నవదుర్గా స్వరూపిణి || అమ్మవారి పాట || గాయని నాగేశ్వరి రూపాకుల
Вставка
- Опубліковано 6 лют 2025
- నవదుర్గా స్వరూపిణి నవనవ లావణ్య దుని || దేవి నవరాత్రుల పాట || గాయని నాగేశ్వరి రూపాకుల
దేవినవరాత్రుల పాట
పల్లవి
నవదుర్గాస్వరూపిణి
నవనవ లావణ్య దుని
నవరాత్రులపూజల
నిన్నవలోకింతును సదా
జగజ్జననిజగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి ||
1.చరణం
త్రిలోకములవెలిగించే త్రిపుర సుందరి
చతుర్వేదరూపిణి జనని గాయత్రి
ఆయువిచ్చుప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ
మహితవీర యోగమూర్తి మహిషాసుర మర్ధిని
అఖిలరూపధారిణివై అవతరించు ఆదిశక్తి
నీకరుణల కలిమి చాలు అదే కదా ముక్తి ||
2.చరణం
కాలంబులనియతించే శ్రీ మహా కాళిక
వాగ్బుద్ధిజ్ఞానమై హే మహా సరస్వతి
సంపదలకుసాకారం జననీ మహాలక్ష్మి
జగములశాసించి బ్రోచు రాజరాజేశ్వరి
లాలిత్యమునకునెలవై రాజిల్లే లలితాంబ
పదములకడ సుతుడనమ్మ పాలించుమమ్మా ||