роки тому +3

    Aa movie ne oka adhbhutham.Interesting movie.

  • @silencespeaks5455
    @silencespeaks5455 2 роки тому +2

    One of the best KV movies. Salute him for such landmark movies

  • @sundarshanmugam4306
    @sundarshanmugam4306 Рік тому +1

    na thakkada vedio cassette unnayi ippudukooda

    • @sainellore6874
      @sainellore6874 5 місяців тому

      Ee kaalamlo cassettes pettukuni emi chestunnarandee babu!