పోలవరంతో గోదావరి వరదకు తుళ్లింత ఎందుకో?

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • #meil #polavaram #godavari #lifelineofandhrapradesh
    పోలవరంతో గోదావరి వరదకు తుళ్లింత ఎందుకో?
    గోదావరి నది పేరు చెబితే గోదావరి జిల్లాలు, పాపికొండలు, రాజమహేంద్రవరం, భద్రాచలంతో పాటు శబరి, ప్రాణహిత, కిన్నెరసాని లాంటి ఉపనదులు... బాసరలో సరస్వతి, కాళేశ్వరంలో శివుడు, భద్రాచలంలో సీతారాములు ఇలా ఎన్నో గోదావరి నదితో నేరుగా అనుబంధం పెనవేసుకున్నాయి. రైతులు, వ్యవసాయం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎందుకంటే ప్రతి ఏడాది కాస్త అటుఇటుగా 50 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగునీరు అందిస్తూ రైతుల మోమూలో పచ్చదనం నింపుతోంది.
    అదే సమయంలో గోదావరి అనగానే పోలవరం గుర్తుకు వస్తుంది. ఇది ఉభయ గోదావరి జిల్లాల జీవనాడిగా చెబుతున్నప్పటికీ మొత్తం అభివృద్ధికే జీవనాడిగా చరిత్రలో నిలిచిపోతుంది.
    మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ గొప్పతనం ఏమిటి..? నదులపై చాలా ప్రాజెక్ట్ లు కుడుతుంటారు. కానీ పోలవరానికి ఇతర ప్రాజెక్ట్ లకు తేడా ఏమిటి...? ఎందుకింత పోలవరం ప్రత్యేకమైనది...? పోలవరం ద్వారా అసలు సాధించే ప్రయోజనాలు ఏంటి..? గోదావరి వరద నీటిని వినియోగించుకోవడానికి పోలవరం మాత్రమే ప్రత్యామ్నాయమా...? ఇవన్నీ తెలుసుకోవాలంటే గోదావరి కథను ఈ నదిపై నిర్మించిన, నిర్మిస్తోన్న పథకాలను ముందు తెలుసుకుందాం..
    ఇంతటి అఖండ గోదావరికి దక్షిణ గంగగా పేరొచ్చిందంటే దాని ప్రయోజనాలు, ఫలాలు సామన్యమైనవేవి కావు. అయినప్పటికీ ప్రతి ఏటా సరాసరిన 2500 టిఎంసీల నీరు సముద్రపాలవుతోంది. ఈ ఏడాది దేశంలో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. తొలుత దక్షిణ భారతదేశానికి విస్తరించిన తరువాత ఉత్తర భారతానికి విస్తరిస్తాయి. కానీ పర్యావరణ మార్పుల కారణంగా ఈ వర్షాకాలంలో ఉత్తరాదిన ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్టాల్లో తీవ్ర వరద భీభత్సం స్రష్టించింది. దక్షిణాదిన మాత్రం ఇప్పటికీ అవసరమైన స్థాయిలో వరదలు కాదు కదా వర్షాలే లేవు. అంతో ఇంతో తెలంగాణలో అది కూడా గోదావరి పరివాహాక ప్రాంతంలోనే మంచి వర్షాలు కురుస్తున్నాయి.
    సాధారణంగా గోదావరికి ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ కాలంలో వరదలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది గత సంవత్సరంలాగానే ముందుగానే వరద మొదలైంది. ఇప్పటికీ దాదాపుగా 9 లక్షల క్యుసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. గోదావరిలో ఇంత స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నా, నీరు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు అవసరమైన నీటిని అన్ని ప్రాంతాల్లోనూ అందించలేని పరిస్థితి ఇప్పటికీ నెలకొంది. అందుకు కారణం ఓ వైపు గోదావరి నది దిగువన ప్రవహిస్తుడడం. ఎక్కడైనా నదులు లోయ, దిగువ ప్రాంతాల్లోనే ప్రవహిస్తాయి. కానీ గోదావరికి వచ్చేసరికి ఇది మరింత ఎక్కువ. సముద్ర మట్టానికి దాదాపు సమాంతరంగా ఉందా అన్నట్లు ఈ నది ప్రవహిస్తోంది. రెండు వైపుల ఉన్న ప్రాంతాలు, వ్యవసాయ భూములు ఎత్తైన ప్రాంతంలో అంటే సరాసరిన సముద్రమట్టానికి 60 మీటర్ల ఎగువన ఉంటాయి. తెలంగాణకు వచ్చేసరికి ఇది 90 మీటర్లపైనే ఉంటుంది. అందువల్ల గోదావరి నీటిని ఒడిసి పట్టి ఆయకట్టుకు నీరందించడం అంత సులభం ఏమీ కాదు.
    గోదావరి నది, దాని ఉపనదులపై ఇప్పటికే పలు ప్రాజెక్టులు అంటే జలాశయాలు నిర్మించారు. అవి సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలు. అలాగే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ కూడాను. అయితే ఇవన్నీ పెద్దగా నీటి నిల్వ సామర్థ్యం లేనివి. గరిష్టంగా శ్రీరాంసాగర్ లో మాత్రమే 90 టిఎంసీల నీటి నిల్వ సాధ్యమవుతుంది. ఇక సింగూరు, నిజాం సాగర్, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ లు అన్నీ కలిపితే దాదాపు 55 టిఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు.
    ఇవి కాకుండా దాదాపు 15 ఏళ్ళ క్రితం శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మించారు. ఇది కూడా 20 టిఎంసీలే. కాళేశ్వరం పథకంలో భాగంగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి బ్యారేజ్ లను నిర్మించారు. ఇవి కేవలం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంపింగ్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే ఇంటెక్ వెల్స్ లేదా సర్జ్ పూల్స్ లాంటివి మాత్రమే. ఇక ఖమ్మం జిల్లాలో సమక్క సాగర్, సీతారామసాగర్ బ్యారేజ్ ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో సమక్క సాగర్ లో నీటి నిల్వ సాధ్యమవుతుంది.
    మొత్తం మీద గోదావరి నది నుంచి సరాసరిన 2500 టిఎంసీల నీరు సముద్రం పాలువుతుంటే గరిష్టంగా నిల్వ చేయగలుగుతున్నది 200 టిఎంసీల లోపు మాత్రమే. అంటే 10 శాతం లోపు మాత్రమే నీటిని నిల్వ చేయలగుతున్నాం. ఇది కాకుండా ఆయకట్టుకు గోదావరి డెల్టాతో సహా కలుపుకొని 2 పంటలకు మహా అయితే మరో 300 టిఎంసీల నీటిని వాడుకుంటున్నామేమో. అయినప్పటికీ భారీగానే వరద నీరు వృధా అవుతోంది. ఈ సీజన్ లో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి అంటే రాజమండ్రి సమీపంలోని ధవలేశ్వరం వద్ద గరిష్టంగా దాదాపు 5 లక్షల క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటి దాకా అంటే జూన్ 1 నుంచి జులై 21వ తేది దాకా 78 టిఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పారింది. అంటే దాదాపు శ్రీరాంసాగర్ జలాశయంలో నిల్వ చేసేంత నీరు ఇప్పటికే సముద్రం పాలయ్యింది. తాజాగా క్రిష్ణా డెల్టాను ఆదుకునేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపింగ్ ప్రారంభించారు. ఎగువ భాగంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంప్ చేసి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేవిధంగా జలాశయాలు, చెరువులు, కుంటలు నింపుతున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీరందడంతోపాటు భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్లా ద్వారా సేధ్యం సులభమవుతోంది. గోదావరి డెల్టాలో పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టాలకు సరాసరిన 13000 క్యుసెక్కుల నీటిని అందిస్తున్నారు.
    Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

КОМЕНТАРІ •